ఉదయాన్నే వేడి నీటిని తాగితే మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
ఉదయాన్నే వేడి నీటిని (Hot water) తాగితే శరీరం సమతుల్యంగా ఉంటుంది. దీంతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను (Health benefits) పొందవచ్చు.

వేడినీరు శరీరానికి మంచి నేచురల్ మెడిసిన్ గా సహాయపడి అనేక అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతుంది. అదెలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
వేడి నీటిని ప్రతి రోజూ ఉదయాన్నే తీసుకుంటే ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యం కూడా మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేడి నీరు శరీరంలోని జీర్ణక్రియ వ్యర్థాలను (Digestive waste) తొలగించడానికి సహాయపడి కడుపులోని పెద్దప్రేగును శుభ్రపరుస్తుంది. అంతేకాకుండా శరీరానికి పోషకాలు (Nutrients) పుష్కలంగా లభిస్తాయి.
దీంతో జీర్ణవ్యవస్థ మెరుగుపడి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మనం తిన్న ఆహారం తేలికగా జీర్ణం కావడానికి శరీరంలోని ఉష్ణోగ్రత కీలక పాత్ర వహిస్తుంది. కనుక ఉదయాన్నే వేడి నీటిని తీసుకుంటే శరీర ఉష్ణోగ్రత (Temperature) పెరిగి తిన్న ఆహారం తేలికగా జీర్ణం అవుతుంది. దీంతో జీర్ణ సంబంధిత సమస్యలు (Digestive problems) తగ్గుతాయి.
అంతేకాకుండా ప్రతి రోజూ ఉదయాన్నే వేడి నీటిని తీసుకుంటే శరీరంలోని మలినపదార్థాలు (Contaminants) సాఫీగా విసర్జింపబడతాయి. దీంతో శరీరం తేలికపడి రోజంతా హ్యాపీగా, ఉషారుగా ఉంటారు. కనుక మలబద్ధకం (Constipation) సమస్యతో బాధపడే వారు క్రమం తప్పకుండా ప్రతిరోజూ వేడి నీటిని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
వేడినీరు శరీరంలోని అధిక కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. కనుక వేడి నీటిని తాగితే బరువు తగ్గుతారు (Lose weight). కాబట్టి బరువు తగ్గాలనుకొనే వారు క్రమం తప్పకుండా ప్రతి రోజూ ఒక గ్లాసు వేడి నీటిని ఉదయాన్నే తీసుకోవడం మంచిది. గొంతునొప్పి (Sore throat), జలుబు, దగ్గు వంటి సమస్యలను తగ్గించడానికి కూడా వేడినీరు చక్కగా సహాయపడుతుంది.
ప్రతిరోజూ వేడి నీటిని తీసుకుంటే శ్వాస సంబంధిత సమస్యలు (Respiratory problems) కూడా తగ్గుతాయి. దీంతో శ్వాస సాఫీగా జరుగుతుంది. అలాగే శరీరంలోని అన్ని అవయవాలకు ఆక్సిజన్ సరఫరా బాగా జరిగి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. వేడి నీటిని తీసుకుంటే శరీరంలోని ఉష్ణోగ్రత పెరగడంతో శరీరం నుండి ఎక్కువ చెమట (Sweat) విడుదలవుతుంది.
ఇలా స్వేదగ్రంధుల నుండి చెమట బయటకు రావడంతో శరీరంలోని మలినాలు విసర్జింపబడి చర్మం ఆరోగ్యంగా (Skin health) ఉంటుంది. దీంతో చర్మకణాలు శుభ్రపడి చర్మంలోని మలినాలు తొలగిపోతాయి. దీంతో చర్మంపై ముడతలు, మొటిమలు తగ్గుతాయి. అలాగే చర్మ కణాలకు రక్త సరఫరా (Blood supply) సాఫీగా జరుగుతుంది. దీంతో చర్మం అందంగా, ఆరోగ్యంగా, కాంతివంతంగా మారుతుంది.
రాత్రి మనం పడుకోవడంతో సహజంగా శరీరంలో నీటి నిల్వలు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కనుక ఉదయాన్నే వేడి నీటిని తీసుకుంటే శరీరం సమతుల్యంగా ఉంటుంది. అలాగే శరీరంలోని టాక్సిన్స్ ను తొలగించడానికి సహాయపడుతుంది. కనుక ప్రతిరోజూ ఉదయాన్నే వేడి నీటిని తాగండి అందంగా (Beautifully), ఆరోగ్యంగా (Healthy) ఉండండి.