శనగ పిండిని ఇలా వాడితే మొటిమలు, మచ్చలు మాయం!
అందంగా కనిపించాలని ఎవరు కోరుకోరు చెప్పండి. మరీ ముఖ్యంగా అమ్మాయిలు. అందం కోసం వారు చేయని ప్రయత్నాలుండవు. కొందరైతే మార్కెట్ లోకి ఏ కొత్త ప్రాడక్ట్ వస్తే.. అది ఫేస్ పై ట్రై చేస్తూ ఉంటారు. అందులో కెమికల్స్ ఉండేవే ఎక్కువ శాతం. అవి మన స్కిన్ కి మేలు చేయచ్చు. హాని కూడా చేయొచ్చు. అలా కాకుండా సహజంగా ముఖానికి మెరుపును ఎలా తీసుకురావాలో ఇక్కడ చూద్దాం.

ఆడవాళ్లు అయినా మగవారైనా.. ఎవరైనా సరే అందంగా కనిపించాలనే కోరుకుంటారు. కాంతివంతమైన, మృదువైన, మెరిసే చర్మం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రస్తుత లైఫ్ స్టైల్, కాలుష్యం కారణంగా మొటిమలు, నల్ల మచ్చలు, పొడిబారిన చర్మం లాంటి సమస్యలు అందరిని ఇబ్బంది పెడుతున్నాయి. అయితే వీటిని తగ్గించడానికి శనగపిండి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది మొటిమలు, మచ్చలను తొలగించడంతోపాటు ముఖానికి మెరుపును ఇస్తుంది. మీ ముఖం మెరిసిపోవాలంటే, కొన్ని పదార్థాలను బేసన్‌తో కలిపి ఫేస్ ప్యాక్‌గా వేసుకోవాలి.
బేసన్, పెరుగు ఫేస్ ప్యాక్
శనగపిండి, పెరుగు మిశ్రమం మీ చర్మాన్ని తేమగా ఉంచడంతోపాటు మెరిసేలా చేస్తుంది. దీని కోసం 2 స్పూన్ల బెసన్, ఒక కప్ పెరుగు, ఒక చెక్క నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుని, 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఇది ముఖాన్ని కాంతివంతం చేస్తుంది.
బెసన్, పసుపు ఫేస్ ప్యాక్
బేసన్, పసుపు రెండింటినీ ఫేస్ ప్యాక్‌గా వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. పసుపులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు నల్ల మచ్చలను తొలగిస్తాయి. దీని కోసం 2 స్పూన్ల బెసన్, 1/4 స్పూన్ పసుపు, కొద్దిగా వాటర్ కలిపి ఆ పేస్ట్‌ను ముఖానికి రాసుకుని, 10 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి.
బేసన్, రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్
శనగపిండి, రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్ ముఖాన్ని తేమగా ఉంచుతుంది. 2 స్పూన్ల బెసన్, 1-2 స్పూన్ల రోజ్ వాటర్ తో కలిపి ముఖానికి రాసుకుని 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి.
బేసన్, తేనె ఫేస్ ప్యాక్
బెసన్, తేనె ఫేస్ ప్యాక్ చర్మాన్ని తేమగా, మృదువుగా చేస్తుంది. అంతేకాకుండా, ముఖాన్ని మెరిసేలా చేస్తుంది. మచ్చలను తొలగిస్తుంది. దీని కోసం 2 స్పూన్ల బెసన్, 1 స్పూన్ తేనె, కొంచెం నిమ్మరసం కలిపి ఆ పేస్ట్‌ను ముఖానికి రాసుకుని, 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి.
ఇవి మర్చిపోవద్దు:
- ఈ ఫేస్ ప్యాక్‌లను వారానికి 1-2 సార్లు మాత్రమే వేసుకోవాలి.
- ఏదైనా ఫేస్ ప్యాక్ వేసుకునే ముందు మీ ముఖాన్ని తేమగా ఉంచుకోవడం మర్చిపోవద్దు.
- ప్యాచ్ టెస్ట్ చేయడం మర్చిపోవద్దు. ముఖ్యంగా సున్నితమైన చర్మం ఉన్నవారు.