బ్లడ్ షుగర్ లెవెల్స్ ను తగ్గించుకోవడానికి మెంతులను ఎంత తీసుకోవాలంటే?
డయాబెటీస్ పేషెంట్లకు మెంతులు ఎంతో మేలు చేస్తాయి. వీటిని తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. ఇందుకోసం రోజూ ఎన్ని మెంతులను తినాలంటే..?

మెంతి గింజల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. దీనిలోని ఔషధ గుణాలు ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. జుట్టు పెరుగుదల, జీర్ణక్రియ నుంచి బరువు తగ్గడం, డయాబెటిస్ వరకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. ఇవి డయాబెటీస్ పేషెంట్లకు ఎంతో మేలు చేస్తాయి. మరి బ్లడ్ షుగర్ లెవెల్స్ ను తగ్గించుకోవడానికి రోజుకు ఎన్ని మెంతులను తీసుకోవాలంటే..?
మెంతులను మరీ ఎక్కువగా ఉపయోగిస్తే రక్తంలో చక్కెర స్థాయిలు బాగా తగ్గిపోతాయి. అందుకే వీటిని సరైన మోతాదులోనే ఉపయోగించాలి.
fenugreek
డయాబెటిస్ కోసం మెంతులు
భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న ఆరోగ్య సమస్యల్లో డయాబెటీస్ ఒకటి. టైప్ -2 డయాబెటిస్ మెల్లిటస్ అనేది ఒక సాధారణ జీవక్రియ వ్యాధి. ఇది ఆహారాన్ని శక్తిగా మార్చే శరీర సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది మన జీర్ణవ్యవస్థలో తీసుకున్న ఆహారాన్ని శరీరం గ్లూకోజ్ గా విడగొట్టి రక్తప్రవాహంలోకి విడుదల చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు ఇన్సులిన్ విడుదల కోసం ప్యాంక్రియాస్ కు సందేశం పంపబడుతుంది. ఇది శరీర కణాలు గ్లూకోజ్ ను శక్తిగా ఉపయోగించడానికి సహాయపడుతుంది.
మెంతులు ఎలా సహాయపడతాయి?
మెంతులలో కరిగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ, కార్బోహైడ్రేట్ల శోషణను మందగించేలా చేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది.
మెంతులు తీసుకోవడానికి ఉత్తమ మార్గం
అధిక బాడీ మాస్ ఇండెక్స్ ఉన్నవారు, కేలరీలు తక్కువగా ఉండే ఆహారాన్ని తినే వారు రక్తంలో చక్కెర స్థాయిలు లేదా ఇన్సులిన్ నిరోధకతను నియంత్రించడానికి మెంతి గింజల పొడి లేదా మెంతులను నానబెట్టి నీటిని తాగాలని నిపుణులు చెబుతున్నారు. నిపుణుల ప్రకారం.. రోజుకు 10 గ్రాముల మెంతులను 4-6 నెలల పాటు రోజూ తింటే హెచ్బిఎ 1 సి, రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని తేలింది. అయితే ఈ మసాలా దినుసు ప్రభావం నెమ్మదిగా కనిపిస్తుంది. అందుకే మీ రక్తంలో చక్కెర స్థాయిలను నిశితంగా పర్యవేక్షించడం మంచిది.
మెంతుల దుష్ప్రభావాలు
రక్తంలో చక్కెరను తగ్గించే ఇతర మూలికల మాదిరిగానే మెంతులను ఎక్కువగా తినడం వల్ల రక్తంలో చక్కెరలు చాలా తక్కువగా పడిపోయే ప్రమాదం ఉంది. రక్తంలో తక్కువ చక్కెర స్థాయిలు ఉంటే ఎన్నో సమస్యలు వస్తాయి.