ఉదయం జస్ట్ 30 నిమిషాలు నడిచినా.. ఎన్ని రోగాలు తగ్గిపోతాయో..!
మార్నింగ్ వాక్ వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. మార్నింగ్ వాక్ మనస్సును, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. నడక శరీరమంతా రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. ఇది ఎన్నో రోగాలను నయం చేస్తుంది.

morning walking
ఉదయం నడక శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఎన్నో ప్రమాదకరమైన శారీరక సమస్యలను తగ్గిస్తుంది. కానీ ఒక రోజు మాత్రమే మార్నింగ్ వాక్ కు వెళ్లి, ఆ తర్వాత మూడు రోజులు విరామం తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని నిపుణులు చెబుతున్నారు. శరీర అవయవాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వ్యాయామం, నడక ఎంత అవసరమో.. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఆహారం కూడా అంతే అవసరం. మీరు వ్యాయామం చేయకపోతే కనీసం ఉదయం 30 నిమిషాలైనా నడవడం అలవాటు చేసుకోండి.
ప్రతిరోజూ ఉదయాన్నే 30 నిమిషాలు నడిస్తే శరీరంలోని ఎన్నో ప్రమాదకరమైన వ్యాధులు నయమవుతాయి. మార్నింగ్ వాక్ వల్ల శరీరంలోని ఏ ఒక్క భాగానికి ప్రయోజనం ఉండదు. కానీ మొత్తం శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. రోజూ ఉదయం 30 నిమిషాల నడక వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
గుండె ఆరోగ్యంగా ఉంటుంది
ఉదయాన్నే వాకింగ్ చేస్తే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ బాగా తగ్గుతుంది. ఈ చెడు కొలెస్ట్రాల్ గుండె పోటు, గుండె జబ్బుకు దారితీస్తుంది. ఈ మార్నింగ్ వాక్ వల్ల కొలెస్ట్రాల్ తగ్గి గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
రక్తపోటు నియంత్రణ
ప్రతి రోజూ 30 నిమిషాలు నడవడం వల్ల అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అందుకే అధిక రక్తపోటు రోగులు ప్రతిరోజూ నడవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
బరువు తగ్గుతారు
ప్రతిరోజూ 30 నిమిషాలు నడవడం వల్ల పెరుగుతున్న బరువును నియంత్రించొచ్చు. మీకు తెలుసా? నడక వల్ల కేలరీలు ఖర్చవుతాయి.
డయాబెటిస్ లో నడక ప్రయోజనకరంగా ఉంటుంది
మధుమేహంతో బాధపడేవారికి నడక ప్రయోజనకరంగా ఉంటుంది. వీళ్లు ప్రతిరోజూ ఉదయం కనీసం 30 నిమిషాలు నడిస్తే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. దీనితో పాటుగా మంచి డైట్ ఫాలో అయితే ప్రయోజనం ఉంటుంది.
కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం
కీళ్ల నొప్పులతో బాధపడేవారికి నడక మంచి మేలు చేస్తుంది. కీళ్ల నొప్పులతో బాధపడేవారు ప్రతిరోజూ 30 నిమిషాలు నడిస్తే మీ కండరాలు బలోపేతం అవుతాయి. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.