బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారా? ఇదిగో మీ కోసం కొన్ని ఈజీ టిప్స్
బరువు తగ్గాలనుకునేవారు డైట్ ను ఫాలో అవుతుంటారు. అయితే ఇలాంటి వారు కొన్ని ఆహారాలను పూర్తిగా నివారించాలి లేదా చాలా వరకు తగ్గించాలి. నియంత్రించాల్సి ఉంటుంది. ముఖ్యంగా కేలరీలు ఎక్కువగా ఉండే ఆహారాలు.. పానీయాలు.

weight loss
బరువు తగ్గడమంత సులువైన పనేం కాదు. ఈ విషయం ప్రయత్నిస్తున్న చాలా మందికి తెలుసు. అయితే బరువు తగ్గడానికి సరైన ఆహారం, వ్యాయామం చాలా చాలా అవసరం. అయినప్పటికీ బరువు తగ్గడానికి చాలా మందికి చాలా సమయం పడుతుంది. అయితే బరువు తగ్గాలనుకుంటున్నవారు కొన్ని ఆహారాలను పూర్తిగా మానేయాలి. ముఖ్యంగా కేలరీలు ఎక్కువగా ఉండే ఆహారాలను. బరువు తగ్గాలనుకుంటున్నవారి కోసం కొన్ని ఈజీ టిప్స్..
గ్లాస్ వాటర్
బరువు తగ్గాలనుకుంటున్నవారు ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే ఒక గ్లాసు నీటిని ఖచ్చితంగా తాగాలి. అయితే అందులో ఒక టీస్పూన్ తేనె, కొద్దిగా నిమ్మరసం కూడా కలపాలి. ఇది జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. అలాగే శరీరం నుంచి విషాన్ని బయటకు పంపడానికి సహాయపడుతుంది. ఇవన్నీ బరువు తగ్గడానికి మీకు సహాయపడతాయి.
weight loss
వాటర్
రోజు స్టార్టింగ్ లోనే కాదు రోజంతా మీరు పుష్కలంగా నీటిని తాగాలి. ఒకేసారి చాలా కాకుండా అప్పుడప్పుడు నీటిని కొద్ది కొద్దిగా తాగాలి. ఈ అలవాటు మీ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడమే కాకుండా.. డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉంచుతుంది. అలాగే ఎక్కువ ఆకలిగా అనిపించకుండా చేస్తుంది. అప్పుడప్పుడు స్నాక్స్ తినడం, అలాగే దాహం వేసిన తర్వాత శీతల పానీయాలు తాగడాన్ని తగ్గిస్తుంది.
weight loss
పండ్ల వాటర్
నీళ్లు తాగేటప్పుడు కేవలం నీళ్లు మాత్రమే కాకుండా వాటిని ఏదో ఒకటి కలపడం మంచిది. పండ్లు, కూరగాయలు, ఆకులు, మసాలా దినుసులు ఇలా బరువు తగ్గడానికి సహాయపడేవాటిని నీటిలో కలిపి తాగొచ్చు.
Weight Loss
శీతలపానీయాలు
మీరు ఖచ్చితంగా బరువు తగ్గడానికి ప్రయత్నిస్తే వీలైనంత వరకు తీపి శీతల పానీయాలకు దూరంగా ఉండటం మంచిది. బరువు తగ్గాలనుకునే వారు తప్పక పాటించాల్సిన డైట్ చిట్కా ఇది. ఎందుకంటే ఇది మీ బరువును మరింత పెంచుతుంది.
Weight Loss
కెఫిన్
బరువు తగ్గాలనుకునేవారు కెఫిన్ మొత్తాన్ని తగ్గించడం కూడా చాలా మంచిది. ఎందుకంటే ఇవి కూడా మీరు బరువు తగ్గకుండాచేస్తాయి. అందుకే పగటిపూట కాఫీ, టీ వంటి పానీయాల పరిమాణాన్ని తగ్గించండి.