పాదాల అందం కోసం ఇంట్లోనే పెడిక్యూర్.. దీని వల్ల ఎన్ని లాభాలో తెలుసా?
చాలా మంది ముఖ సౌందర్యం కోసం చూపించే శ్రద్ధ పాదాలపై చూపించరు. అయితే ముఖ సౌందర్యంతో పాటు పాదాల సౌందర్యం (Beauty of the Feet) కూడా ముఖ్యమే.

అందుకే పాదాల అందం కోసం ప్రత్యేక శ్రద్ధ తప్పనిసరి. అయితే పాదాలను అందంగా, కాంతివంతంగా మార్చడానికి పెడిక్యూర్ మంచి ఫలితాలను అందిస్తుంది. పెడిక్యూర్ (Pedicure) కోసం పార్లర్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ప్రయత్నించవచ్చు. అదెలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
పాదాలు కూడా శరీర అందానికి ప్రత్యేక ఆకర్షణ. పాదాలు అందంగా కనిపించడానికి పెడిక్యూర్ సహాయపడుతుంది. పాదాలకు పెడిక్యూర్ ను ప్రయత్నిస్తే రక్తప్రసరణ (Blood circulation) సక్రమంగా జరిగి పాదాలు ఆరోగ్యంగా (Foot health) ఉండడంతోపాటు అందంగా కనిపిస్తాయి. అలాగే మృత చర్మం తొలగిపోయి పాదాలు కోమలంగా మారుతాయి. కనుక పెడిక్యూర్ కోసం ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే సులభమైన పద్ధతిలో చేసుకోవచ్చు.
గులాబీ రేకులు, తులసి ఆకులు, ఆలివ్ ఆయిల్: ఒక గిన్నె తీసుకొని అందులో గుప్పెడు గులాబీ రేకులు (Rose petals), గుప్పెడు తులసి ఆకులు (Basil leaves), ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ (Olive oil), నీళ్లు (Water) వేసి స్టవ్ మీద పెట్టి బాగా మరగబెట్టాలి. ఇలా బాగా మరిగించిన నీరు గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులో కాసేపు పాదాలను నాననివ్వాలి. తరువాత ఫ్యూమిక్ స్టోన్ తో పాదాలను రుద్దితే మృతకణాలు తొలగిపోయి చర్మం శుభ్రపడుతుంది. దీంతో పాదాలు కోమలంగా మారుతాయి.
బొప్పాయి గుజ్జు, నువ్వుల నూనె, పెసర పిండి, పెరుగు: ఒక కప్పులో కొద్దిగా బొప్పాయి గుజ్జు (Papaya pulp), రెండు స్పూన్ ల నువ్వుల నూనె (Sesame oil), ఒక టేబుల్ స్పూన్ పెసరపిండి (Pesarapindi), కొద్దిగా పెరుగు (Yogurt) వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పాదాలకు లేపనంగా రాసి అరగంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా వారానికి రెండు మూడుసార్లు ప్రయత్నిస్తే కాంతివంతమైన పాదాల సౌందర్యం మీ సొంతం.
కొబ్బరి నూనె, లవంగాల నూనె: పాదాలు అందంగా కనిపించాలంటే రక్త ప్రసరణ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. కనుక నిద్రపోయేముందు పావు కప్పు కొబ్బరి నూనెకు (Coconut oil) రెండు చుక్కల లవంగాల నూనె (Clove oil) కలిపి పాదాలకు సున్నితంగా మర్దన చేసుకోవాలి. ఇలా చేస్తే పాదాలకు రక్తప్రసరణ సక్రమంగా జరిగి పాదాలు ఆరోగ్యంగా ఉండడంతోపాటు పాదాలు కోమలంగా మారుతాయి.
అరటిపండు గుజ్జు: అరటిపండు గుజ్జు (Banana pulp) పాదాల సౌందర్యం కోసం మంచి ఫలితాలను అందిస్తుంది. కనుక బాగా పండిన అరటి పండు గుజ్జును తీసుకుని మెత్తగా పేస్ట్ చేసి దాన్ని మీ పాదాలకు అప్లై చేసుకోవాలి. 20 నిమిషాల తరువాత నీటితో పాదాలను శుభ్రపరుచుకోవాలి. ఇలా తరచూ చేసుకుంటే పాదాలకు మంచి మాయిశ్చరైజర్ (Moisturizer) గా సహాయపడి తేమగా ఉంచుతాయి. అలాగే పాదాలు పగిలే సమస్యలు కూడా తగ్గిపోతాయి.