కొలెస్ట్రాల్ గుండె జబ్బులొచ్చేలా చేస్తుంది.. ఇది తగ్గాలంటే రోజూ ఈ వ్యాయామాలను చేయండి
చెడు కొలెస్ట్రాల్ గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. అంతేకాదు ఇది మరణాల ప్రమాదాన్ని కూడా బాగా పెంచుతుంది. అయితే కొన్ని వ్యాయామాలు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి.

bad cholesterol
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోవడం అంత మందిచి కాదు. ఎందుకంటే అధిక కొలెస్ట్రాల్ గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు అంటున్నారు. చెడు కొలెస్ట్రాల్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది చనిపోవడానికి ప్రధాన కారణం. అనారోగ్యకరమైన ఆహారం, నిశ్చల జీవనశైలి, మందును ఎక్కువగా తాగడం, దీర్ఘకాలిక ఒత్తిడి, స్మోకింగ్, పొగాకు, ఊబకాయంతో సహా ఎన్నో కారకాలు అధిక కొలెస్ట్రాల్ కు దారితీస్తాయి. జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మీ కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడానికి వ్యాయామం ఎంతో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
cholesterol
కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి వ్యాయామం ఎలా సహాయపడుతుంది?
మన రక్తంలో కొలెస్ట్రాల్ వంటి కొవ్వు సమ్మేళనాలు ఉంటాయి. ఇవి మనలో ఎక్కువగా ఉన్నప్పుడు ఇది మన ధమనుల లోపలి పొరకు అంటుకుంటుంది. దీనివల్ల అవి సంకోచించబడతాయి. అలాగే హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి.ఆర్టెరియోస్క్లెరోసిస్, థ్రాంబోసిస్, వాస్కులర్ బయాలజీ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం.. శారీరకంగా చురుగ్గా ఉండే ఆడవారు.. ఎలాంటి వ్యాయామం చేయని మహిళల కంటే తక్కువ కొలెస్ట్రాల్ స్థాయిలను కలిగి ఉన్నారని కనుగొన్నారు. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి వ్యాయామం ఉత్తమమైన మార్గాలలో ఒకటని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం ఏయే వ్యాయామాలను చేయాలంటే?
ఏరోబిక్ వ్యాయామాలు
ఏరోబిక్ వ్యాయామాలలో పాల్గొనడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. స్పోర్ట్స్ మెడిసిన్ పత్రికలో ప్రచురించబడిన ఒక అధ్యయనం.. చురుకైన నడక, జాగింగ్, ఈత, సైక్లింగ్ లేదా కార్డియో వంటి ఏరోబిక్ వ్యాయామాలు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయని కనుగొన్నారు. వారానికి కనీసం 150 నిమిషాల మితమైన-తీవ్రత ఏరోబిక్ వ్యాయామం లేదా 75 నిమిషాల తీవ్రమైన-తీవ్రత ఏరోబిక్ వ్యాయామాలను చేయండి.
హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్
బీఎమ్జె ఓపెన్ స్పోర్ట్ అండ్ ఎక్సర్సైజ్ మెడిసిన్ పత్రికలో ప్రచురించబడిన ఒక అధ్యయనం..కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి హెచ్ఐఐటి సహాయపడుతుందని కనుగొన్నారు. ఈ రకమైన శిక్షణ కొలెస్ట్రాల్ స్థాయిలు, గుండె ఫిట్నెస్ ను మెరుగుపరుస్తుందని తేలింది. అయినప్పటికీ ఇది అందరికీ తగినది కాకపోవచ్చు. అందుకే హెచ్ఐఐటిని ప్రారంభించే ముందు డాక్టర్ ను సంప్రదించడం చాలా అవసరం.
వెయిట్ లిఫ్టింగ్
వెయిట్ లిఫ్టింగ్ లేదా రెసిస్టెన్స్ బ్యాండ్లను ఉపయోగించడం వంటి బలం శిక్షణ వ్యాయామాలు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి ప్రయోజనకరంగా ఉంటాయి. కండర ద్రవ్యరాశిని నిర్మించడం, జీవక్రియను పెంచడానికి, మొత్తం లిపిడ్ ప్రొఫైల్స్ ను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. రెసిస్టెన్స్ లేదా బలం శిక్షణ మీ కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతుందని స్పోర్ట్స్ మెడిసిన్ అధ్యయనం కనుగొంది.
యోగా
యోగా కొలెస్ట్రాల్ స్థాయిలతో సహా మొత్తం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉందని నిరూపించబడింది. ఎల్డిఎల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడానికి యోగా ప్రయోజనకరంగా ఉంటుందని అనేక అధ్యయనాలు కనుగొన్నాయి. కొన్ని యోగా భంగిమలు, శ్వాస వ్యాయామాలు ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి.
cholesterol
శారీరక శ్రమ
నిర్దిష్ట వ్యాయామాలతో పాటుగా సాధారణ శారీరక శ్రమలో పాల్గొనడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. ఇందులో తోటపని, ఇంటి పని లేదా ఎలివేటర్ కు బదులుగా మెట్లు ఎక్కడం వంటి కార్యకలాపాలు ఉండొచ్చు. రోజంతా చురుగ్గా ఉండటం, ఎక్కువసేపు కూర్చోకుండా ఉండటమే ముఖ్యం.