MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • Water Bottle: స్టీల్‌ బాటిల్‌, కాపర్‌ బాటిల్‌... రెండింటిలో ఏది మంచిదో తెలుసా.?

Water Bottle: స్టీల్‌ బాటిల్‌, కాపర్‌ బాటిల్‌... రెండింటిలో ఏది మంచిదో తెలుసా.?

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం ఎంత ముఖ్యమో నీరు కూడా అంతే ముఖ్యమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు సరిగ్గా నీటిని తీసుకోకపోవడమే కారణమని నిపుణులు చెబుతుంటారు. అయితే అనివార్యంగా ప్లాస్టిక్‌ బాటిల్స్‌లో నీరు తాగాల్సిన పరిస్థితి వస్తోంది. దీంతో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది..   

2 Min read
Author : Narender Vaitla
| Updated : Mar 11 2025, 02:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మనలో దాదాపు ప్రతీ ఒక్కరూ ప్లాస్టిక్‌ బాటిల్‌లోనే నీటిని తాగుతారు. అయితే ప్లాస్టిక్ బాటిల్స్‌లో నీరు తాగడం వల్ల ఎన్నో రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతుంటారు. శరీరంలోకి ప్లాస్టిక్‌ అవశేషాలు వెళ్లడానికి ప్రధాన కారణాల్లో ఈ బాటిల్స్‌లో నీరు తాగడం ఒక కారణమని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. దీంతో ఆరోగ్యంపై అవగాహన ఉన్న వారు ఎవరైనా ప్లాస్టిక్‌ బాటిల్స్‌ను నీటిని తాగేందుకు ఆసక్తి చూపించరు. 

వీటికి బదులుగా రాగి లేదా స్టీల్‌ బాటిల్స్‌ను ఉపయోగిస్తారు. అయితే ఈ రెండింటి మధ్య తేడా ఏంటనే సందేహం రావడం సర్వసాధరణం. మరి ఈ రెండింటిలో ఏ బాటిల్‌లో నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.? మరి ఈ రెండింట్లో ఏది బెటర్ అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

రాగి పాత్ర ఉపయోగాలు: 

రాగి పాత్రకు ఎంతో ప్రాధాన్యం ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పూర్వం ఎక్కువ మంది రాగి పాత్రలనే ఉపయోగించేవారు. నీటి కొలనుల్లో రాగి నాణేలను వేసే సంప్రదాయం కూడా ఇలాగే వచ్చింది. రాగి పాత్రల్లో నీటిని నిల్వచేయడం వల్ల ఈ ఖనిజం నీటిలో స్వల్ప స్థాయిలో కలుస్తుంది. దీంతో, రాగి పాత్రల్లోని నీరు అద్భుత ఔషధ గుణాలు సంతరించుకుంటాయని నిపుణులు సైతం చెబుతుంటారు. 

35

రాగికి సూక్ష్మక్రిములను నిర్వీర్యం చేసే శక్తి ఉంటుంది. రాగి పాత్రల్లో నీటిని రెగ్యులర్‌గా తీసుకుంటే జీర్ణ వ్యవస్థ బలోపేతమవుతుంది. పేగుల ఆరోగ్యం మెరుగవుతుంది. థైరాయిడ్ గ్రంధి పనితీరును మెరుగుపరచడంలో కూడా రాగి ఎంతో ఉపయోగపడుతుంది. హార్మోన్ల సమతౌల్యత కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది.

ఒత్తిడిని తగ్గించడంలో కూడా రాగి పాత్రలో నీరు ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. రాగి పాత్రల్లోని నీరు ఫ్రీరాడికల్స్‌ను నిర్వీర్యం చేసే శక్తి ఉంటుంది. మెదడు పనితీరును కీలకమైన న్యూరోట్రాన్స్‌మిటర్ల తయారీలో రాగి ఉపయోగపడుతుంది. 

45

స్టీల్‌ బాటిల్స్‌:

ఇటీవల స్టీల్‌ బాటిల్స్‌ను కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే రాగి బాటిల్స్‌తో ఉన్నన్ని లాభాలు స్టీల్‌ బాటిల్స్‌తో ఉండవు. కానీ స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ నీటిపై ఎలాంటి ప్రభావం చూపదు. అందుకే ఇందులో నిల్వ ఉంచిన నీరు ఎక్కువ కాలం శుభ్రంగా ఉంటుంది. స్టీల్‌ పాత్రలు తుప్పు పట్టవు. కాబట్టి ఎక్కువ రోజులు మన్నికగా ఉంటుంది. ఈ బాటిల్‌లో నీరు ఒకే ఉష్ణోగ్రత వద్ద ఎక్కువ సేపు నిల్వ ఉంటాయి. 

55
Bottle

Bottle

రెండింటిలో ఏది బెటర్‌.? 

రాగి, స్టీల్‌ బాటిల్‌ రెండింటిలోనూ విభిన్నమైన లాభాలు ఉన్నాయి. అయితే స్టీల్‌తో పోల్చితే రాగి బాటిల్స్‌ ధర ఎక్కువగా ఉంటుంది. అలాగే రాగి బాటిల్స్‌ను తరచూ శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఇవి త్వరగా రంగు మారుతాయి. అయితే రాగి పాత్రలో నీటిని తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. స్టీల్‌ బాటిల్‌లో అలాంటి ప్రయోజనాలు లేకపోయినప్పటికీ.. ప్లాస్టిక్‌ బాటిల్‌తో పోల్చితే చాలా మంచిదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించినంత వరకు వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం. 
 

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
 
2nd TEST • PAK vs SL 2026
Stumps
PAKPAK
(37.2 ov)121/3
SLSL
98
Day 1
Schedule ›
3rd ODI • AUS vs ENG 2026
AUSAUS
Wed, 18 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
220
ENGENG
355/6
ENG beat AUS by 135 runs
Schedule ›
5th ODI • NZ vs IND 2026
Result
NZNZ
187
INDIND
209
IND beat NZ by 22 runs
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
132/3
ENGENG
131
AUS won by 7 wickets
Schedule ›
4th ODI • NZ vs IND 2026
Result
NZNZ
333
INDIND
89
NZ beat IND by 244 runs
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
abandoned
NZNZ
-
INDIND
-
Match abandoned
Schedule ›
1st TEST • PAK vs SL 2026
Result
PAKPAK
434 & 284/8
SLSL
446
Match drawn
Schedule ›
15th T20 • WBBLT20
Result
SS-WSS-W
162/2
ST-WST-W
158
Sydney Sixers Women Won by 9 runs (D/L) method
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Drinking Water Before Brushing: ఉదయం బ్రష్‌ చేయకుండా నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా?
Recommended image2
ఎప్పుడూ ఒక‌వైపే న‌మిలి తింటున్నారా.? ఏం జ‌రుగుతుందో తెలిస్తే వెంట‌నే ఆపేస్తారు
Recommended image3
ట్యాబ్లెట్స్ కంటే ఇంజ‌క్ష‌న్‌తో త్వ‌ర‌గా రిలీఫ్ ఎందుకు వ‌స్తుంది? వెనుకున్న సైన్స్ ఏంటంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved