వేపాకులతో ఎన్ని లాభాలో..!
వేప చెట్టులోని ప్రతి భాగం మనకు ప్రయోజనకరంగానే ఉంటుంది. వేప ఆకులు, వేర్లు, కాండం, చిగుళ్లు, విత్తనాలు, దీని నూనె కూడా ప్రయోజకరంగానే ఉంటాయి.

వేప గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వేప రుచి చేదుగా ఉన్నా.. దీనిలో ఎన్నో ఔషదగుణాలు ఉంటాయి. వేప అన్ని భాగాలను వేర్లు, కాండం, ఆకులు, చిగుళ్ళు, విత్తనాలు, నూనె లను ఆరోగ్య ప్రయోజనాల కోసం ఉపయోగించొచ్చు. ఇది అద్భుతమైన శీతలీకరణ ఏజెంట్. ఇది హైపర్ అసీడిటీ, మూత్ర మార్గ రుగ్మతలు, చర్మ వ్యాధులను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.
neem leaves
వేప ఆకులను ఉపయోగించి ఎన్నో సమస్యలను తగ్గించుకోవచ్చు. వేప ఒక సహజ నిర్విషీకరణ. ఇది పిత్తాన్ని సమతుల్యం చేస్తుంది. వాతను పెంచుతుంది. అలాగే వేపాకుకలు కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి.
neem tree
వేప జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఇది అలసట, దగ్గు, దాహం నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. వేప గాయాలను శుభ్రపరుస్తుంది. తొందరగా నయం అయ్యేందుకు సహాయపడుతుంది. అలాగే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు, పరాన్నజీవులకు వ్యతిరేకంగా పనిచేస్తుంది.
వేప ఆకులు వికారం, వాంతుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే శరీరంలో మంటను తగ్గించేందుకు కూడా సహాయపడుతుందని వైద్యపరంగా నిరూపించబడింది. వేప పొడి నీరు లేదా తేనెతో పేస్ట్ లా చేసి చర్మం లేదా గాయాలకు అప్లై చేయడం వల్ల అవి తొందరగా తగ్గిపోతాయి.
<p>neem</p>
స్నానానికి - వేప పొడిని లేదా వేప ఆకులను వేడినీటిలో మరిగించి స్నానం చేయడానికి ఉపయోగించొచ్చు. చుండ్రు, తెల్ల జుట్టుతో బాధపడుతున్న వారు ఈ నీటిని ఉపయోగించొచ్చు. వేపఆకులు చుండ్రును పోగొడుతాయి. జుట్టును షైనీగా మారుస్తాయి.
హెర్బల్ టీ - వేపనీటి కషాయం ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. అందుకే ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు ఈ వేపాకుల కాషాయం తాగుతుంటారు. ఎందుకంటే ఇది గాయాన్ని త్వరగా నయం చేయడానికి సహాయపడుతుంది.
అయితే వీటిని తినాలనుకునే వారు.. 7-8 వేప ఆకులను 2 వారాల పాటే నమలాలి.ఇకపోతే నెల రోజుల పాటు 1-2 వేప మాత్రలను మాత్రమే వేసుకోవాలి. 10-15 వారాల పాటు 2-3 మి.లీ వేప రసం తాగాలి. వేప కొమ్మలను మీ దంతాలను బ్రష్ చేయడానికి ఉపయోగించొచ్చు.
নিমের ছবি
మధుమేహం, చర్మవ్యాధులు, జ్వరం, రోగనిరోధక శక్తి, జ్వరాలు మొదలైన సమస్యల చికిత్సకు వేపను అన్ని రూపాల్లో ఉపయోగించొచ్చు. అంటే మాత్రలు, పౌడర్లు, జ్యూసుల రూపంలో తీసుకోవచ్చు. అయితే ఇది రోగి పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది.