జున్ను, వెన్న కొలెస్ట్రాల్ ను పెంచుతాయా? ఎండాకాలంలో కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఇలా చేయండి
అధిక కొలెస్ట్రాల్ గుండెపోటు, స్ట్రోక్ తో పాటుగా ఎన్నో ప్రమాదకరమైన గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే దీన్ని వీలైనంత తొందరగా తగ్గించుకోవాలి.

cholesterol
స్పైసీ, వేయించిన ఆహారాలను తింటే మన శరీరంలో అనారోగ్యకరమైన కొవ్వు పెరిగిపోతుంది. ఫలితంగా కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు హృదయ సంబంధ సమస్యల ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. అయితే ఎండాకాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రణలో ఉంచొచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అవేంటంటే..
మధ్యధరా ఆహారం
మన శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడానికి ఎన్నో ఆహారాలు సహాయపడతాయి. హెల్తీ, టేస్టీ ఫుడ్ ను తినాలనుకుంటే మీకు మధ్యధరా ఆహారం ఎంతో సహాయపడతుంది. ఈ మధ్యధరా ఆహారంలో పండ్లు, కూరగాయలు, బీన్స్, తృణధాన్యాలు, కాయలు, చేపలు, ఆలివ్ నూనె వంటి హెల్తీ ఆహారాలు ఉంటాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడానికి రెడ్ మీట్ ను అస్సలు తినకండి.
వ్యాయామాన్ని పెంచండి
వ్యాయామం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎక్కువ సేపు వ్యాయామం చేయడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. మీరు శారీరకంగా చురుగ్గా లేకపోతే మీ శరీరంలో కొవ్వు, కొలెస్ట్రాల్ బాగా పేరుకుపోతాయి. ఎండాకాలంలో వైద్యుల సూచనల మేరకు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడానికి ప్రయత్నించండి.
fiber
ఫైబర్ మొత్తాన్ని పెంచండి
మధ్యధరా ఆహారం తీసుకున్నప్పటికీ.. ఫైబర్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే ఇది కొవ్వు, కొలెస్ట్రాల్ రక్తప్రవాహంలోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది. అంతేకాదు ఇది రక్తం నుంచి కొలెస్ట్రాల్ ను తొలగించడానికి కాలేయాన్ని ప్రోత్సహిస్తుంది. ఫైబర్ ను భర్తీ చేయడానికి మీరు సప్లిమెంట్లను కూడా తీసుకోవచ్చు.
జున్ను, వెన్న ను తినకండి
జున్ను, వెన్నలో సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. శారీరక శ్రమను తగ్గిస్తే కేలరీలు ఖర్చవుతాయి. సంతృప్త కొవ్వు పదార్థాలు శరీరంలో కొవ్వును పెంచుతాయి. అందుకే ఎండాకాలంలో జున్ను, వెన్న ను తీసుకోవడం తగ్గించండి. వీటికి బదులుగా ప్రతిరోజూ 1 గ్లాసు మజ్జిగ తాగడానికి ప్రయత్నించండి.
smoking
స్మోకింగ్
అధిక బరువు, స్మోకింగ్ లేదా శారీరకంగా చురుగ్గా లేకపోతే మీ శరీరంలో మంచి కొలెస్ట్రాల్ తగ్గి చెడు కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంది. మీరు స్మోకింగ్ ను మానేసి, బరువును నియంత్రించి, తగినంత వ్యాయామం చేస్తే, మీ శరీరంలో హెచ్డిఎల్ అంటే మంచి కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. వేగమైన నడక, స్విమ్మింగ్, సైక్లింగ్ చేయడం వల్ల కూడా మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి.
pan cake
వేయించిన, కొవ్వు పదార్ధాలను తగ్గించండి
మఫిన్లు, వేఫర్లు, పాన్ కేక్ లు, చాక్లెట్ వంటి కొవ్వు ఎక్కువున్నఆహారాలను అస్సలు తినకండి. అలాగే ఐస్ క్రీం, కుకీలు కూడా మీ శరీరంలో కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. మీరు ఎక్కువ వేయించిన ఆహారాన్ని తింటే కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదం పెరుగుతుంది. పూర్తి కొవ్వు పాల ఉత్పత్తులు, ఎర్ర మాంసం రెండూ మీ శరీరానికి మంచివి కావు. సంతృప్త కొవ్వులు, ట్రాన్స్ ఫ్యాట్స్ రెండూ రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతాయి. కార్బోహైడ్రేట్ ఎక్కువగా ఉన్న ఆహారాలకు కూడా దూరంగా ఉండండి. ఇది ట్రైగ్లిజరైడ్లను నియంత్రిస్తుంది. కొలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తుంది.