Health Tips: అల్పాహారంగా ఈ టిఫిన్స్ తీసుకోండి.. గుండె జబ్బులకు చెక్ పెట్టండి?
Health Tips: మన ఆహారంలోనే మన ఆరోగ్యం దాగి ఉందని చాలామందికి తెలుసు కానీ బిజీ షెడ్యూల్ వల్ల పెద్దగా శ్రద్ధ పెట్టరు. వారు చేసే అశ్రద్ధ పెను ప్రమాదానికి దారి తీసే అవకాశం ఉంది. అలాంటి వాళ్ల కోసమే ఈ డైట్ చార్ట్. మీరు ఓ లుక్ వేయండి.

గుండెజబ్బు అనేది ఎప్పుడు ఎలా వస్తుందో అనేది ఎవరు చెప్పలేం. వంశపారపర్యంగా కూడా వస్తుంది గుండెజబ్బు. ఈ జబ్బులు వచ్చిన తర్వాత బాధపడటం కన్నా రాకముందే జాగ్రత్త పడటం చాలా అవసరం. అందుకే మనం తీసుకునే అల్పాహారంలో కొంచెం శ్రద్ధ పెడితే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది.
అందుకే గుండెపోటు రాకుండా ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా గుడ్డులోని తెల్లసొన అల్పాహారంగా తీసుకున్నట్లయితే అందులో ఉండే విటమిన్లు గుండె జబ్బులు రాకుండా చేస్తుంది. అల్పాహారం కోసం అందుబాటులో ఉన్న అత్యంత ఆరోగ్యకరమైన టిఫిన్స్ లో ఓట్స్ ఒకటి.
ఇవి తినటం వల్ల ఎనర్జిటిక్ గా అనిపించడమే కాదు మీ హృదయానికి కూడా గొప్పగా ఉపయోగపడతాయి. ఓట్స్ లో బీటా బ్లూకాన్ ఉంటుంది ఇది కరిగే ఫైబర్ ఇది శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలని ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించడంలో సహాయపడుతుంది.
ఓట్ మీల్ బ్రెడ్ పోట్ మిల్ కుకీస్ కూడా బ్రేక్ ఫాస్ట్ గా చాలా మంచిది. అలాగే బార్లీ మిల్లెట్ బీన్స్ మరియు పప్పులు కూడా గుండెకి చాలా మంచివి ఎందుకంటే అవి సహజమైన ఫైబర్ ని కలిగి ఉంటాయి. పొద్దున్నే అల్పాహారంగా నారింజ తీసుకోవడం కూడా గుండెకి ఎంతో ఉత్తమం.
అమెరికన్ హాట్ అసోసియేషన్ వారానికి కనీసం రెండు రకాల చేపలని తినాలని సిఫారసు చేస్తుంది అందులో ఒకటి సాల్మన్ మరొకటి ట్యూనా వంటి కొవ్వు చేపలు. వీటిని తినడం వలన హృదయానికి ఎంతో మంచిది.
అలాగే వాల్నట్స్ను కూడా మీ అల్పాహారంలో నిర్భయంగా చేర్చుకోవచ్చు. న్యూట్రియంట్స్ జర్నల్ పత్రిక లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం ప్రతిరోజు వాల్ నట్లు తినే వ్యక్తులు హృదయానాల మరణాలలో 20% తగ్గుదల కలిగి ఉన్నారు.