సమ్మర్ స్పెషల్.. చాకో స్ట్రాబెర్రీ మిల్క్ షేక్, రోజ్ మిల్క్ ఎలా చెయ్యాలంటే?
వేసవి కాలంలో శరీరానికి చల్లదనాన్ని అందించే ద్రవపదార్థాలను తీసుకోవడం తప్పనిసరి. ఇవి శరీరానికి చల్లదనాన్ని అందించి అధిక ఎండ తీవ్రత నుండి శరీరాన్ని కాపాడుతాయి.

ఈ వేసవిలో చాకో స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ (Chaco Strawberry Milkshake), రోజ్ మిల్క్ (Rose Milk) లను ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు మనం వీటి తయారీ విధానం గురించి తెలుసుకుందాం..
చాకో స్ట్రాబెర్రీ మిల్క్ షేక్:
కావలసిన పదార్థాలు: ఒక కప్పు స్ట్రాబెర్రీలు (Strawberries), ఒకటిన్నర కప్పు పాలు (Milk), రెండు టేబుల్ స్పూన్ ల తేనె (Honey), సగం స్పూన్ వెనిలా ఎసెన్స్ (Vanilla Essence), సగం కప్పు చాక్లెట్ చిప్స్ (Chocolate chips), నాలుగు టేబుల్ స్పూన్ ల స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ (Strawberry ice cream), రెండు స్పూన్ ల చాక్లెట్ సాస్ (Chocolate sauce), కొద్దిగా గిలకొట్టిన క్రీం (Scrambled cream).
తయారీ విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో స్ట్రాబెరీ ముక్కలు, తేనె, పాలు, వెనిలా ఎసెన్స్, చాక్లెట్ సాస్ వేసి మెత్తగా గ్రైండ్ (Grind finely) చేసుకోవాలి. ఇప్పుడు రెండు గ్లాసులు తీసుకొని అందులో సమాన భాగాలుగా ఐస్ క్రీమ్ (Ice cream) వేసి దానిపైన మెత్తగా గ్రైండ్ చేసుకున్నా స్ట్రాబెరీ మిశ్రమాన్ని పోయాలి.
ఇప్పుడు దీనిమీద గిలకొట్టిన క్రీం, చాక్లెట్ చిప్స్ ఒకదాని తరువాత మరొకటి వేసి గార్నిష్ (Garnish) చేసుకోవాలి. అంటే ఎంతో టేస్టీ చాకో స్ట్రాబెరీ మిల్క్ షేక్ రెడీ. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ మిల్క్ షేక్ ను ట్రై చేయండి. ఈ మిల్క్ షేక్ శరీరానికి శక్తిని అందించే మంచి ఎనర్జీ డ్రింక్ (Energy Drink) గా సహాయపడుతుంది.
రోజ్ మిల్క్:
కావలసిన పదార్థాలు: అర లీటరు పాలు (Milk), ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ (Rose water), రెండు టేబుల్ స్పూన్ ల పంచదార (Sugar), పావు కప్పు రోజ్ సిరప్ (Rose syrup), నాలుగు ఐస్ ముక్కలు (Ice cubes), రెండు టేబుల్ స్పూన్ ల నానబెట్టుకున్న సబ్జా గింజలు (Soaked sabza nuts).
తయారీ విధానం: ఒక మూత ఉన్న జార్ తీసుకొని అందులో అర లీటరు కాచి చల్లార్చి ఫ్రిజ్ లో పెట్టిన చల్లటి పాలు, రోజ్ వాటర్, పంచదార, రోజ్ సిరప్, ఐస్ ముక్కలు, నానబెట్టుకున్న సబ్జా గింజలు వేసి మూత పెట్టి బాగా బ్లెండ్ (Blend well) చేయాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న జ్యూస్ ను ఒక గ్లాస్ లో వేసి సర్వ్ (Serve) చేయండి.
అంతే చల్లచల్లని రోజ్ మిల్క్ షేక్ రెడీ (Ready). ఈ జ్యూస్ వేసవి కాలంలో ఎండ తీవ్రత కారణంగా శరీరానికి కలిగే డీహైడ్రేషన్ (Dehydration) ను తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే శరీర వేడిని తగ్గించి చల్లదనాన్ని అందిస్తుంది. కనుక వేసవిలో రోజ్ మిల్క్ షేక్ ను ట్రై చేయండి.