మీకు మలబద్దకం సమస్య ఉందా? వీటిని తాగండి తగ్గిపోతుంది
నిర్జలీకరణం నుంచి తక్కువ ఫైబర్ ఫుడ్ ను తినడం వరకు మలబద్దకానికి ఎన్నో కారణాలున్నాయి. అయితే కొన్ని పానీయాలను తాగితే ఈ సమస్య తొందరగా తగ్గిపోతుందని నిపుణులు అంటున్నారు.

constipation
బయటకు చెప్పుకోరు కానీ మలబద్దకం సమస్యతో చాలా మంది బాధపడుతుంటారు. వీటికి కూడా ట్యాబ్లెట్లను వేసుకునేవారు ఉన్నారు. ఇది చిన్న సమస్యగా కనిపించొచ్చు. కానీ ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. మలబద్దకానికి ఎన్నో కారణాలుంటాయి. ఇది శరీరంలో నీటి శాతం తగ్గినా వస్తుంది. అయితే కొన్ని పానీయాలతో మలబద్దకాన్ని తగ్గించుకోవచ్చు. అవేంటంటే..
సోంపు టీ
సోంపు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తుంది. తిన్న వెంటనే కొన్ని గింజలను నమిలినా, లేదా సోంపు టీ తాగినా మలబద్దకం సమస్య నుంచి ఉపశమనం పొందుతారు. ఫైబర్ పుష్కలంగా ఉండే ఈ టీ గ్యాస్, అజీర్ణాన్ని తొలగించడానికి, మలబద్దకాన్ని నివారించడానికి సహాయపడుతుంది.
raisins water
ఎండుద్రాక్ష నీరు
ఎండు ద్రాక్షల్లో ఎన్నో ఔషదగుణాలు ఉంటాయి. జీర్ణక్రియకు సహాయపడటానికి, మలబద్దకాన్ని నివారించడానికి ఎండుద్రాక్ష నీరు ఉత్తమ పానీయాలలో ఒకటి. దీని కోసం 7 నుంచి 8 ఎండుద్రాక్షలను తీసుకుని రాత్రంతా నీటిలో నానబెట్టండి. ఉదయం లేవగానే ఈ నీటిని తాగండి.
బొప్పాయి జ్యూస్
బొప్పాయి జ్యూస్ ఎన్నో అనారోగ్య సమస్యలను తొలగిస్తుంది. బొప్పాయి రసంలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి జ్యూస్ ను తాగితే మలబద్దకం సమస్య తగ్గిపోతుంది.
Image: Getty Images
ఆరెంజ్ జ్యూస్
ఆరెంజ్ జ్యూస్ కూడా మన ఆరోగ్యానికి మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. నారింజ పండ్లలో ప్రధానంగా విటమిన్ సి, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఈ రెండూ మలబద్దకంతో పోరాడటానికి సహాయపడతాయి.