చెట్టినాడు చికెన్ గ్రేవీ రెసిపీ.. ఒక్కసారి తిన్నారంటే ఆహా అనాల్సిందే!
చాలామంది మాంసాహారులు చికెన్ తినడానికి ఇష్టపడతారు. ఈసారి కొత్తగా చెట్టినాడు చికెన్ ను వండేయండి. ఈ చెట్టినాడు చికెన్ గ్రేవీ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీ తయారీ విధానం గురించి తెలుసుకుందాం..

Chettinadu chicken gravy
కావలసిన పదార్థాలు: అరకేజీ చికెన్ (Chicken), రెండు పచ్చిమిరపకాయలు (Chilies), సగం కప్పు పెరుగు (Yogurt), ఒక టేబుల్ స్పూన్ అల్లంవెల్లుల్లి తరుగు (Chopped Gingergarlic), ఒక స్పూన్ పసుపు (Turmeric) ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం (Lemon juice), రుచికి సరిపడా ఉప్పు (Salt).
Chettinadu chicken gravy
గ్రేవీ తయారీ కోసం: రెండు ఉల్లిపాయలు (Onions), రెండు టమోటాలు (Tomatoes), పావుకప్పు నూనె (Oil), కొన్ని కరివేపాకు రెబ్బలు (Curries), రెండు టేబుల్ స్పూన్ ల అల్లంవెల్లుల్లి పేస్ట్ (Ginger garlic paste).
Chettinadu chicken gravy
మసాలా తయారీ కోసం: మూడు ఎండు మిరపకాయలు (Dried chillies), రెండు టేబుల్ స్పూన్ ల ధనియాలు (Coriander), ఒక స్పూన్ జీలకర్ర (Cumin), ఒక అంగుళం దాల్చిన చెక్క (Cinnamon) ముక్క, రెండు స్పూన్ ల మిరియాలు (Pepper), అనాసపువ్వు (Anasapuvvu) ఒకటి, మూడు యాలకలు (Cardamom), నాలుగు లవంగాలు (Cloves), ఒక స్పూన్ సోంపు (Anise), పావు కప్పు తాజా కొబ్బరి తురుము (Coconut grater), ఒక కట్ట కొత్తిమీర (Coriyander) తరుగు.
Chettinadu chicken gravy
తయారీ విధానం: ముందుగా ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో అల్లంవెల్లుల్లి తరుగు, పచ్చిమిరపకాయలు వేసి మెత్తగా గ్రైండ్ (Grind finely) చేసుకొని ఒక గిన్నెలో తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో పసుపు, పెరుగు, నిమ్మరసం, చికెన్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి (Mix well).
Chettinadu chicken gravy
ఇలా కలుపుకున్న చికెన్ ను అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర, దాల్చిన చెక్క, మిరియాలు, అనాసపువ్వు, యాలకులు, లవంగాలు, సోంపు, తాజా కొబ్బరి తురుము, కొత్తిమీర ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసి నూనె లేకుండా (Without oil) వేయించుకొని (Frying) మెత్తగా పొడి చేసుకోవాలి.
Chettinadu chicken gravy
ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసి వేగిన తరువాత అల్లంవెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తరువాత టమోటో ముక్కలు వేసి రెండు నిమిషాల పాటు వేయించాలి. తర్వాత ఇందులో అరగంట పాటు నానపెట్టుకున్న చికెన్ (Soaked chicken) ముక్కలు, కొన్ని నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు (Salt) వేసి మెత్తగా ఉడికించుకోవాలి.
Chettinadu chicken gravy
ఇలా ఉడికించుకున్న చికెన్ లో ముందుగా తయారు చేసుకున్న మసాలా కూడా వేసి బాగా కలిపి పదిహేను నిమిషాలపాటు ఉడికించుకోవాలి. చికెన్ బాగా ఉడికిన తరువాత చివరిలో కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసి దింపేయాలి. అంతే ఎంతో రుచికరమైన (Delicious) నోరూరించే చెట్టినాడు చికెన్ రెడీ (Ready).