MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Health
  • చలికాలంలో కళ్లు ఎర్రగా ఎందుకు అవుతాయి?

చలికాలంలో కళ్లు ఎర్రగా ఎందుకు అవుతాయి?

Eye Care Tips: చలికాలంలో గాలిలో తేమ ఉండదు. దీనివల్ల చాలా మందికి ఎన్నో కంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా కళ్లు ఎర్రగా కనిపించడం, పొడిబారడం వంటి పెరుగుతాయి. ఈ సమస్యల వల్ల కంటి ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ సీజన్ లో కళ్లు ఎర్రగా మారడానికి ఇంకా ఏమేం కారణాలు ఉన్నాయంటే? 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Dec 08 2023, 01:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Red Eyes

Red Eyes

మన శరీరంలో అతి సున్నితమైన, ముఖ్యమైన అవయవాల్లో కళ్లు ఒకటి. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా మన కంటి ఆరోగ్యం కూడా ప్రభావితం అవుతుంది. దీనివల్ల కంటి ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. చలికాలంలో కంటికి సంబంధించిన సమస్యలు రావడం చాలా సహజం. నిజానికి చలికాలంలో గాలిలో తేమ ఉండదు. దీనివల్లే చాలా మంది కళ్లు పొడిబారుతుంటాయి. అలాగే ఎర్రగా మారుతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా సుమారు 2.2 బిలియన్ల మందికి కంటి సమస్యలు ఉన్నాయి. వీటిలో 1 బిలియన్ మందికి ఎప్పటికీ నయం చేయలేని వ్యాధులు ఉన్నాయి. కాగా కంటి సమస్యల్లో పెద్దదైన 'దృష్టి నష్టం' ఏ వయసు వారినైనా ప్రభావితం చేస్తుందని నివేదిక పేర్కొంది. అలాగే 50 ఏండ్లు పైబడిన వారికి 'కంటిచూపు' లేదా దృష్టి సమస్యలు ఎక్కువగా వస్తాయని నిపుణులు అంటున్నారు. మరి చలికాలంలో ఎలాంటి కంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Red Eyes

Red Eyes

పొడి కళ్లు

చలికాలంలో కళ్లు పొడిబారడం సర్వసాధారణ విషయం. కళ్లు పొడిబారడానికి చాలా కారణాలు ఉన్నాయి. మన కళ్లలో కన్నీళ్లు తగినంతగా ఉత్పత్తి కానప్పుడు కూడా కళ్లు పొడిబారుతాయి. దీనివల్ల కంటి అసౌకర్యం కలుగుతుంది. అలాగే కళ్లు ఎర్రగా మారి దురద, చికాకు కలుగుతుంది. 
 

36
Red Eyes

Red Eyes

సీజనల్ అలెర్జీలు

దుమ్ము, ధూళి వల్ల కళ్లలో అలెర్జీ వస్తుంది. దీనివల్ల కళ్లు దురద పెట్టడం, కంటి నుంచి నీళ్లు కారడం, ముక్కు కారడం వంటి సమస్యలు వస్తాయి. అలాగే తుమ్ములు, ముక్కు దిబ్బడ వంటి ఎన్నో ఇతర సమస్యలు కూడా వస్తాయి. 
 

46
Red Eyes

Red Eyes

కంటి ఇన్ఫెక్షన్లు

చలికాలంలో చల్లని, పొడి వాతావరణం వైరస్ లు లేదా బ్యాక్టీరియా వల్ల కంటి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలను పెంచుతాయి. దీనివల్ల కంటి వాపు, కళ్లు ఎర్రగా మారడం, కళ్ల నుంచి ఎప్పుడూ నీరు కారడం వంటి సమస్యలు వస్తాయి. ఇది కండ్లకలకకు దారితీస్తుంది. 
 

56
red eyes

red eyes

ఫోటో కెరాటిటిస్

చలికాలంలో చాలా మంది ఎండలో ఎక్కువ సేపు కూర్చుంటుంటారు. కానీ దీనివల్ల యూవీ రేడియేషన్ కు ఎక్కువగా గురవుతారు. ఇది ఫోటో-కెరాటిటిస్ లేదా మంచు అంధత్వం వంటి సమస్యలకు దారితీస్తుంది. ఈ సమస్య వల్ల కంటి నొప్పి, అసౌకర్యం కలుగుతుంది. అంతేకాదు తాత్కాలిక దృష్టి నష్టం కూడా కలుగుతుంది. 
 

66
Red Eyes

Red Eyes

కొందరికే కళ్లు ఎక్కువగా ఎందుకు పొడిబారుతాయి?

చలికాలంలో కొందరికి కంటి సమస్యలు మరీ ఎక్కువగా వస్తుంటాయి. అయితే డ్రై ఐ సిండ్రోమ్ తో బాధపడేవారు సంవత్సరం పొడవునా అసౌకర్య లక్షణాలతో ఇబ్బంది పడొచ్చు. కానీ ఆరోగ్య నిపుణుల ప్రకారం..  చలికాలంలో కళ్లు పొడిబారే సమస్య ఎక్కువగా ఉంటుంది. చలికాలంలో గాలులు ఎక్కువగా వీస్తాయి. దీనివల్ల మన కళ్లలోని తేమ తగ్గుతుంది. దీంతో కళ్లు పొడిబారుతాయి.అలాగే మన కన్నీటి గ్రంథులు తగిన్ని కన్నీళ్లను ఉత్పత్తి చేయనప్పుడు లేదా మీ కళ్లలో కన్నీళ్లు తగినంత లేనప్పుడు కళ్లు పొడిబారుతాయి. 
 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image2
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Recommended image3
Street Food: రోడ్డు మీద సమోసాలు, బజ్జీలు ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? నూనె బాగుందో లేదో 10 సెకన్లలో ఎలా గుర్తించాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved