MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • పెరుగులో తేనెను కలుపుకుని తాగితే ఎంత మంచిదో తెలుసా?

పెరుగులో తేనెను కలుపుకుని తాగితే ఎంత మంచిదో తెలుసా?

పెరుగు, తేనెలో వివిధ రకాల పోషకాలుంటాయి. ఇవి మనల్ని ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతాయి. రోజూ పెరుగును తింటే జలుబు, అలెర్జీ, తుమ్ములు వంటి సమస్యల ప్రమాదం తప్పుతుంది. 
 

Mahesh Rajamoni | Updated : Sep 09 2023, 07:15 AM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
14
Asianet Image

పెరుగు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పెరుగు పోషకాలు పుష్కలంగా ఉండే ఆహారం. అందుకే పెరుగును కాలాలతో సంబంధం లేకుండా తినొచ్చు. వానాకాలం, చలికాలంలో మధ్యాహ్నం పూట పెరుగును తింటే మంచిదని జలుబు చేసే అవకాశం ఉండదు. పెరుగులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. పెరుగు గొప్ప ప్రోబయోటిక్ ఆహారం. దీనిలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. 
 

24
Asianet Image

పెరుగులో విటమిన్ బి 2, మెగ్నీషియం, పొటాషియం వంటి ఎన్నో ముఖ్యమైన పోషకాలు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. రోజూ పెరుగును తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే తుమ్ములు, జలుబు వంటి అలెర్జీ వ్యాధుల ముప్పు కూడా తప్పుతుంది. మీరు రోజూ పెరుగును తింటే మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే కడుపు అసౌకర్యం కూడా తగ్గుతుంది. అంతేకాదు పెరుగు మీ కడుపు, ప్రేగుల ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.

34
Asianet Image

అయితే పెరుగులో కాస్త తేనెను వేసి తీసుకుంటే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పెరుగులో మాదిరిగా తేనెలో కూడా ఎన్నో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. తేనెలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలు, వివిధ రకాల ఎంజైమ్లు ఉంటాయి. తేనె మంచి ఎనర్జీ బూస్టర్. ఇలాంటి తేనెను పెరుగులో కలిపి తీసుకుంటే మన శరీరానికి ఎన్నో రకాల పోషకాలు అందుతాయని నిపుణులు అంటున్నారు. 
 

44
Asianet Image

పెరుగు మన పొట్ట ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా ఉంటాయి. అందుకే ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల మీ పేగులు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. పెరుగులో తేనెను కలుపుని తింటే మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తేనెలో కూడా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పెరుగు, తేనె కూడా జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడతాయి. ఇవి శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా నిరోధించడానికి కూడా సహాయపడతాయి. ఇవి చర్మ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి.
 

Mahesh Rajamoni
About the Author
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు. Read More...
 
Recommended Stories
Top Stories