రోజుకు రెండు సపోటా పండ్లు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఇవే!
సపోటాను (Sapota) నోస్ బెర్రీ, సపోడిల్ల ప్లం, చికూ అని కూడా పిలుస్తారు. సపోటా రుచికి తియ్యగా ఉంటుంది. ఇందులో ఎక్కువ మొత్తంలో పోషక విలువలు ఉంటాయి.

ఇవి శరీరానికి శక్తిని అందించే ఎనర్జీ బూస్టర్ గా సహాయపడతాయి. కనుక సపోటాలను తింటే శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు (Health benefits) కలుగుతాయి. అయితే ఇప్పుడు మనం సపోటాలోని ఆరోగ్య రహస్యాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
సపోటాలో పొటాషియం, ఇనుము, ఫోలేట్, నియాసిన్, పాలీఫెనోలిక్ అనామ్లజనకాలు, విటమిన్లు, మినరల్స్ వంటి ఖనిజలవణాలు పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు ఇందులో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ వైరల్ (Antiviral), యాంటీ బ్యాక్టీరియల్ (Antibacterial) లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరానికి ఆరోగ్యాన్ని అందిస్తాయి. కనుక సపోటాలను ఏదో ఒక రూపంలో తీసుకోవడం మంచిదని ఆరోగ్య వైద్యులు చెబుతున్నారు.
బరువును తగ్గిస్తుంది: బరువు తగ్గాలనుకొనే వారు డైట్ లో సపోటాలను తీసుకోవడం మంచిది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు (Antioxidants) శరీరంలో కొవ్వును కరిగించి బరువు తగ్గిస్తాయి (Reduces weight). కనుక వీటిని తీసుకుంటే ఊబకాయం సమస్యలకు దూరంగా ఉండవచ్చు.
కంటికి మంచి: సపోటాలో విటమిన్ ఎ (Vitamin A) పుష్కలంగా ఉంటుంది. సపోటాలను తింటే వృద్ధాప్యంలో కూడా కంటి చూపు మెరుగుపడుతుంది. కంటి సమస్యలు (Eye problems) కూడా తగ్గుతాయి. కనుక సపోటాలను శరీరానికి ఏదోవిధంగా అందించడం తప్పనిసరి.
గర్భిణీ మహిళలకు మంచిది: సపోటాలో పోషకాలు (Nutrients), పిండిపదార్థాలు (Carbohydrates) సమృద్ధిగా ఉంటాయి. కనుక గర్భిణులు, పాలిచ్చే తల్లులు సపోటాలను తీసుకోవడం మంచిది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి శక్తిని అందిస్తాయి.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది: సపోటాలో ఉండే పోషకాలు శరీరానికి కావలసిన శక్తిని అందించి వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతాయి. సపోటా శరీరానికి ఎనర్జీ బూస్టర్ (Energy booster) గా సహాయపడి శరీర రోగనిరోధక శక్తిని (Immunity) పెంచుతుంది.
క్యాన్సర్ ను నివారిస్తుంది: సపోటాలు అధిక మొత్తంలో ఉండే పీచు పదార్థాలు, యాంటీఆక్సిడెంట్లు శరీరంలో క్యాన్సర్ కణాల (Cancer cells) వ్యాప్తిని అడ్డుకుంటాయి. శరీరానికి క్యాన్సర్ తో పోరాడే శక్తిని అందించి ఊపిరితిత్తులు, నోటి క్యాన్సర్ వంటి కొన్ని క్యాన్సర్లను (Cancer) నివారిస్తుంది.
మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది: సపోటాలో పీచు పదార్థం జీర్ణక్రియను (Digestion) వేగవంతం చేసి పేగులలో పేరుకుపోయిన మలాన్ని తేలిక పరిచి మలవిసర్జన సాఫీగా జరగడానికి సహాయపడుతుంది. దీంతో మలబద్దకం (Constipation) సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది.
ఎముకలు దృఢంగా మారుస్తుంది: సపోటాలో పాస్పరస్, క్యాల్షియం (Calcium), ఐరన్ (Iron) సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎముకల పటుత్వానికి సహాయపడతాయి. ఎముకలకు కావలసిన పోషకాలను అందించి ఎముకలను దృఢంగా మారుస్తుంది.
నిద్రలేమి సమస్య తగ్గుతుంది: నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారు సపోటాలను తీసుకోవడం మంచిది. ఇందులో ఉండే పోషకాలు మానసిక ఆందోళనలు, ఒత్తిడిని తగ్గించి మనసును ప్రశాంతంగా (Calm down) ఉంచుతాయి. దీంతో నిద్రలేమి సమస్య (Insomnia problem) తగ్గి గాఢనిద్ర పడుతుంది.