పచ్చి పసుపుతో ఎన్ని లాభాలున్నాయో..!
ఎన్నో ఔషధ గుణాలున్న పసుపు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే ప్రతి వంటగదిలో పసుపు ఖచ్చితంగా ఉంటుంది. అయితే పచ్చి పసుపు కూడా మనకు ఎంతో మేలు చేస్తుంది. పచ్చి పసుపు అల్లం లాగే కనిపిస్తుంది. కానీ లోపల ఇది పసుపు రంగులో ఉంటుంది. ఆయుర్వేదంలో దీనిని ఔషధంగా ఉపయోగిస్తారు.
Image: Getty
పసుపు ఎన్నో ఔషదగుణాలున్న పదార్థం. ఇది ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. పసుపు ఫుడ్ రుచిన పెంచడంతో పాటుగా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే పచ్చి పసుపు కూడా మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పచ్చి పసుపు శరీరం మంటను తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే ఆర్థరైటిస్, గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. పచ్చి పసుపును తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
Image: Getty
యాంటీ ఆక్సిడెంట్లకు మూలం
పచ్చి పసుపు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది. దీన్ని తీసుకోవాలంటే? గ్రైండ్ చేసి తర్వాత వేడి నీటిలో కలపండి. రుచి కోసం కొద్దిగా తేనెను కలిపి తాగండి. ఈ డ్రింక్ ను క్రమం తప్పకుండా తాగితే శరీరంలోని విష పదార్థాలన్నీ బయటకు పోతాయి. ఈ పసుపు పానీయం డిటాక్స్ డ్రింక్ గా కూడా పని చేస్తుంది.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
పచ్చి పసుపు కూడా జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, అజీర్థి సమస్య తగ్గుతుంది. ఇది మన గట్ ఆరోగ్యాన్ని కూడా మెరుగ్గా ఉంచుతుంది. పచ్చి పసుపు జీవక్రియను కూడా పెంచుతుంది. దీంతో మీరు బరువు తగ్గుతారు.
రోగనిరోధక వ్యవస్థ బలోపేతం
పచ్చి పసుపులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. పచ్చి పసుపు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. రోగనిరోధక శక్తి పెరగడానికి ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు వేడి పాలలో పసుపు పొడిని కలపండి. ఈ పసుపు ఎన్నో అంటువ్యాధులు, ఇతర రోగాలను రాకుండా చేస్తుంది.
Image: Freepik
నొప్పి నుంచి ఉపశమనం
పచ్చి పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి. ఇది నొప్పిని తగ్గిస్తుంది. ఆర్థరైటిస్, కండరాల నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. ఆయుర్వేదంలో పసుపును ఔషధంగా ఉపయోగిస్తారు. మీకు తరచు నొప్పి సమస్య వస్తే పసుపు పాలను తాగండి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
Image: Getty
చర్మానికి మేలు
పోషకాలు పుష్కలంగా ఉండే పచ్చి పసుపు మన చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అలాగే చర్మానికి సంబంధించిన సమస్యలు కూడా తగ్గిపోతాయి. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు స్కిన్ ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది. అలాగే మొటిమలు కూడా తగ్గిపోతాయి. పచ్చి పసుపు పేస్ట్ ను వారానికి ఒకసారి ముఖానికి అప్లై చేస్తే మీ ముఖం అందంగా, కాంతివంతంగా కనిపిస్తుంది.