పిల్లలకు వచ్చే క్యాన్సర్ రకాలు, వాటి లక్షణాలు ఇవే!
క్యాన్సర్ వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారికీ వస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. ప్రతియేటా క్యాన్సర్ బాధితుల్లో 5% మంది పిల్లలు ఉన్నట్లు తేలింది.

Childhood cancer
14 ఏళ్ల లోపు వచ్చే క్యాన్సర్ ను చైల్డ్ హుడ్ క్యాన్సర్ (Childhood cancer) అని అంటారు. పిల్లల్లో క్యాన్సర్ ను ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. అప్పుడే త్వరగా చికిత్స (Treatment) అందించి నయం చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు. కనుక ఇప్పుడు మనం క్యాన్సర్ రకాలు, వాటి లక్షణాలు గురించి తెలుసుకుందాం..
Childhood cancer
పుట్టుకతోనే జన్యువుల (Genes) పనితీరు అస్తవ్యస్తం కావడం, వంశపారపర్యంగా పిల్లలు క్యాన్సర్ బారినపడే అవకాశం ఉంటుంది. అసలు ఎలాంటి కారణాలు లేకపోయినా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందట. అయితే పిల్లల్లో తలెత్తే క్యాన్సర్ (Cancer) లను పూర్తిగా నయంచేయవచ్చు. పిల్లలకు చికిత్స చేయడం కూడా సులభం అని వైద్యులు అంటున్నారు.
Childhood cancer
పిల్లలలో ఏర్పడే క్యాన్సర్ లను ఎంత త్వరగా గుర్తిస్తే ఆ క్యాన్సర్ రకాన్ని (Type of cancer) బట్టి వైద్యులు చికిత్స అందిస్తారు. పిల్లలకు క్యాన్సర్ వచ్చినప్పుడు వెంటనే గుర్తించి మనం ధైర్యంగా ఉంటూ పిల్లల్లో ధైర్యం నింపితే పిల్లలు క్యాన్సర్ నుండి త్వరగా కోలుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పిల్లలలో ఏర్పడే క్యాన్సర్ పెద్దలకు వచ్చే క్యాన్సర్ మాదిరిగా ప్రమాదకరమైనది కాదు (Not dangerous).
Childhood cancer
నాడీకణాల క్యాన్సర్: నాడీకణాల క్యాన్సర్ (Neuronal cancer) లో కణితి పెద్దగా అయ్యేంతవరకు లక్షణాలేవీ కనిపించవు. కణితి పెద్దగా అవుతున్నకొద్దీ కడుపులో నొప్పి (Abdominal pain) ఏర్పడుతుంది. స్నానం చేస్తున్నప్పుడు చేతికి కణితి తగులుతుంటుంది.
Childhood cancer
కంటి క్యాన్సర్: కంటి క్యాన్సర్ (Eye cancer) ను ఫోటోలతో సులభంగా గుర్తించవచ్చు. ఫోటో (Photo) తీసే సమయంలో కంటిలో తెల్లగా ఫ్లాష్ లాగా మెరిసినట్టు కనిపిస్తే అది కంటి క్యాన్సర్ లక్షణంగా భావిస్తారు.
Childhood cancer
ఎముక క్యాన్సర్: ఎముక క్యాన్సర్ (Bone cancer) ఏర్పడినప్పుడు కాళ్ల మీద గానీ, చేతుల మీద ఉబ్బు కనిపిస్తుంది. గాయం కాకపోయినా అకారణంగా ఉబ్బినట్టు కనిపిస్తే నిర్లక్ష్యం (Neglected) చేయ్యకుండా డాక్టర్ ను సంప్రదించడం మంచిది.
Childhood cancer
కండర క్యాన్సర్: కండర క్యాన్సర్ (Muscle cancer) తల, మెడ, కడుపు, గజ్జలు, చేతులు, కాళ్లు ఇలా ఒంట్లో ఏ భాగానికైనా రావచ్చు. ఇలా శరీరంలో ఏ భాగంలోనైనా వాపు, లింప్ గ్రంథులు (Lymph nodes) ఉండటం ప్రధానంగా ఈ క్యాన్సర్ లక్షణం.
Childhood cancer
మెదడు క్యాన్సర్: మెదడు క్యాన్సర్ (Brain cancer) లో తలనొప్పి, చూపు మసకబారడం, ప్రతిరోజూ వాంతి కావడం, మూర్ఛ (Epilepsy), నడుస్తుంటే తడబడడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలను గుర్తించి డాక్టర్ ను సంప్రదించడం మంచిది.
Childhood cancer
రక్త క్యాన్సర్: రక్త క్యాన్సర్ (Leukemia) లో బలహీనత (Weakness), నిస్సత్తువ, బరువు తగ్గడం, చర్మం, కాళ్లు పాలిపోయి ఉండడం, త్వరగా అలసిపోవడం, ఆయాసం, గాయాలు అయినప్పుడు రక్తం ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
Childhood cancer
లింప్ క్యాన్సర్: లింప్ క్యాన్సర్ (Lymph cancer) లో జ్వరం, బరువు తగ్గడం (Weight loss), చంక, మెడ, గజ్జల్లొ లింప్ గ్రంధుల వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ ను సంప్రదించి చికిత్స తీసుకోవడం మంచిది.
Childhood cancer
కిడ్నీ క్యాన్సర్: కిడ్నీ క్యాన్సర్ (Kidney cancer) లో జ్వరం, ఆకలి తగ్గడం (Decreased appetite), వాంతి వంటి లక్షణాలు కనిపిస్తాయి. స్నానం చేస్తున్నప్పుడు ఒళ్లు నిమురుతున్నప్పుడు కడుపు మీద కణిత లాంటివి చేతికి తగులుతుంటాయి.