లీచీ పండ్లు తింటున్నారా.. వీటితో లాభలే కాదండోయ్ నష్టాలు కూడా.. ఏంటో తెలుసుకోండి!
లీచీ (Lychee) పండు చూడడానికి స్ట్రాబెరీ లాగా కనిపిస్తాయి. ఈ పండ్లు రుచికి తియ్యగా, మంచి సువాసనను కలిగి ఉంటాయి.

lychees
ఈ పండ్లలో ఉండే అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. వీటిని తీసుకుంటే శరీరానికి మంచి ఎనర్జీ బూస్టర్ గా సహాయపడతాయి. దీంతో అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండి అనేక ఆరోగ్య ప్రయోజనాలను (Health benefits) పొందవచ్చు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
లీచీ పండ్లలో విటమిన్ సి, విటమిన్ బి6, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, కాపర్, ఐరన్, ఫాస్పరస్ వంటి పోషకాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు (Antioxidants) సమృద్ధిగా ఉన్నాయి. అలాగే ద్రాక్షతో పోలిస్తే వీటిలో పాలీఫినాల్స్ (Polyphenols) శాతం అధికంగా ఉంటుంది. మృదువైన ఈ పండ్ల గుజ్జును నేరుగా తినడంతో పాటు షర్బత్ లూ, జ్యూస్ లూ, ఐస్ క్రీమ్ ల తయారీలో వాడతారు.
lychee fruit
జీర్ణప్రక్రియ మెరుగుపడుతుంది: అజీర్తి (Indigestion) సమస్యలతో బాధపడేవారు ఈ పండును తీసుకోవడం మంచిది. ఇందులో ఉండే పోషకాలు జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. దీంతో జీర్ణప్రక్రియ సాఫీగా జరుగుతుంది. అలాగే జీర్ణరసాల ఉత్పత్తి పెరిగి జీర్ణప్రక్రియ (Digestion) మెరుగుపడుతుంది.
lychee fruit
మలబద్దకం సమస్యలు తగ్గుతాయి: ఈ పండ్లలో ఎక్కువ పీచు పదార్థం (Fiber) ఉంటుంది. ఇది మలవిసర్జన సాఫీగా జరిగేందుకు సహాయపడుతుంది. దీంతో మలబద్దకం (Constipation) సమస్యలు తగ్గిస్తుంది. అలాగే మొలలు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.
గుండె ఆరోగ్యంగా ఉంటుంది: రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తాయి. దీంతో గుండెపోటు వంటి సమస్యలు రాకుండా కాపాడి గుండెను ఆరోగ్యంగా (Heart health) ఉంచుతాయి. అలాగే ఇందులో ఉండే పొటాషియం అధిక రక్తపోటు (High blood pressure) సమస్యలను నియంత్రిస్తుంది.
రక్తహీనత సమస్యలు తగ్గుతాయి: ఇందులో ఇనుము, కాపర్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్తంలో హిమోగ్లోబిన్ (Hemoglobin) శాతాన్ని పెంచి రక్తహీనత (Anemia) సమస్యలను తగ్గిస్తాయి. కనుక రక్తహీనత సమస్యలతో బాధపడేవారు ఈ పండ్లను తీసుకుంటే శరీరానికి కావలసిన రక్తం సమృద్ధిగా లభిస్తుంది.
క్యాన్సర్ ను అడ్డుకుంటుంది: ఇందులో పాలీఫినాల్స్ (Polyphenols) పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో క్యాన్సర్ కణాల ప్రభావాన్ని, పరిమాణాన్ని తగ్గిస్తాయి. దీంతో రొమ్ము క్యాన్సర్, పెద్దపేగు క్యాన్సర్ వంటి పలు రకాల క్యాన్సర్లను (Cancers) అడ్డుకుంటుంది.
ఎముకల పటుత్వానికి సహాయపడతాయి: ఇందులో ఉండే మెగ్నీషియం, పాస్పరస్ ఎముకల పటుత్వానికి (Bone strength) సహాయపడతాయి. ఇవి పిల్లల ఎదుగుదలకు సహాయపడతాయి. అంతేకాకుండా వృద్ధాప్య వయసులో వచ్చే మోకాళ్ళ నొప్పులు (Knee pains), కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులను తగ్గిస్తాయి.
బరువు తగ్గుతారు: వీటిలో పీచు పదార్థం అధికం.. వీటిని తీసుకుంటే కడుపు నిండిన భావన కలిగి ఆకలిని తగ్గిస్తుంది (Reduces appetite). కాబట్టి అధిక బరువు, ఊబకాయం వంటి సమస్యలతో బాధపడేవారు వీటిని తీసుకుంటే బరువు తగ్గుతారు (Lose weight).
రోగనిరోధక శక్తి పెరుగుతుంది: ఇందులో ఉండే విటమిన్ సి (Vitamin C) శరీరంలో రోగ నిరోధక శక్తిని (Immunity) పెంచుతుంది. ఈ పండ్లు శరీరానికి హాని చేసే బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ ల నుంచి కాపాడుతుంది. దీంతో పలు రకాల అంటు వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.
అంతేకాకుండా వీటిని తీసుకుంటే శ్వాసకోశ సమస్యలు (Respiratory problems), శృంగార సమస్యలు (Erotic issues), చర్మ, జుట్టు సమస్యలు తగ్గుతాయి. కనుక లీచీ పండ్లను తీసుకుందాం.. ఆరోగ్యంగా ఉండటం..