కేవలం అందానికే కాదు ఆరోగ్యానికి కూడా.. కలబంద ఎన్ని అనారోగ్య సమస్యలను తగ్గిస్తుందో..!
కలబంద ఎన్నో ఔషదగుణాలున్న మొక్క. అందుకే దీన్ని ఎన్నో ఏండ్ల నుంచి ఉపయోగిస్తున్నారు. ఈ మొక్క దాదాపుగా ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. అయితే ఈ కలబంద చర్మానికి మంచి మేలు చేస్తుందన్న సంగతి మాత్రమే తెలుసు అందరికి. కానీ ఇది ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా తగ్గిస్తుంది.
కలబంద మన చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని ఎక్కువగా అందాన్ని పెంచడానికి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగిస్తారు. కానీ కలబంద కేవలం మన చర్మానికే కాదు.. మన శరీర ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అవును కలబంద గుజ్జుతో ఎన్నో ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. కలబంద జ్యూస్ ను తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతాం.
కలబంద ఎన్నో ఔషగదుగున్న ఒక మొక్క. దీని ఆకులు, వేర్లలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని పెంచడం చాలా చాలా సులువు. మీరు దీనిని సంరక్షించడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఈ మొక్క చాలా సులువుగా పెరుగుతుంది. దీని ఆకులను తెంపి దీని రసాన్ని సులభంగా తీయొచ్చు. కావాలనుకుంటే ఈ రసాన్ని మార్కెట్ నుంచి కూడా కొనొచ్చు.
రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది
కలబంద జ్యూస్ క్లోమగ్రంథి కణాలను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. ఈ జ్యూస్ మన ఇన్సులిన్ స్థాయిలను పెంచుతుంది. ఈ జ్యూస్ మధుమేహులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది వీరి రక్తంలో చక్కెరను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇతర రసాలతో పోలిస్తే.. దీనిలో తక్కువ చక్కెర ఉంటుంది. ఈ జ్యూస్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
చర్మానికి మేలు చేస్తుంది
కలబంద కొల్లాజెన్ తయారీకి కూడా సహాయపడుతుంది. ఇది మన చర్మాన్ని యవ్వనంగా, ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. కలబంద చర్మంపై ముడతలను రానీయదు. అలాతగే చర్మం బిగుతుగా కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ కలబంద జెల్ మొటిమలు రాకుండా కాపాడుతుంది. అలాగే మన చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. దీంతో మొటిమలు అయ్యే అవకాశం తగ్గుతుంది.
యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి
కలబంద జెల్ లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇది మన శరీరంలోని ఫ్రీ రాడికల్స్ తో పోరాడటానికి ఎంతగానో సహాయపడుతుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎలిమెంట్స్ కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇది గాయాలను తగ్గించడానికి సహాయపడుతుంది.
aloe vera juice
జీర్ణక్రియకు సహాయపడుతుంది
ప్రస్తుత కాలంలో జీర్ణ సమస్యలతో ముఖ్యంగా మలబద్దకంతో బాధపడేవారు చాలా మందే ఉన్నారు. అయితే ఈ సమస్యను తగ్గించడంలో కలబంద చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కలబందలో భేదిమందు లక్షణాలు ఉంటాయి. ఇవి మలబద్దకం నుంచి ఉపశమనం కలిగించడానికి సహాయపడతాయి. అంతేకాదు హార్ట్ బర్న్ నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. అయినప్పటికీ కలబంద రసాన్ని మోతాదులోనే తాగాలి.
విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి
కలబంద కూడా విటమిన్లకు మంచి మూలం. దీనిలో విటమిన్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. అలాగే ఫ్రీ రాడికల్ డ్యామేజ్ తో పోరాడటానికి సహాయపడుతుంది. అంతేకాదు కలబందలో కాల్షియం, మెగ్నీషియం కూడా ఉంటాయి. ఇవి మన ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి.