పురుషులతో పోలిస్తే.. మహిళలు బరువు తగ్గడం అంత కష్టమా..?
పురుషులు కాస్త ఎక్కువగా కష్టపడితే.. సులభంగానే బరువు తగ్గుతున్నారట.. కానీ.. మహిళల విషయంలో మాత్రం అది సాధ్యపడటం లేదు. మీరు చదివింది నిజమే.. పురుషులతో పోలిస్తే.. మహిళలు బరువు తగ్గడం కాస్త కష్టమైన విషయం అట.

బరువు తగ్గడం ఈ రోజుల్లో చాలా మంది ముందున్న అతి పెద్ద టాస్క్. వయసు, తమ ఎత్తుకు మించిన బరువు ఉన్నవారంతా.. బరువు తగ్గించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే... అవి చాలా మందికి సాధ్యం కావడం లేదనే చెప్పాలి. చాలా మందికి తమ ఆరోగ్యం, ఆహారం, లైఫ్ స్టైల్ మార్చుకున్నా.. బరువు విషయం వచ్చే సరికి పెద్ద తేడా కనిపించడం లేదు. దీంతో తీవ్ర నిరుత్సాహానికి గురౌతున్నారు.
weight loss
ఈసంగతి పక్కన పెడితే.. పురుషులు కాస్త ఎక్కువగా కష్టపడితే.. సులభంగానే బరువు తగ్గుతున్నారట.. కానీ.. మహిళల విషయంలో మాత్రం అది సాధ్యపడటం లేదు. మీరు చదివింది నిజమే.. పురుషులతో పోలిస్తే.. మహిళలు బరువు తగ్గడం కాస్త కష్టమైన విషయం అట. అలా ఎందుకు జరుగుతుందో..? ఇందులో నిజమెంతో నిపుణులు ఏం చెబుతున్నారో ఓసారి చూద్దాం...
పోషకాహార నిపుణుడు భక్తి కపూర్ ప్రకారం, ఒక స్త్రీ కొన్ని కిలోల బరువు తగ్గడానికి కష్టపడడానికి అనేక కారణాలు ఉన్నాయి, అయితే పురుషుడు దానిని అప్రయత్నంగా చేసేస్తున్నారట. ఈ విషయానికి సంబంధించిన ఆయన మూడు విషయాలను వివరించారు.
1. తక్కువ టెస్టోస్టెరాన్: తక్కువ టెస్టోస్టెరాన్ ఉన్నవారు బరువు తగ్గడం చాలా కష్టమట. టెస్టోస్టెరాన్ ఉన్నవారు మాత్రమే తొందరగా బరువు తగ్గుతున్నారట. ఓ పరిశోధనలో ఈ విషయం స్పష్టంగా తేలింది.
2. శరీర కూర్పు: స్త్రీల కంటే పురుషులు ఎక్కువ లీన్ మాస్ కలిగి ఉంటారు. పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా లిక్విడ్ ఫ్యాట్ కలిగి ఉంటారు. పురుషులు ట్రంక్ , పొత్తికడుపు చుట్టూ కొవ్వు ఉంటుంది.. కాబట్టి.. అది తగ్గడం అసాధ్యమౌతంది. అయితే స్త్రీలలో కొవ్వు మాత్రం సాధారణంగా నడుము, తొడల దగ్గర పేరుకు పోతుంది. దీంతో.. అవి తగ్గడానికి సమయం ఎక్కువ పడుతుంది.
3. హార్మోన్ల హెచ్చుతగ్గులు: కండర ద్రవ్యరాశిని నిర్వహించడం, శరీర కొవ్వును కోల్పోవడం ,ఒత్తిడి ,ఆకలిని ఎదుర్కోవడం వంటి వివిధ ముఖ్యమైన విధులకు హార్మోన్లు బాధ్యత వహిస్తాయి. ఫలితంగా, హార్మోన్ల అసమతుల్యత సంభవించినప్పుడు, బరువు తగ్గడం చాలా కష్టమవుతుంది.
మహిళలకు పురుషులు ఎక్కువగా కొవ్వు కలిగి ఉంటారు. పురుషులతో పోలిస్తే .. స్త్రీలలో 11శాతం ఎక్కువగా ఫ్యాట్ ఉంటుంది. అందుకే వారు అది తగ్గించడం అసాధ్యంగా మారుతుంది.