MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • ఆడవాళ్లు గురక ఎందుకు పెడతారో తెలుసా?

ఆడవాళ్లు గురక ఎందుకు పెడతారో తెలుసా?

ఆడవాళ్లకైనా మగవాళ్లకైనా గురక రావడం చాలా కామన్. కానీ ఆడవాళ్లకంటే మగవారే గురక ఎక్కువగా పెడతారు. అయితే మనం పడుకున్నప్పుడు ముక్కు లేదా గొంతు ద్వారా గాలి సరిగా వెళ్లనప్పుడు గురక వస్తుంది. ఆడవాళ్లు గురక పెట్టడానికి గల ప్రధాన కారణాల గురించి తెలుసుకుందాం పదండి.  అయితే, మహిళలు గురక పెట్టడానికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.. 

1 Min read
Author : Shivaleela Rajamoni
Published : Dec 05 2023, 02:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15


గురక చిన్న సమస్యే అయినా.. ఇది ఎంతో ఇబ్బందిని కలిగిస్తుంది. గురకపెడుతున్నట్టు పెట్టేవాళ్లకు తెలియదు. కానీ పక్కనున్న వాళ్లకు మాత్రం చాలా డిస్టబెన్స్ గా ఉంటుంది. గురక శబ్దం వల్ల పక్కనున్న వాళ్లు అస్సలు నిద్ర రాదు. అందుకే గురక పెట్టే వారి పక్కన పడుకోరు. అయితే గురక అనేది కేవలం ఇబ్బంది మాత్రమే కాదు.. ఇది ఎన్నో ఆరోగ్య సమస్యల లక్షణం కూడా అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

అలెర్జీ, జలుబు, అలెర్జీలు వంటి సమస్యలు మన వాయుమార్గాలకు అడ్డంకిని కలిగిస్తాయి.అందుకే ఈ సమస్యున్నవారికి గురక వస్తుంది. అయినప్పటికీ.. దీర్ఘకాలిక గురక పెద్ద అనారోగ్య సమస్యకు సంకేతమని నిపుణులు అంటున్నారు. గురక.. శ్వాస ఆడకపోవడం, నోరు, గొంతు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యల లక్షణం కావొచ్చంటున్నారు. మరి ఆడవాళ్లు గురక పెట్టడానికి ప్రధాన కారణాలేంటంటే?

35

గర్భధారణ సమయంలో మహిళలు బాగా బరువు పెరుగుతారు. అలాగే నాసికా కుహరంలోని రక్త నాళాలు విస్తరిస్తాయి. దీనివల్ల గురక వస్తుంది. అలాగే కండరాలు బాగా అలసిపోయినప్పుడు విశ్రాంతి చాలా చాలా అవసరం. స్వరపేటిక చాలా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు కూడా గురక వస్తుంది.
 

45

అధిక బరువు, మెడలో కొవ్వు పేరుకుపోవడం వల్ల కూడా గురక వస్తుందని నిపుణులు అంటున్నారు. ఈ అదనపు కొవ్వు వాయుమార్గాలను అడ్డుకుంటుంది. అలాగే గాలి ప్రవాహాన్నినిరోధిస్తుంది. దీనివల్ల గట్టిగా గురక వస్తుంది. 

55

మీ కండరాలు బాగా అలసిపోయినప్పుడు.. రిలాక్స్ కావడానికి ప్రయత్నిస్తాయి. ఇలాంటప్పుడు కూడా గురక వస్తుంది. అలాగే థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి తక్కువగా ఉన్నప్పుడు కూడా గురక వస్తుంది. దీనివల్ల గరగర, నెమ్మదిగా మాట్లాడటం, దడ వంటి సమస్యలు వస్తాయి. ఇవన్నీ గురకకు దారితీస్తాయి. 
 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Earbuds : వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ వాడుతున్నారా? అయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ వార్నింగ్ మీకే
Recommended image2
Constipation: మలబద్ధకం బాగా వేధిస్తోందా? రోజూ ఈ 3 అలవాట్లు పాటిస్తే మాయం
Recommended image3
Heartburn: ఇదొక్కటి తినడం తగ్గిస్తే చాలు..ఛాతీలో మంట కంట్రోల్ అవుతుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved