చిన్న చిన్న పనులకే అలసిపోతున్నారా? అయితే మీకు ఈ సమస్య ఉన్నట్టే..!
కొంతమంది చిన్న చిన్న పనులకే ఎంతో అలసిపోతుంటారు. కానీ ఇది అస్సలు మంచిది కాదు. ఇది ఎన్నో రోగాలను సూచిస్తుంది. అలాగే ఎన్నో పోషకాల లోపాలను సూచిస్తుంది.
Fatigue
ఎక్కువ పని చేస్తే ఎవ్వరైనా అలసిపోతారు. ఇది సహజం. కానీ కొంతమంది చిన్న చిన్న పనులను చేసినా ఎంతో అలసిపోతారు. ఇలాంటి వారే ఆరోగ్యం పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మీరు తొందరగా అలసిపోతే మీ శరీరంలో ఏదో లోపం ఉందని అర్థం చేసుకోవాలి. ఈ లోపాలను పోగొడితే అలసటను తగ్గించుకోవచ్చు.
Fatigue
చిన్న పనికి కూడా ఎందుకు అలసిపోతారు?
కొంతమందికి కొద్దిసేపు నడిచినా, నిలబడినా, కొన్ని ఇంటి పనులు చేసినా బాగా అలసిపోతారు. దీనికి కారణాలెన్నో ఉన్నాయి. ఒంట్లో శక్తి లేకపోవడం, బలహీనత, బద్ధకం వంటి సమస్యలు దీనివల్ల వస్తాయి. ఇవి మీరు విశ్రాంతి తీసుకున్నా తగ్గవు. ఈ అలసట మిమ్మల్ని శారీరకంగానే కాదు మానసికంగా, భావోద్వేగంగా కూడా ఇబ్బంది పెడుతుంది. అసలు ఈ అలసట ఎందుకు కలుగుతుందో ఇప్పుడు తెలుకుందాం..
Fatigue
హైడ్రేషన్
కొన్నికొన్నిసార్లు అలసటగా అనిపించడానికి నిర్జలీకరణం కూడా ఒక కారణమంటున్నారు నిపుణులు. వాటర్ మన అలసటను తొలగించడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా వ్యాయామం తర్వాత. శరీరంలో తగినంత నీరు ఉన్నప్పుడే మన శరీరం చురుగ్గా ఉంటుంది. అలాగే సమర్థవంతంగా పనిచేయగలుగుతుంది. అందుకే రోజంతా మిమ్మల్ని హైడ్రేట్ గా ఉంచడానికి నీటిని పుష్కలంగా తాగండి.
Fatigue
కెఫిన్ ను తగ్గించండి
చిన్న చిన్న పనులు చేసిన తర్వాత అలసటతో మీరు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటే.. కెఫిన్ ను తగ్గించండి. ఇందుకోసం రోజుకు 1 లేదా 2 సార్లు మాత్రమే టీ, కాఫీలను తాగండి. లేదా ఈ టీ, కాఫీలతో పాటుగా శీతల పానీయాలకు దూరంగా ఉండండి. అయితే మీరు కెఫిన్ తీసుకోనప్పుడు అలసట కలుగుతుందో లేదో చెక్ చేయండి. ఒకవేళ అలసటగా ఉంటే మాత్రం ఒక నెల పాటు కెఫిన్ ను మానేయండి.
బ్రేక్ ఫాస్ట్ ముఖ్యం
ఆహారం మన జీవక్రియను పెంచుతుంది. అలాగే శరీరం పనిచేయడానికి శక్తిని అందిస్తుంది. అందుకే రాగులు, క్వినోవా వంటి ధాన్యాలతో చేసిన వంటకాలతో సహా ఎక్కువ కార్బోహైడ్రేట్ అల్పాహారం తీసుకోవడానికి ప్రయత్నించండి. బ్రేక్ ఫాస్ట్ రోజంతా మీ అలసటను తగ్గించడానికి సహాయపడుతుంది.
Fatigue
భోజనాన్ని స్కిప్ చేయడం
పబ్ మెడ్ సెంట్రల్ ప్రకారం.. ఎక్కువసేపు ఆహారం లేకుండా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. అయితే మీరు రోజంతా ఎనర్జిటిక్ గా ఉండటానికి టైం టూ టైం తినండి. చాలా సేపు తినకుండా ఉంటే బరువు తగ్గుతారని ఇలా చేయకండి. ఎందుకంటే ఇది మీ తగ్గించడం సంగతి పక్కన పెడితే ఎన్నో సమస్యలకు దారితీస్తుంది. ఇది మీ శక్తిని దెబ్బతీయడమే కాకుండా జీర్ణవ్యవస్థకు కూడా హాని కలిగిస్తుంది. అందుకే భోజనాన్ని స్కిప్ చేయడానికి బదులుగా ఆరోగ్యకరమైన, పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాన్నే తినండి. ఇది మీ బరువును తగ్గిస్తుంది. అలసటను కూడా పోగొడుతుంది.
Fatigue
ఆరోగ్యకరమైన ఆహారం
మీకు మరీ అలసట ఎక్కువగా అనిపిస్తే మీ శరీరానికి కొన్ని ముఖ్యమైన పోషకాలు అవసరం కావొచ్చు. ఇలాంటి సమయంలో మీరు పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ఆరోగ్యకరమైన, తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులు, మాంసాలు వంటి ఆహారాలను మీ రోజువారి ఆహారంలో చేర్చండి. ఎక్కువ కొవ్వు, చక్కెర, ఎక్కువ ఉప్పు ఉన్న ఆహారాలను తినడం తగ్గించండి. ఈ ఆహారాలన్నీ శరీరంలో శక్తిని తగ్గిస్తాయి. ఇది అలసటకు దారితీస్తుంది.
Fatigue
అతిగా తినడం మానుకోండి
నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం.. అతిగా తినడం మీ శారీరక శక్తిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఒకేసారి ఎక్కువ ఆహారం తినడానికి బదులుగా ఎక్కువ సార్లు కొద్దిమొత్తంలోనే తినడానికి ప్రయత్నించండి. ఇది రక్తంలో చక్కెర, ఇన్సులిన్ స్థాయిలు మరింత స్థిరంగా ఉండటానికి దారితీస్తుంది. మీరు ఈ విధంగా తింటే శరీరంలోని అదనపు కొవ్వు తగ్గుతుంది.
ఇనుము లోపం
ఐరన్ లోపం ఆడవారిలోనే ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ లోపం కూడా తీవ్రమైన అలసటకు కారణమవుతుంది. బచ్చలికూర, బీన్స్, బీట్ రూట్ వంటి ఐరన్ రిచ్ ఫుడ్స్ ను మీ డైట్ లో చేర్చుకోండి. ఈ ఆహారాలు మిమ్మల్ని ఎక్కువ సేపు తాజాగా, చురుగ్గా ఉంచడానికి సహాయపడతాయి.
తగినంత నిద్ర
రీసెర్చ్ గేట్ ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. నిద్ర లేకపోవడం వల్ల చాలా మంది ఎక్కువ అలసటగా ఉంటారు. అందుకే మీరు 7 నుంచి 8 గంటలు కంటినిండా నిద్రపోవడానికి ప్రయత్నించండి. నిద్రనే మనల్ని అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంచుతుంది.