డయాబెటీస్ ఉన్నవాళ్లు పాలు తాగితే ఏమౌతుందో తెలుసా?
నిజానికి పాలు మన ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి. రోజూ పాలు తాగితే ఆరోగ్యానికి ఏ డోకా ఉండదంటారు ఆరోగ్య నిపుణులు. కానీ పాలను డయాబెటీస్ ఫేషెంట్లు తాగొచ్చా? తాగితే ఏమౌతుంది?
షుగర్ ఉన్నవాళ్లు పాలు తాగొచ్చా?
ప్రస్తుత కాలంలో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ డయాబెటీస్ బారిన పడుతున్నారు.ఈ షుగర్ వ్యాధి ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవాలి.
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. వీరు ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారాన్ని తీసుకోవడంతో పాటుగా మంచి అలవాట్లను అలవర్చుకోవాలి. జీవనశైలిలో అవసరమైన మార్పులు చేసుకోవాలి.
బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగకూడదంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా, కొవ్వు తక్కువగా ఉండే సమతుల్య ఆహారాన్ని తినాలని డాక్టర్లు చెబుతున్నారు. మరి షుగర్ ఉన్నవారు పాలు తాగొచ్చా? అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. ఈ విషయంలో నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
షుగర్ ఉన్నవాళ్లు పాలు తాగొచ్చా?
పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ రోజూ పాలు తాగుతుంటారు. పాలలో ప్రోటీన్లు, విటమిన్ డి, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పాలు ఎముకలను బలంగా చేయడానికి, ఎముకల వ్యాధులు రాకుండా చేయడానికి సహాయపడతాయి. అయితే పాలలో ఉండే కొవ్వులు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయని నమ్ముతారు.
డయాబెటీస్ ఉన్నవారి రక్తంలో అధిక కొవ్వు లేదా ట్రైగ్లిజరైడ్స్ ఉండొచ్చు. డాక్టర్ల అభిప్రాయం ప్రకారం.. ఈ కొవ్వులు ఎక్కువగా ఉంటే మీకు గుండెజబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే మీరు మీ ఆహారంలో కొన్ని రకాల సంతృప్త కొవ్వులను, ట్రాన్స్ ఫ్యాట్స్ ను తీసుకోకూడదు. కొన్ని అధ్యయనాల ప్రకారం.. పాలలోని కొవ్వు గుండె జబ్బులతో సంబంధం కలిగి ఉంటుంది.
షుగర్ ఉన్నవాళ్లు పాలు తాగొచ్చా?
షుగర్ ఉన్నవారి ఎముకలు చాలా బలహీనంగా ఉంటాయి. అందుకే వీరికి ఎముకలు విరిగిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్లు కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. అప్పుడే ఎముకలు బలంగా అవుతాయి. ఇందుకోసం వీళ్లు కూడా పాలను రోజూ తాగొచ్చు.
ప్రోటీన్ పాత్ర
షుగర్ ఉన్నవాళ్లకు ప్రోటీన్ చాలా చాలా అవసరం. ఎందుకంటే ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ ను నియంత్రించడానికి సహాయపడుతుంది. మంచి నాణ్యతతో ప్రోటీన్లు పుష్కలంగా ఉన్న పాలలో తొమ్మిది ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఈ ప్రోటీన్లు కార్బోహైడ్రేట్ల శోషణను నెమ్మదింపజేస్తాయి, దీనివల్ల భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు స్లోగా పెరుగుతాయి.
షుగర్ ఉన్నవాళ్లు పాలు తాగొచ్చా?
భోజనం లేదా హెల్తీ స్నాక్స్ లో పాలను చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది ఆరోగ్యకరమైన స్నాక్స్ ను తక్కువగా తినేలా చేస్తుంది. అంటే ఇది మీరు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ముఖ్యంగా ఇది మీ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేయడానికి బాగా సహాయపడుతుంది.
డయాబెటీస్ ఉన్నవారు పాలను ఎలా తాగాలి.
మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేయడానికి మీ రోజువారి ఆహారంలో కాల్షియం ఎక్కువగా ఉండే పాలను చేర్చుకోవడం ముఖ్యం.అయితే కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండే పాలను తాగడం మంచిది.
షుగర్ ఉన్నవాళ్లు పాలు తాగొచ్చా?
మీకు తెలుసా? పాలలో సంతృప్త కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఇది మీకు గుండె జబ్బులొచ్చేలా చేస్తుంది. కాబట్టి తక్కువ కొవ్వు లేదా కొవ్వు లేని పాలను తాగడం మంచిది. .
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పాలతో పాటుగా పాల ఉత్పత్తులను తక్కువ మొత్తంలో తీసుకోవాలి. రోజుకు ఒక కప్పు పాలను తాగితే సరిపోతుంది. అలాగే మీరు కార్బోహైడ్రేట్ శోషణను మరింత నెమ్మది చేయడానికి ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారాలను తినడం మంచిది.