MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • బ్రేక్ ఫాస్ట్ లో బొప్పాయిని తింటే..!

బ్రేక్ ఫాస్ట్ లో బొప్పాయిని తింటే..!

బొప్పాయిలో మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉంటాయి. దీన్ని తింటే ఎన్నో పోషక లోపాలు పోతాయంటున్నారు నిపుణులు. మరి దీన్ని ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో తింటే ఏమౌతుందో తెలుసా?  

1 Min read
Author : Mahesh Rajamoni
Published : May 28 2023, 07:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
papaya

papaya

బొప్పాయిని చాలా మంది ఇష్టంగా తింటారు. ఎందుకంటే ఇది తీయగా, టేస్టీగా ఉంటుందని. నిజానికి బొప్పాయిలో శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు ఉంటాయి. బొప్పాయిలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లతో పాటుగా ఎన్నో ముఖ్యమైన ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి పండును మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో తప్పకుండా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

25

బ్రేక్ ఫాస్ట్ లో ఒక గిన్నె బొప్పాయిని తినడం వల్ల మన శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు లభించడమే కాకుండా రోజంతా శక్తివంతంగా ఉండటానికి ఇది సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఫైబర్, ప్రోటీన్ లు పుష్కలంగా ఉన్న బొప్పాయి ఎక్కువ ఆకలిని తగ్గించడానికి సహాయపడుతుంది. దీనిలోని ఫైబర్ కడుపు నొప్పి, ఇతర జీర్ణ సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా బొప్పాయి బరువును తగ్గించడానికి, అనవసరమైన అదనపు కిలోలను తగ్గించడానికి సహాయపడుతుంది.

35
papaya

papaya

బొప్పాయిని తినడం వల్ల చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మొటిమలు వంటి సమస్యలను నివారిస్తుంది. అంతేకాదు ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలోని విషాన్ని బయటకు పంపడానికి, శరీరంలో రక్త ప్రవాహాన్ని నియంత్రించడానికి సహాయపడతాయి. అలాగే చర్మం సహజ ప్రకాశాన్ని ప్రోత్సహించడానికి సహాయపడతాయి.

45

బొప్పాయిలో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది వివిధ సీజనల్ వ్యాధులను నివారించడానికి సహాయపడుతుంది. మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్ సి శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే శరీరంలో మంటను నివారించడానికి సహాయపడుతుంది.
 

55
Papaya

Papaya

డయాబెటిస్ ఉన్నవారు బొప్పాయిని తినొచ్చా?

ఎన్నో ఇతర పండ్ల మాదిరిగా కాకుండా.. బొప్పాయి డయాబెటిస్ ఉన్నవారు తినగలిగే ఉత్తమ పండ్లలో ఒకటి. ఎందుకంటే ఇందులో ఫైబర్  పుష్కలంగా ఉంటుంది. దీనిలో షుగర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. ఫైబర్స్ శరీరంలో గ్లూకోజ్ అకస్మాత్తుగా పెరగకుండా కాపాడుతాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతాయి. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు డాక్టర్ సలహా మేరకే ఆహారంలో మార్పులు చేసుకోవాలి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Green Tea: రోజూ ఓ కప్పు గ్రీన్ టీ తాగితే ఏమవుతుంది?
Recommended image2
Gas Relief Tips: ఈ ఒక్క డ్రింక్‍తో కడుపు ఉబ్బరం, గ్యాస్‌ సమస్య దూరం!
Recommended image3
Ghee Benefits: పిల్లలకు రోజూ నెయ్యి ఎందుకు పెట్టాలో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved