Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Life
  • Health
  • వైట్ రైస్ కంటే బ్రౌన్ రైసే బెటర్.. ఎందుకంటే?

వైట్ రైస్ కంటే బ్రౌన్ రైసే బెటర్.. ఎందుకంటే?

అన్నాన్ని మూడు పూటలా తినేవారు చాలా మంది ఉన్నారు. అన్నంలోకి మనం ఎన్ని కూరలు చేసుకుని తిన్నా.. పెద్దగా లాభం ఉండదంటున్నారు నిపుణులు. ముఖ్యంగా వైట్ రైస్ తో. అవును వైట్ రైస్ మన ఆరోగ్యాన్ని ఎన్నో విధాలా దెబ్బతీస్తుంది. 

Mahesh Rajamoni | Updated : Sep 21 2023, 07:15 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

మనం ఆరోగ్యంగా ఉండాలంటే.. ఆరోగ్యకరమైన ఆహారాలనే తినాలి. ఈ సంగతి అందరికీ తెలుసు. అయితే ప్రస్తుత కాలంలో కూడా అన్నాన్ని మూడు పూటలా తినేవారు ఎంతో మంది ఉన్నారు. కానీ వైట్ రైస్ మనకు మంచి కంటే చెడే ఎక్కువ చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వైట్ రైస్ తో ఎన్ని తీరొక్క కూరలు చేసుకుని తిన్నా దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే వైట్ రైస్ కంటే బ్రౌన్ రౌస్ నే తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

26
Image: Getty Images

Image: Getty Images


వైట్ రైస్ కు , బ్రౌన్ రైస్ కు తేడా ఏంటి? 

వైట్ రైస్ ఎంతో ప్రాసెస్ చేయబడుతుంది. ఈ బియ్యం గింజలు తెల్లగా, అందంగా కనిపించడానికి ఎక్కువగా ప్రాసెస్ చేస్తారు. దీని వల్లే వీటిలోని పోషకాలన్నీ పోతాయి. అయితే బ్రౌన్ రైస్ లో ఇలా జరగదు. కేవలం పై పొర మాత్రమే తొలగించబడుతుంది. అందుకే దీనిలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. మరి బ్రౌన్ రైస్ ను తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

36
Image: Getty Images

Image: Getty Images

బరువు తగ్గడానికి సహాయపడుతుంది

బ్రౌన్ రైస్ లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ కడుపును ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. దీంతో మీరు అతిగా, తరచుగా తినలేరు. దీంతో మీరు ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. అంతేకాదు ఇది పొట్టను కూడా తగ్గిస్తుంది. 
 

46
Image: Getty Images

Image: Getty Images

ఆరోగ్యకరమైన గుండె

బ్రౌన్ రైస్ లో మెగ్నీషియం, ఫైబర్ లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఈ రెండూ మన గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి అవసరం. బ్రౌన్ రైస్ లోని మెగ్నీషియం స్ట్రోక్ ప్రమాదం నుంచి మనల్ని రక్షిస్తుంది. కాబట్టి బ్రౌన్ రైస్ ను మీ ఆహారంలో చేర్చితే  మీ గుండె పదిలంగా ఉంటుంది. 
 

56
Asianet Image


పోషకాహారం

బ్రౌన్ రైస్ పోషకాల భాండాగారం. దీనిలో ఫైబర్, మెగ్నీషియం, ఫాస్పరస్, మాంగనీస్ వంటి ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలోని పోషకాలు మనల్ని దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షిస్తాయి. ఇది మన ఎముకలను బలంగా ఉంచుతుంది. అలాగే రక్తంలో చక్కెరను కూడా నియంత్రిస్తుంది. బ్రౌన్ రైస్ లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయి. 
 

66
Asianet Image

మధుమేహాన్ని నివారిస్తుంది

వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ చాలా నెమ్మదిగా జీర్ణమవుతుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగవు. బ్రౌన్ రైస్ ను తింటే టైప్ -2 డయాబెటిస్  వచ్చే అవకాశం చాలా తక్కువ. 
 

Mahesh Rajamoni
About the Author
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు. Read More...
 
Recommended Stories
Top Stories