భోజనం చేశాక స్నానం చేస్తున్నారా... ఈ విషయం తెలిస్తే ఇంకెప్పుడు అలా చెయ్యరు!
సాధారణంగా మనం ప్రతిరోజు ఉదయమే లేచి స్నానమాచరించి మన రోజువారి పనులకు వెళుతూ ఉంటాము. ఇలా ఉదయం స్నానం చేసిన వెంటనే అల్పాహారం తీసుకోవడం ఎంతో మంచిది. అయితే కొంతమంది బద్ధకస్తుల మాత్రం తిన్న తర్వాత స్నానం చేద్దాంలే అని భావిస్తుంటారు. ఇలా తిన్న తర్వాత స్నానం చేయడం మంచిది కాదని మన పెద్దవారు చెబుతుంటారు. తిన్న తర్వాత స్నానం చేయడం వల్ల ఏం జరుగుతుంది ఎలాంటి సమస్యలు వస్తాయో ఇక్కడ తెలుసుకుందాం...

సాధారణంగా చాలామంది భోజనం చేస్తున్న తర్వాత లేదా ఉదయం టిఫిన్ చేసిన తర్వాత స్నానానికి వెళ్తారు. ఇలా స్నానం చేయడం మంచిది కాదని పెద్దవాళ్లు వారిస్తూ ఉంటారు. అయితే తిన్న తర్వాత స్నానం చేయడం వల్ల మనం తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాదని తద్వారా జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయని చెప్పాలి. మనం భోజనం చేసిన తర్వాత ఆహారం జీర్ణ వ్యవస్థలోకి వెళ్లి జీర్ణక్రియ జరిగే ప్రాసెస్ మొదలవుతుంది.
మనం తీసుకున్న ఆహారం జీర్ణం కావాలంటే జీర్ణాశయం నుంచి కొన్ని రసాయనాలు విడుదలై లోపల వేడిని కలిగించి ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. ఈ విధంగా జీర్ణ వ్యవస్థ నుంచి విడుదలయ్యే రసాయనాల గాఢత కారణంగా ఆహారం వెంటనే జీర్ణం అవడంతో ఏ విధమైనటువంటి జీర్ణక్రియ సమస్యలు తలెత్తవు. అలా కాకుండా మనం తిన్న వెంటనే స్నానం చేయటం వల్ల మన శరీరం మొత్తం చల్లబడుతుంది.
ఈ క్రమంలోనే శరీరం చల్లబడటంతో ఆమ్లాలు ఘాడత కూడా తగ్గి ఆహారాన్ని సరిగా జీర్ణం చేయదు. తద్వారా మనకు కడుపులో ఉబ్బరం అనిపించడం, గ్యాస్ట్రిక్ సమస్యలు ఏర్పడటం జరుగుతుంది. ఈ విధంగా మనం తిన్న వెంటనే స్నానం చేయటం వల్ల తొందరగా అలసిపోవడం,నీరసం రావడం వంటివి కూడా జరుగుతుంటాయి అలాగే ఏదైనా పని చేయాలన్నా కూడా పనిపై పూర్తి శ్రద్ధ ఉండదు. తొందరగా అలసట వస్తుంది. అందుకే తిన్న వెంటనే స్నానం చేయకూడదని చెబుతారు.
ఇక మధ్యాహ్న సమయంలో కూడా భోజనం చేసిన వెంటనే స్నానం చేయకూడదు సుమారు రెండు నుంచి మూడు గంటల వ్యవధి ఇచ్చిన తర్వాత స్నానం చేయడం ఎంతో మంచిది. తినక ముందు స్నానం చేసినప్పటికీ స్నానం చేసిన వెంటనే కాస్త నూనె పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది.