Diabetes: మీ వయసును బట్టి ఏ టైప్ డయాబెటిస్ ఉందో తెలుసుకోవచ్చు. ఎలాగంటే..
Diabetes: షుగరు వ్యాధి(డయాబెటిస్) అంటే ఒకప్పుడు వయసు పైబడిన వారికి మాత్రమే వచ్చేది. ఈ కాలంలో చిన్న, పెద్ద తేడా లేకుండా అటాక్ అవుతోంది. అందుకే మీ వయసును బట్టి మీకు ఏ టైప్ డయాబెటిస్ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
తినే తిండిలో నాణ్యత లేదు.. రాత్రి, పగలు తేడా లేకుండా పని చేయండి.. కాలుష్యం, అపరిశుభ్రత ఇలా మన ఆరోగ్య సమస్యలకు ఎన్నో కారణాలు. అందుకే ఒంట్లో శక్తి తగ్గిన తర్వాత రావాల్సిన రోగాలన్నీ వయసుతో సంబంధం లేకుండా చుట్టుముడుతున్నాయి. మీరు డయాబెటిక్ పేషెంట్ అయితే మీ వయసు, మీకున్న లక్షణాలను బట్టి మీకు ఏ టైప్ షుగర్ ఉందో ఇక్కడ తెలుసుకుందాం.
సాధారణంగా 15 సంవత్సరాల లోపు పిల్లలకు టైప్-1 డయాబెటిస్ లక్షణాలు ఉంటాయి. వీరికి అధికంగా దాహం వేస్తుంది. తరచుగా టాయిలెట్ కి వెళ్లాల్సి వస్తుంది. బరువు ఒక్కసారిగా తగ్గిపోవడం లేదా ఎక్కువగా తగ్గిపోవడం జరుగుతుంది. అంతేకాకుండా బాగా అలసటగా ఉంటారు. కంటి సమస్యలు కూడా రావచ్చు. ఇలాంటి లక్షణాలు మీ పిల్లల్లో ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ ని సంప్రదించి సలహాలు తీసుకోవాలి. అవసరమైతే చికిత్స చేయించడం మంచిది.
16 నుంచి 25 ఏళ్ల వయసున్న యువత కూడా డయాబెటిస్ బారిన పడుతున్నారు. సాధారణంగా వీరికి టైప్-2 డయాబెటిస్ ఉంటుంది. లక్షణాలు ఎలా ఉంటాయంటే.. ఈ టైప్ డయాబెటిస్ ఉన్న వారు బాగా లావుగా ఉంటారు. వీరికి గాయాలైతే త్వరగా మానవు. వీరి చర్మం, కిడ్నీలు తరచూ ఇన్ఫెక్షన్ కి గురవుతుంటాయి. వీరికి ఆకలి కూడా ఎక్కువగా ఉంటుంది. మీ ఇంట్లో ఇలాంటి యువతీ యువకులు ఉంటే వెంటనే టెస్ట్ లు చేయించి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
26 నుంచి 50 ఏళ్ల లోపు ఉన్న పెద్దలకు కూడా దాదాపుగా టైప్-2 డయాబెటిస్ లక్షణాలే ఉంటాయి.
అదే 50 పై వయసున్న వారందరిలో సాధారణ డయాబెటిస్ ఉంటుంది. ఈ డయాబెటిస్ సోకిన వారికి దాహం ఎక్కువ వేస్తుంది. చిన్న పనికే అలసిపోతారు. తరచూ మూత్ర విసర్జనకు వెళ్తూ ఉంటారు. కంటి సమస్యలు, గాయాలు మానకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. ఇవి మీ ఇంట్లో పెద్దవాళ్లలో కనిపిస్తే వెంటనే షుగర్ టెస్ట్ చేయించండి.
ఇవి కాకుండా గర్భిణీలకు కూడా షుగర్ వస్తుంది. గర్భం దాల్చినప్పటి నుంచి డెలివరీ అయ్యే వరకు డయాబెటిస్ ఉంటుంది. దీన్ని గెస్టేషనల్ డయాబెటిస్ అంటారు. ఇలాంటి గర్భిణులు డెలివరీ వరకు డాక్టర్ల పర్యవేక్షణలో ఉండటం మంచిది.