MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • జొన్న రొట్టెను తింటే ఎంత మంచిదో తెలుసా?

జొన్న రొట్టెను తింటే ఎంత మంచిదో తెలుసా?

జొన్నలను మన దేశంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. జొన్నల్లో ఎన్నో రకాల పోషకాలుంటాయి. జొన్ని పిండితో తయారుచేసినా రొట్టెను తింటే ఎన్నో అనారోగ్య సమస్యల ముప్పు తగ్గుతుందని తెలుసా?  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 29 2023, 01:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

జొన్న రొట్టెలను భారతదేశంలో ఎక్కువకగా తింటారు. నిజానికి జొన్నల్లో బియ్యంలో కంటె ఎక్కువ పోషకాలుంటాయి. అందుకే జొన్న రొట్టెలను తింటే ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతాం.  జొన్నల్లో విటమిన్ బి3, ఐరన్, ఫోలిక్ ఆమ్లం,  కాల్షియం, పిండి పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. జొన్న పిండిని రొట్టె చేయడానికే కాదు లడ్డూలు, అంబలి, అప్పడాలు తయారుచేయడానికి కూడా ఉపయోగిస్తారు. మీకు తెలుసా బియ్యం కంటే జొన్నలే ఎక్కువ ధర పలుకుతాయి. జొన్నలను తీసుకోవడం వల్ల మన శరీరంలో కేలరీలు పెరిగే అవకాశమే ఉండదు. ఇది మన శరీరంలో శక్తి స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది. అసలు జొన్న రొట్టెలను తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

పోషకాలు మెండు

జొన్నల్లో ఇనుము, కాల్షియం, భాస్వరం,  మెగ్నీషియం వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఎముకలను బలంగా ఉంచడానికి, ఎముకల వ్యాధులొచ్చే ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. అంతేకాదు నరాల పనితీరును మెరుగుపర్చడానికి, మొత్తం శరీర శక్తిని పెంచడానికి బాగా సహాయపడుతుంది. 
 

36

గ్లూటెన్-ఫ్రీ , గట్-ఫ్రెండ్లీ

జొన్న రొట్టెలో గ్లూటెన్ ఉండదు. ఈ రొట్టె గ్లూటెన్ సున్నితత్వం లేదా ఉదరకుహర వ్యాధి ఉన్నవారికి  మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాక జొన్నలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. గట్ ను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే మలబద్దకాన్ని తగ్గిస్తుంది.
 

46

గుండెకు మేలు 

జొన్నలో  డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా బీటా-గ్లూకాన్ కు జొన్నలు మంచి వనరు. ఇది మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది. ముఖ్యంగా ఈ రొట్టె హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
 

56

రక్తంలో చక్కెర నియంత్రణ

జొన్నలు చాలా నెమ్మదిగా జీర్ణం అవుతాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇది డయాబెటిస్ ఉన్నవారికి లేదా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించాలనుకున్నవారికి బాగా సహాయపడుతుంది.
 

66

వెయిట్ మేనేజ్మెంట్ 

ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉండే  జొన్న రొట్టెలు మీ కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంచుతాయి. అంతేకాదు అనవసరంగా తినే చిరుతిండిని తగ్గిస్తాయి. ఆకలి తొందరగా కానీయదు. వీటిని తింటే మీ బెల్లీ ఫ్యాట్ కరగడంతో పాటుగా బరువు కూడా తగ్గుతారు. 
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Chicken Biryani: 30 నిమిషాల్లో ఘుమఘుమలాడే పొట్లం బిర్యానీ.. ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..
Recommended image2
Jaggery: బెల్లం ఎలా తింటున్నారు..? ఇలా తింటేనే ప్రయోజనం ఉంటుంది
Recommended image3
Barley Water: ఉదయాన్నే బార్లీ తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved