టీని ఇలా ఎప్పుడూ తాగకండి.. ఒకవేళ తాగారంటే మీ పని అంతే.. !
సాయంత్రం ఎవరు టీని పెడతారులే.. ఒకేసారి పెట్టి సాయంత్రం వేడిచేసుకుని తాగొచ్చులే అనుకుంటారు చాలా మంది. ఇలాగే చేస్తుంటారు కూడా. కానీ టీని మళ్లీ వేడి చేసి తాగడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. దీనివల్ల ఎన్ని సమస్యలు వస్తాయో తెలుసా?
చాలా మంది టీతో రోజును స్టార్ట్ చేస్తారు. టీ తాగనిదే ఏ పనీ చేయరు. టీ ప్రియులు అంతకంతకు పెరుగుతున్నారే తప్ప తగ్గడం లేదు. మీకు తెలుసా? ఇతర దేశాలతో పోలిస్తే మన భారతదేశంలోనే టీ ని ఎక్కువగా తాగుతారు. ఉదయం, రాత్రి, పగలు అంటూ తేడా లేకుండా తాగాలనిపించినప్పుడల్లా తాగడం ఒక అలవాటుగా మారిపోయింది.
ఏదేమైనా.. టీని తాగడం వల్ల ప్రయోజనాలతో పాటుగా ఎన్నో నష్టాలు కూడా కలుగుతాయి. అయితే ఇది మీరు ఎంత, ఎప్పుడు ఉపయోగిస్తారనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు టీకి బానిసలైన వారు చాలా మందే ఉన్నారు. ఇలాంటి వారు ఉదయమే ఎక్కువ మొత్తంలో టీని ప్రిపేర్ చేసి దీన్ని తాగాలనిపించినప్పుడల్లా వేడి చేసుకుని తాగుతుంటారు. ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.
తాజా హెల్త్ రిపోర్ట్ ప్రకారం.. టీని అవసరమైనప్పుడు అప్పుడే ప్రిపేర్ చేసుకుని తాగాలి. అయితే 15-20 నిమిషాల కిందట తయారు చేసిన టీని మళ్లీ వేడి చేసి తాగితే ఎలాంటి హాని ఉండదు. కానీ పొరపాటున 4 గంటలకు మించి ఉన్న టీని మళ్లీ వేడి చేసి తాగడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇది శరీరానికి ఎన్నో విధాలుగా హాని కలిగిస్తుంది.
నిజానికి టీని తిరిగి వేడి చేయడం వల్ల టీ రుచి, వాసనతో పాటుగా దానిలోని పోషకాలన్నీ పోతాయి. అలాగే దీనిలో బ్యాక్టీరియా వ్యాప్తి చెందే అవకాశం కూడా ఉంది. ఇది ఒకటి లేదా రెండు గంటల్లో ప్రారంభమవుతుంది. దీని వల్ల ఈ టీ మనకు ఒక విషంగా పనిచేస్తుంది. ముఖ్యంగా పాలతో తయారుచేసిన టీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే దీనిలో బ్యాక్టీరియా చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. అందుకే మిల్క్ టీని తిరిగి వేడి చేయకండి.
ఇకపోతే మిల్క్ టీలో చక్కెర ఉంటుంది. దీనివల్ల బ్యాక్టీరియా త్వరగా పెరిగిపోతుంది. పంచదార, పాలతో టీని తయారు చేసినప్పుడు అది వెంటనే చల్లబడటమే కాకుండా చాలా త్వరగా కూడా చెడిపోతుంది. మళ్లీ వేడి చేసి తాగడం వల్ల శరీరానికి చాలా హాని కలుగుతుంది.