MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • తమలపాకును తింటే ఇలా అవుతుందా?

తమలపాకును తింటే ఇలా అవుతుందా?

తమలపాకును తినే అలవాటు చాలా మందికే ఉంటుంది. నిజానికి దీనిలో మన  ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ తమలపాకును రోజూ తింటే ఏమౌతుందంటే..? 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 07 2023, 03:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

తమలపాకును ఎన్నో ఏండ్ల నుంచి ఉపయోగిస్తున్నారు. పెళ్లిళ్ల నుంచి పండుగల వరకు ప్రతి వేడుకలో తమలపాకును ఖచ్చితంగా ఉపయోగిస్తారు. ఈ ఆకు రుచికరంగా ఉండటమే కాదు.. దీనిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి తెలుసా? అవును తమలపాకు మధుమేహాన్ని నియంత్రించడం నుంచి ఒత్తిడిని తగ్గించడం వరకు ఇది ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. 
 

210

రీసెర్చ్ గేట్ ప్రకారం.. భారతదేశంలో ప్రతి సంవత్సరం 15 నుంచి 20 మిలియన్ల మంది తమలపాకులను తింటారు. ఈ ఆకు సాంప్రదాయకంగా భారతదేశంలో 55,000 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయబడుతోంది. వార్షిక ఉత్పత్తి సుమారు 9000 మిలియన్ రూపాయలు. సగటున 66 శాతం ఉత్పత్తి పశ్చిమబెంగాల్ నుంచే వస్తోంది.
 

310

తమలపాకులోని పోషక విలువలు

తమలపాకులో యాంటీ డయాబెటిక్, కార్డియోవాస్కులర్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ అల్సర్, యాంటీ ఇన్ఫెక్షన్ లక్షణాలు ఉంటాయి. ప్రతి 100 గ్రాముల తమలపాకులో 1.3 మైక్రోగ్రాముల అయోడిన్, 4.6 మైక్రోగ్రాముల పొటాషియం, 1.9 మోల్ లేదా 2.9 ఎంసిజి విటమిన్ ఎ, 13 మైక్రోగ్రాముల విటమిన్ బి1, 0.63 నుంచి 0.89 మైక్రోగ్రాముల నికోటినిక్ ఆమ్లం ఉంటాయి. ఈ తమలపాకును తింటే ఏయే సమస్యలు తగ్గిపోతాయంటే..
 

410

మలబద్దకాన్నితగ్గిస్తుంది

తమలపాకులను యాంటీఆక్సిడెంట్ల పవర్ హౌస్ గా పరిగణిస్తారు. ఇవి శరీరంలో పీహెచ్ స్థాయిని నార్మల్  గా ఉంచుతాయి. ఉదర సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. మలబద్ధకం ఉన్నవారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. ఉదర సమస్యల నుంచి ఉపశమనం పొందాలంటే తమలపాకులను నూరి రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయం లేవగానే ఆ నీటిని వడగట్టి పరిగడుపున తాగాలి.
 

510

నోటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది

తమలపాకులో అనేక యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి. ఇవి నోటి దుర్వాసన, దంతాలు పసుపుపచ్చగా మారడం, ఫలకం, దంత క్షయం నుంచి ఉపశమనం కలిగిస్తాయి. భోజనం తర్వాత తమలపాకుతో చేసిన పేస్ట్ ను కొద్దిగా నమలడం వల్ల నోటి ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఇది పంటి నొప్పి, చిగుళ్ల నొప్పి, వాపు, నోటి ఇన్ఫెక్షన్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. తమలపాకులో సహజ యాంటీసెప్టిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి నోటిలో బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తాయి. అలాగే నోటిని పరిశుభ్రంగా ఉంచడానికి సహాయపడతాయి. 
 

610

శ్వాసకోశ వ్యవస్థకు ప్రయోజనకరంగా ఉంటుంది

ఆయుర్వేదంలో తమలపాకును దగ్గు, బ్రోన్కైటిస్, ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు. ఈ ఆకులలో ఉండే సమ్మేళనాలు దగ్గును తగ్గించడానికి, శ్వాసను మెరుగుపరచడానికి సహాయపడతాయి.

710

ఒత్తిడిని తగ్గిస్తుంది

తమలపాకులను నమలడం వల్ల ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇది శరీరాన్ని, మనస్సును రిలాక్స్ చేస్తుంది. తమలపాకులో ఉండే ఫినోలిక్ సమ్మేళనాలు శరీరం నుంచి కాటెకోలమైన్ అనే సేంద్రీయ సమ్మేళనాన్ని విడుదల చేస్తాయి. అందుకే తమలపాకులను నమలడం వల్ల మూడ్ స్వింగ్స్ సమస్యే ఉండదు. 
 

810

మధుమేహాన్ని నియంత్రిస్తుంది

తమలపాకులు యాంటీ హైపర్ గ్లైసెమిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర సమస్యను నియంత్రించడానికి ఉపయోగపడతాయి. రక్తంలో గ్లూకోజ్ పరిమాణం పెరగకుండా తమలపాకులు నిరోధిస్తాయి. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు ఉదయం పరిగడుపున దాని ఆకులను నమలడం వల్ల ప్రయోజనం పొందుతారు.
 

910

అంతేకాదు తమలపాకు జుట్టుకు ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. ఈ ఆకులు మీ జుట్టు వేగంగా పెరిగేందుకు సహాయపడతాయి. మీ జుట్టు పొడుగ్గా పెరగాలంటే తమలపాకు హెయిర్ మాస్క్ లను ఉపయోగించండి. 

1010

తమలపాకులను ఎలా తినాలి?

1. మధుమేహాన్ని నియంత్రించాలంటే ఉదయాన్నే పరగడుపున తమలపాకులను నమలడం మంచిది.
2. ఒత్తిడికి గురైతే సాదా లేదా తీయని తమలపాకును తినండి. దీని ఫినోలిక్ సమ్మేళనాలు మీ మానసిక స్థితిని మెరుగుపర్చడానికి సహాయపడతాయి.
3. మలబద్ధకం నుంచి ఉపశమనం పొందడానికి తమలపాకులను రాత్రంతా నీటిలో నానబెట్టండి. ఉదయాన్నే వడకట్టిన ఈ నీటిని తాగండి. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Thyroid Cancer: ఇవి తెలుసుకుంటే థైరాయిడ్ క్యాన్సర్‍కు చెక్ పెట్టొచ్చు
Recommended image2
Health : ఆల్కహాల్ అలవాటే లేకున్నా లివర్ డ్యామేజ్ అవుతుందా..! ఈ ఐదు విషయాలే కారణం
Recommended image3
Beer: ఆరోగ్యానికి బీర్ మంచిదా.? ఇందులో నిజంగానే విట‌మిన్ బీ6 ఉంటుందా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved