పాలిచ్చే తల్లులు బ్రా వేసుకోవచ్చా? లేదా?
పాలిచ్చే తల్లులు ఫుడ్ విషయంలోనే కాదు బట్టల విషయంలో కూడా ఎంతో కేరింగ్ గా ఉండాలి. ముఖ్యంగా మీరు బ్రా వేసుకుంటున్నట్టైతే ఎన్నో చిట్కాలను పాటించాల్సి ఉంటుంది.
డెలివరీ అయినా తర్వాత ఆడవారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. వీరి జీవనశైలి కూడా సాధారణ మహిళల కంటే భిన్నంగా ఉంటుంది. కాగా వీరు అడుగడుగునా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా బిడ్డకు ఆహారం ఇచ్చే విషయంలో వీళ్లు ఎంతో కేర్ ఫుల్ గా ఉండాలి. ఎందుకంటే బిడ్డకు ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంది. అందుకే వీళ్లు శారీరక పరిశుభ్రతను ఖచ్చితంగా పాటించాలి. అలాగే వేసుకునే దుస్తులపై కూడా శ్రద్ధ పెట్టాలని నిపుణులు అంటున్నారు. ప్రసవం తర్వాత గర్భిణులు ప్రసూతి దుస్తులు ధరించాలని గైనకాలజిస్టులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఇది పిల్లల పెంపకానికి ఎంతగానో సహాయపడుతుంది. అయితే చాలా మంది ప్రసవించిన తర్వాత ఖచ్చితంగా బ్రాను వేసుకుంటూ ఉంటారు. మరి వీళ్లు బ్రా విషయంలో ఎలాంటి తప్పులు చేయకూడదో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
బ్రా సెలెక్షన్
సాధారణంగా చాలా మంది ఆడవారు తల్లి పాలిచ్చేటప్పుడు ఫీడింగ్ బ్రాకు బదులుగా రోజూ బ్రా ధరించి బ్రాను వేసుకునే బిడ్డకు పాలిస్తుంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. నిజానికి బిడ్డ పుట్టిన తర్వాత ఫీడింగ్ బ్రా ను వేసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో మీ వక్షోజాలు పరిమాణం పెరుగుతుంది. ఇలాంటి సమయంలో మీరు పాత బ్రాను ఎక్కువసేపు ధరించడం ఒక రకమైన చికాకు కలుగుతుంది. ఎందుకంటే ఇవి చాలా టైటుగా అనిపిస్తాయి. అందుకే ఈ సమయంలో మీరు ఫీడింగ్ బ్రాను వేసుకుంటే కంఫర్ట్ గా అనిపిస్తుంది. అలాగే బిడ్డకు పాలిచ్చేటప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది కలగదు.
బ్రాను వేసుకోవచ్చా
నవజాత శిశువులు ప్రతి 20 నిమిషాలకోసారి పాలను తాగుతుంటారు. అందుకే చాలా మంది మహిళలు ఈ సమయంలో బ్రాలను వేసుకోవడానికి ఇష్టపడరు. కానీ బ్రాలను వేసుకోకపోతే వక్షోజాలు వేలాడినట్టుగా కనిపించే అవకాశం ఉంది. ఇది వెన్నునొప్పికి కూడా దారితీస్తుంది. అందుకే ఈ సమయంలో మీరు ఖచ్చితంగా బ్రా వేసుకోవాలి.
బ్రాను తరచూ మార్చడం
ప్రసవించిన తర్వాత పాలిచ్చే తల్లికి శారీరక పరిశుభ్రత చాలా చాలా ముఖ్యం. అందుకే వీళ్లు ఎక్కువ సేపు ఒకే బ్రాను వేసుకోకూడదు. దీన్ని మార్చకపోతే రొమ్ము ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియా పెరుగుదల, చనుమొన ప్రాంతంలో దుర్వాసన వంటి సమస్యలు వస్తాయి. అందుకే ప్రసవించిన మహిళలు రోజుకు కనీసం రెండుసార్లైనా బ్రా ను మార్చుకోవాలి.
సరైన సైజు బ్రా
ఇది కొంచెం కష్టమైన పనే. అయినా పాలిచ్చే తల్లులు మాత్రం దీన్ని ఖచ్చితంగా పాటించాలి. అందుకే ఫీడింగ్ బ్రా వేసుకోవాలని గైనకాలజిస్టులు సూచిస్తుంటారు. అలాగే మరీ టైట్ గా ఉండే బ్రాను వేసుకోకపోవడమే మంచిది. అలాగే పెద్ద సైజు బ్రాను వేసుకున్నా చికాకు పెడుతుంది.
కాటన్ బ్రా
నిజానికి బ్రాలో వివిధ పదార్థాలు ఉంటాయి. కానీ పాలిచ్చే మహిళలు మాత్రం కాటన్ మెటీరియల్ తో తయారుచేసిన బ్రా నే ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. అలాగే చికాకు నుంచి ఉపశమనం కలిగిస్తుంది.