బీర్ తాగితే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయా?
మీకు తెలుసా? బీర్ ను తాగితే మూత్రపిండాల్లోని రాళ్లు కరిగిపోతాయని ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరు నమ్ముతున్నట్టు సర్వేలో వెళ్లడైండి. మరి దీనిలో నిజమెంతంటే?
Image: Getty
వైన్, బీర్ ను ఇష్టపడనివారుండరు. ఫ్రెండ్స్ తో పార్టీలకు వెళ్లినప్పుడు పక్కాగా బీర్ ను లాగిస్తుంటారు. అయితే ఈ బీర్ ను మోతాదులో తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చాలా పరిశోధనలే వెల్లడించాలయి. అయితే కొంతమంది బీర్ను తాగడం వల్ల కిడ్నీల్లో రాళ్లు రావని కూడా నమ్ముతారు. అలాగే ఇప్పటికే మూత్రపిండాల్లో రాళ్లు ఉంటే బీర్ ను తాగడం వల్ల అవి కరిగిపోతాయని కూడా నమ్ముతున్నవారున్నారు. మీకు తెలుసా? ఈ విషయాన్ని ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరు నమ్ముతున్నారని సర్వేలు వెల్లడిస్తున్నాయి. మరి దీనిలో నిజమెంతంటే?
Image: Getty
ప్రిస్టీన్ అనే ఆరోగ్య సంరక్షణ సంస్థ ఈ మధ్య నిర్వహించిన ఒక సర్వేలో.. బీర్ తాగడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు కరిగిపోతాయని ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరు నమ్ముతున్నట్టు వెల్లడైండి.
కిడ్నీ స్టోన్ అంటే ఏంటి?
కిడ్నీ స్టోన్స్ ను సాధారణంగా "మూత్రపిండాల్లో రాళ్లు" అని కూడా పిలుస్తారు. ఇది ఒక మూత్రపిండాల సమస్య. దీనివల్ల మూత్రపిండాల్లో చిన్న చిన్న రాళ్లు ఏర్పడతాయి. మూత్రపిండాల లోపల ఉన్న ద్రవ పదార్ధం స్ఫటికీకరణ ఫలితంగా ఈ రాళ్లు ఏర్పడతాయి. అయితే కాల్షియం, యూరిక్ ఆమ్లం లేదా ఇతర లోహాలు మూత్రపిండాల్లో కలిసిపోతాయి. ఈ కారణంగా అవి రాయి లాంటి ఆకారాన్ని ఏర్పరుస్తాయి. వీటినే కిడ్నీ స్టోన్స్ అంటాం. దీనితో పాటుగా అధిక రక్తపోటు, డయాబెటిస్ వంటి మూత్రపిండాల వ్యాధులు వంటి ఇతర సమస్యలు కూడా ప్రమాదాన్ని కలిగిస్తాయి. అలాగే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి కూడా కారణమవుతాయి.
kidney stone
kidney stoneఅయితే కొంతమందికి నీళ్లను తక్కువగా తాగే అలవాటు ఉంటుంది. దీనివల్ల మూత్రం సరిగా తయారు కాదు. దీనివల్ల రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. అలాగే కిడ్నీలో రాళ్లు జెనెటిక్స్ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది ఒక జన్యుపరమైన వ్యాధి. అంటే మీ కుటుంబంలో ఎవరికైనా ఉంటే మీకు కూడా వచ్చే అవకాశం ఉంది. అసలు మూత్రపిండాల్లో రాళ్లు ఎందుకు ఏర్పడతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
kidney stone
1. నిర్జలీకరణం: చాలా మంది నీళ్లను పుష్కలంగా తాగరు. ఇలా నీటిని తాకపోవడం వల్ల మూత్రం చిక్కగా మారుతుంది. దీనివల్ల రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది.
2. ఆహారం: ఉప్పును ఎక్కువగా తీసుకోవడం, జంతు ప్రోటీన్, ఆక్సలేట్ ఎక్కువగా ఉండే ఆహారాలు అంటే బచ్చలికూర, చాక్లెట్, కాయలు, కొన్ని పండ్లు వంటి ఆహారాలను తినడం వల్ల కూడా రాళ్లు ఏర్పడతాయి.
3. కుటుంబ చరిత్ర: మీ కుటుంబంలో ఎవరికైనా కిడ్నీ స్టోన్స్ వచ్చినట్టైతే మీకు కూడా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది.
4. కొన్ని అనారోగ్య సమస్యలు: హైపర్కాల్సియూరియా, సిస్టినురియా, హైపర్ థైరాయిడిజం వంటి అనారోగ్య సమస్యలు కూడా మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతాయి.
5. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు: కొన్ని రకాల బ్యాక్టీరియా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే పదార్థాలను ఉత్పత్తి చేస్తుంది.
బీర్ తాగడం వల్ల రాళ్ల ప్రమాదం తగ్గుతుందా?
అమెరికన్ అడిక్షన్ సెంటర్ నివేదిక.. బీర్ తాగడం వల్ల రాళ్లు కరుగుతాయని, లేదా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం తగ్గుతుంది అనడానికి ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు లేవని పేర్కొంది.
ముఖ్యంగా కిడ్నీల్లో రాళ్లు ఉన్నవారు ఆల్కహాల్ ను తాగడం వల్ల మరిన్ని అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ నివేదికలో పేర్కొన్నారు. ఆల్కహాల్ లేదా బీర్ ఎక్కువగా తాగడం వల్ల మూత్రపిండాల వైఫల్యం, అధిక రక్తపోటు వంటి సమస్యలు వస్తాయి.
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. బీర్ తాగడం వల్ల కిడ్నీ స్టోన్స్ రావు అనేది కేవలం ఒక అపోహ మాత్రం. బీర్ తో పాటుగా అన్ని రకాల ఆల్కహాల్ మూత్రవిసర్జనగా పనిచేస్తాయి. అంటే ఇవి మూత్రం ఉత్పత్తిని పెంచుతాయి. అలాగే మూత్రపిండాల నుంచి రాళ్లు ఏర్పడే పదార్థాలను బయటకు తీయడానికి సహాయపడుతుంది. అయితే మితిమీరిన ఆల్కహాల్ సేవించడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ కు దారితీస్తుందని, ఇది కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
kidney stone
రాళ్లను ఎలా తొలగించాలి?
ఒకసారి రాళ్లు ఏర్పడిన తర్వాత వాటి పరిమాణం మారుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇది ఇసుక రాయి అత చిన్నగా ఉంటుంది. కానీ ఇది గోల్ఫ్ బంతి అంత పెద్దగా కూడా తయారవుతుందని నిపుణులు అంటున్నారు. రాళ్లు మూత్ర మార్గం వరకు వ్యాపిస్తాయి. ఇవి మూత్ర ప్రవాహాన్ని ఆపినప్పుడు విపరీతమైన నొప్పి, అసౌకర్యం కలుగుతుంది. మూత్రపిండాల్లో రాళ్లను తగ్గించడానికి మందులను వాడాలి. అలాగే ద్రవాలను ఎక్కువగా తాగాలి. ఆహార మార్పులు చేసుకోవాలి. అలాగే తీవ్రమైన సందర్భాల్లో లిథోట్రిప్సీ లేదా శస్త్రచికిత్స వంటి విధానాలను కూడా ఫాలో కావాల్సి ఉంటుంది.