మ్యూజిక్ థెరపీ ఎన్ని రోగాలను నయం చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు
మ్యూజిక్ ను వినడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నిజానికి మ్యూజిక్ మన మన మనస్సును రిలాక్స్ చేయడమే కాదు ఇది ఒత్తిడి, నిరాశల నుంచి ఎన్నో రోగానలు దూరం చేస్తుంది. అసలు మ్యూజిక్ థెరపీతో ఎన్ని అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
మనలో చాలా మంది మ్యూజిక్ ను ప్రతిరోజూ వింటుంటారు. పని చేస్తున్నప్పుడు, మెట్రోలో వెళుతున్నప్పుడు మ్యూజిక్ ను ఎంజాయ్ చేసేవారున్నారు. నిజానికి మ్యూజిక్ మనకు ఆనందాన్ని కలిగించడమే కాదు.. ఇది మన ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అవును మ్యూజిక్ కూడా థెరపీ లాగే పనిచేస్తుంది. అవును మ్యూజిక్ ఎన్నో మానసిక సమస్యలను నయం చేస్తుంది. మనస్సును శాంతపరిచే పాటలు కండరాల ఉద్రిక్తతను తగ్గిస్తుంది. మ్యూజిక్ ఒత్తిడి, నిరాశ, యాంగ్జైటీలను తగ్గిస్తుంది. అంతేకాదు మ్యూజిక్ మనకున్న ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. అసలు మ్యూజిక్ థెరపీ ఎలాంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ఒత్తిడి
ఒత్తిడి మానసిక ఆరోగ్యాన్నే కాదు శారీరక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. అయితే ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం చేయాలని చాలా మంది సలహానిస్తూ ఉంటారు. అయితే ఒత్తిడికి గురైనప్పుడు తేలికపాటి సంగీతాన్ని విన్నా.. మీ మనస్సు ప్రశాంతంగా మారుతుంది. అలాగే ఒత్తిడి కూడా ఇట్టే తగ్గిపోతుంది. అందుకే మీరు ఒత్తిడికి లోనైనప్పుడు మీకు నచ్చిన పాటలను వినండి.
పార్కిన్సన్, అల్జీమర్స్
పార్కిన్సన్ వ్యాధితో బాధపడేవారు చాలా మందే ఉన్నారు. ఈ వ్యాధి వల్ల వణుకుతూనే ఉంటారు. అలాగే అల్జీమర్స్ వల్ల ఎన్నో విషయాలను మర్చిపోతుంటారు. ఇలాంటి ప్రమాదరకమైన వ్యాధులకు మందులను ఖచ్చితంగా ఏసుకోవాలి. అలాగే మ్యూజిక్ థెరపీ కూడా తీసుకోవాలని నిపుణులు సలహానిస్తున్నారు.
మానసిక స్థితి
మీ మూడ్ బాగాలేనప్పుడు మీకు నచ్చిన సంగీతాన్ని వినండి. నిజానికి సంగీతం మీ మూడ్ ను మంచి స్థితిలోకి తెస్తుంది. మ్యూజిక్ థెరపీ మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. మీకు తెలుసా? మ్యూజిక్ మన మనసును రిలాక్స్ చేస్తుంది. అలాగే మ్యూజిక్ హ్యాపీ హార్మోన్లను రిలేజ్ అయ్యేలా చేస్తుంది.
Image: freepik.com
అలసట నుంచి ఉపశమనం
రోజువారి పనుల వల్ల మనం బాగా అసలిపోతుంటాం. ఈ అలసట మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అయితే మీకు అలసటగా అనిపించినప్పుడల్లా మీరు మీకు నచ్చిన పాటలను వినండి. నిపుణుల ప్రకారం.. మనం పాటలను వినడం వల్ల అలసట కొంతవరకు తగ్గుతుంది. అందుకే చాలా మంది అలసిపోయినప్పుడు ఇష్టమైన పాటలను వింటుంటారు.
Image: freepik.com
డిప్రెషన్
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. సంగీతానికి ఎన్నో అనారోగ్య సమస్యలను నయం చేసే సామర్థ్యం ఉంటుంది. అయితే ఇది మన శరీరానికే కాదు మనస్సుకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. సంగీతాన్ని వింటే యాంగ్జైటీతో పాటుగా ఒత్తిడి కూడా ఇట్టే తగ్గిపోతాయి.