MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • టీ, కాఫీ లో ఆరోగ్యానికి ఏది ఎక్కువ మంచిది?

టీ, కాఫీ లో ఆరోగ్యానికి ఏది ఎక్కువ మంచిది?

పొద్దు పొద్దేనే టీ, కాఫీలను తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఈ టీ, కాఫీలు మన నిద్రమత్తును వదిలిస్తాయి. శరీరాన్నిచురుగ్గా ఉంచుతాయి. ఈ రెండింటి వల్ల చెడే కాక మంచి కూడా జరుగుతుంది. మరి ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి ఎక్కువ మంచిదంటే?  

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Dec 10 2023, 07:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
టీ

టీ

టీ, కాఫీల ప్రియలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. ఈ రెండు డ్రింక్స్ ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్. కొందరికి కాఫీ నచ్చితే మరికొంతమందికి టీనే నచ్చుతుంది. కానీ ఆరోగ్య పరంగా ఈ రెండింటిలో ఏది మంచిది. ఆరోగ్య నిపుణులు ఏం చెప్తున్నారంటే?

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

కాఫీ శక్తిని తాగితే తక్షణ ఎనర్జీ వస్తుంది. ఇది మన ఏకాగ్రతను కూడా పెంచుతుంది. కేంద్ర నాడీ వ్యవస్థను ఉత్తేజపరిచే కెఫిన్ కంటెంట్ యే ఇందుకు ప్రధాన కారణం. లిమిట్ లో కెఫిన్ ను తీసుకోవడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. అభిజ్ఞా పనితీరు బాగుంటుందని ఎన్నో అధ్యయనాలు వెల్లడించాయి. 

37
Filter Coffee

Filter Coffee

కాఫీ లో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ సమ్మేళనాలు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి మన కణాలను రక్షించడానికి సహాయపడతాయి. ఇది క్యాన్సర్, గుండె జబ్బులు, అల్జీమర్స్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. అయినప్పటికీ కెఫిన్ ను ఎక్కువగా తీసుకుంటే యాంగ్జైటీ, చంచలత, నిద్రలేమి వంటి ఎన్నో సమస్యలు వస్తాయి. ఇది కొంతమందిలో కాఫీ హృదయ స్పందన రేటును పెంచుతుంది. రక్తపోటు పెరగడానికి కూడా కారణమవుతుంది. 

47
టీ

టీ

టీ

టీని ఎన్నో ఏండ్ల నుంచి తాగుతున్నారు. టీ.. నీళ్ల తర్వాత ప్రపంచంలో రెండో అత్యంత ప్రాచుర్యం పొందిన పానీయం. నిజానికి టీ ఎన్నో రుచుల్లో లభిస్తుంది. అందుకే దీన్ని చాలా మంది తాగుతారు. టీ ఆరోగ్యకరమైన పానీయంగా కూడా ఖ్యాతి పొందింది.  ఎందుకంటే టీ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. 
 

57

కాఫీ మాదిరిగానే టీలో ఉండే పాలీఫెనాల్స్ కూడా శోథ నిరోధక, క్యాన్సర్ నిరోధక ప్రభావాలను కలిగి ఉన్నాయని నిరూపించబడింది. ఈ యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంతో పాటుగా ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. 

టీ వల్ల కలిగే మరొక ప్రయోజనం ఏంటంటే? దీనిలో కెఫిన్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. అలాగే టీలో థయామిన్ అనే అమైనో ఆమ్లం కూడా ఉంటుంది. ఇది శాంతపరిచే ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అలాగే టీ ఒత్తిడిని, ఆందోళనను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.

67

టీలో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే లక్షణాలు కూడా ఉంటాయి. టీ తాగడం వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్, అధిక రక్తపోటు ప్రమాదం తగ్గుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. టీలో ఫ్లేవనాయిడ్లు ఉండటం వల్ల రక్త నాళాల పనితీరు మెరుగుపడుతుంది. అలాగే  శరీర మంట కూడా తగ్గుతుంది. 
 

77
టీ

టీ

ఏది ఆరోగ్యకరమైంది? 

కాఫీ, టీ రెండూ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. అయినప్పటికీ ఈ రెండింటినీ ఎక్కువగా తాగితే మీరు ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఫైనల్ గా ఇది వ్యక్తిగత ప్రాధాన్యతకు సంబంధించింది. ఏది తాగినా లిమిట్ లో తాగితే ప్రయోజనాలను పొందుతారు. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Ice Apple: తాటి ముంజల్లో ఇన్ని పోషకాలా? తెలిస్తే బుట్టలు బుట్టలు కొంటారు
Recommended image2
Coriander Benefits: రోజులో ఒక్కసారి కొత్తిమీర వాటర్ తాగితే షుగర్ కంట్రోల్ అవ్వడం పక్కా
Recommended image3
Tea: టీ చేయడానికి ఏ గిన్నె బెటర్?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved