ఈ విషయం తెలిస్తే నవ్వకుండా అస్సలు ఉండలేరు
laughter: నవ్వితే ముఖం వెలిగిపోవడమే కాదు.. ఎన్నో శారీరక, మానసిక ప్రయోజనాలు కూడా కలుగుతాయి తెలుసా? మనం మనస్ఫూర్తిగా నవ్వితే ఒత్తిడి తగ్గడం నుంచి ఇమ్యూనిటీ పవర్ పెరగడం వరకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

నవ్వు
సందర్భాన్ని బట్టి నవ్వు, కోపం, దు:ఖం లాంటివి వస్తుంటాయి. ఇది చాలా కామన్. కానీ మనం నవ్వడం వల్ల ఒకటి కాదు రెండు కాదు బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి తెలుసా? నవ్వు మనకు మంచి మెడిసిన్ లా పనిచేస్తుంది. ఒక చిన్న చిరునవ్వు ఎన్నో శారీరక, మానసిక సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. అసలు నవ్వుతో మనకు కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
నవ్వుతో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి?
ఒత్తిడి తగ్గుతుంది
ఒత్తిడి సమస్యలా అనిపించకపోవచ్చు. కానీ ఇది ఒక్క మానసిక ఆరోగ్యాన్ని మాత్రమే కాదు.. శారీరక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. అయితే ఈ ఒత్తిడిని తగ్గించేందుకు నవ్వు ఉపయోగపడుతుంది. నవ్వడం వల్ల మన శరీరంలో ఒత్తిడికి కారణమయ్యే కార్డిసాల్ హార్మోన్ లెవెల్స్ తగ్గుతాయి.
దీంతో ఒత్తిడి, ఆందోళనలు చాలా వరకు తగ్గుతుంది. అలాగే మీరు ప్రశాంతంగా ఉంటారు. ప్రతిరోజూ మనస్ఫూర్తిగా కొద్దిసేపు నవ్వినా ఒత్తిడి తగ్గి మీరు ఆరోగ్యంగా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది
మన ఇమ్యూనిటీ పవర్ ఎంత ఎక్కువగా ఉంటే.. మనం అంత ఆరోగ్యంగా ఉంటాం. అయితే చాలా మంది ఫుడ్స్ ద్వారే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని అనుకుంటారు. కానీ నవ్వుతో కూడా మన రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మీకు మనం నవ్వినప్పుడు మన శరీరంలో ఎండార్ఫిన్లు పెరుగుతాయి.
వీటిని హ్యాపీ హార్మోన్లు అంటారు. దీనివల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. దీంతో మీరు వ్యాధులు, ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉంటారు. అలాగే మీ శరీరానికి వ్యాధులతో పోరాడే సామర్థ్యం కూడా పెరుగుతుంది. అలాగే మీ మొత్తం శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
మానసిక స్థితి మెరుగుపడుతుంది
మన మానసిక స్థితి సరిగ్గా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. మనం నవ్వుతున్నప్పుడు హ్యాపీ హార్మోన్లు రిలీజ్ అయ్యి ఆనందం కలుగుతుంది. అలాగే సంతృప్తి కలిగి మన మానసిక స్థితి మెరుగుపడుతుంది.
దీంతో ఇప్పటి వరకు ఉన్న బాధ, విచారం, ఆందోళన, నిరాశ వంటి భావాలన్నీ మాయమవుతాయి. అందుకే స్నేహితులతో జోక్స్ వేసుకోవడం, కామెడీ సోలు చూడటం వంటివి చేయండి. ఇలా మీరు రోజూ నవ్వితే మీ మానసిక స్థితి మెరుగ్గా ఉండి మీ లైఫ్ సాఫీగా సాగుతుంది.
రక్తపోటును తగ్గిస్తుంది
అధిక రక్తపోటు గుండెపోటుకు కారణమవుతుంది. అయితే ఈ ప్రమాదం జరగకుండా నవ్వు మనల్ని కాపాడుతుంది. అవును నవ్వు రక్తపోటును తగ్గించేందుకు సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. మనం నవ్వితే రక్తనాళాలు విస్తరించి రక్తప్రవాహం మెరుగుపడుతుంది.
అలాగే ధమనుల్లో నిరోధకత కూడా తగ్గుతుంది. దీంతో గుండెపనితీరు మెరుగుపడుతుంది. అలాగే రక్తపోటు స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. వీటివల్ల గుండెపోటు, స్ట్రోక్ వంటి గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. నవ్వు గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు కూడా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
నొప్పిని తగ్గిస్తుంది
నవ్వుతో నొప్పి కూడా తగ్గుతుందని పలు పరిశోధనల్లో తేలింది. మనం నవ్వినప్పుడు శరీరంలో ఉత్పత్తి అయ్యే ఎండార్ఫిన్లు నొప్పి నివారణగా పనిచేస్తాయి. ఇవి శరీర నొప్పి, అసౌకర్యం నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఇది తాత్కాలికమే అయినా.. దీనిలోని అనాల్జేసిక్ ప్రభావం దీర్ఘకాలిక నొప్పి, గాయాలను మాన్పడానికి ఉపయోగకరంగా ఉంటుంది.
స్ట్రెస్ ప్రభావాలను తగ్గిస్తుంది
దీర్ఘకాలిక స్ట్రెస్ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఇది మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అయితే నవ్వడం వల్ల ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. నవ్వడం వల్ల మన మనస్సు, శరీరంపై ఒత్తిడి వల్ల కలిగే ప్రభావాలు తగ్గుతాయని నిపుణులు అంటున్నారు.
నవ్వు ఒత్తిడికి కారణమయ్యే కార్డిసాల్ హార్మోన్ ను నియంత్రించేందుకు సహాయపడుతుంది. స్ట్రెస్ వల్ల గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. అలాగే రక్తపోటు కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ రెండింటిని తగ్గించేందుకు నవ్వు సహాయపడుతుంది. రోజూ కొద్దిసేపు నవ్వితే ఒత్తిడితో వచ్చే సమస్యల ముప్పు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.