పరగడుపున ఎలాంటి ఫుడ్స్ తింటే ఆరోగ్యంగా ఉంటారో తెలుసా?
హెల్దీ ఫుడ్ తీసుకున్నా కూడా ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయా అనుకుంటాం. కానీ... ఆ ఫుడ్స్ ని ఎలా తినాలి..? ఏ టైమ్ లో తినాలి అనే విషయాలు తెలియక మనం ఈ సమస్యలు కొని తెచ్చుకుంటున్నాం.
zinc
మనం చాలా రకాల ఆహారాలు రోజూ తీసుకుంటూ ఉంటాం. వాటిలో ఆరోగ్యకరమైన ఆహారాలు కూడా ఉంటాయి. కానీ.. మనం చాలా రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం. హెల్దీ ఫుడ్ తీసుకున్నా కూడా ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయా అనుకుంటాం. కానీ... ఆ ఫుడ్స్ ని ఎలా తినాలి..? ఏ టైమ్ లో తినాలి అనే విషయాలు తెలియక మనం ఈ సమస్యలు కొని తెచ్చుకుంటున్నాం.
రోజంతా చురుగ్గా, ఆరోగ్యంగా ఉండాలంటే సరైన పద్ధతిలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా, అల్పాహారం ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినే కొన్ని ఆహారాలు ఆరోగ్యంపై ఎంతగానో ప్రభావం చూపుతాయని మీకు తెలుసా..? ఇప్పుడు మనం ఉదయం పూట ఖాళీ కడుపుతో ఎలాంటి ఆహారాలు తినాలో.. వాటి వల్ల కలిగే లాభాలు ఏమిటో తెలుసుకోవచ్చు.
గోరువెచ్చని నీరు , నిమ్మరసం: ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం కలిపి తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఉదాహరణకు, బరువు తగ్గడం , జీర్ణక్రియ సమస్యలు తలెత్తవు. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
soaked almonds
నానబెట్టిన బాదం లేదా పిస్తా: అలాగే, నానబెట్టిన బాదం లేదా పిస్తాలను ఉదయాన్నే తినడం వల్ల రోజంతా శక్తివంతంగా ఉంటుంది. కారణం ఇందులో ఉండే పోషకాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ముఖ్యంగా వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు దీర్ఘకాలిక వ్యాధులను నివారించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
స్ట్రాబెర్రీలు: ఉదయాన్నే పరగడుపున స్ట్రాబెర్రీ తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ కీళ్ల నొప్పులు, బాడీ పెయిన్ రాకుండా చేస్తుంది. అలాగే, చియా విత్తనాలను ఖాళీ కడుపుతో తినడం కూడా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
papaya
బొప్పాయి: బొప్పాయిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తింటే బరువు తగ్గాలనుకునే వారికి చాలా మంచిది. ఇలా తినడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇందులో ఉండే గుణాలు ఎముకలను దృఢంగా ఉంచడంలో సహాయపడతాయి. అంతే కాకుండా బీపీ, షుగర్‌ని కంట్రోల్ చేస్తుంది.