బ్రెస్ట్ మసాజ్ వల్ల ఎన్ని లాభాలో..
బ్రెస్ట్ మసాజ్ ఖచ్చితంగా ప్రయత్నించాల్సిన విషయం. ఎందుకంటే దీనివల్ల ఆడవారికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

చాలా మంది భుజాలు, వీపు, చేతులు, కాళ్లను మాత్రమే మసాజ్ చేయించుకుంటారు. వీటితో పాటుగా వక్షోజాలను మసాజ్ చేసుకున్నా ఎన్నో ప్రయోజనాలను పొందుతారని నిపుణులు అంటున్నారు. అయితే కొంతమంది అవి చాలా సున్నితమైనవని భావిస్తారు. కొంతమంది ఇది రొమ్ము క్యాన్సర్ ను గుర్తించడానికి ఇది ఒక మార్గమని కూడా అనుకుంటారు. అసలు బ్రెస్ట్ మసాజ్ వల్ల ఎలాంటి లాభాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
రొమ్ము మసాజ్ ప్రయోజనాలు
క్రమం తప్పకుండా రొమ్ము మసాజ్ చేయడం.. రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని నివారించడానికి లేదా తగ్గించడానికి సహాయపడుతుందని కొంతమంది నమ్ముతారు. అయితే ఈ వాదనకు మద్దతునివ్వడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. కానీ రొమ్ము మసాజ్ వల్ల కొన్ని ప్రయోజనాలైతే ఉన్నాయి.
రొమ్ము సున్నితత్వాన్ని తగ్గించడానికి..
బ్రెస్ట్ మసాజ్ రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. ఇది రొమ్ము సున్నితత్వం, నొప్పి, వాపును తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడుతుంది. అలాగే ఒత్తిడి నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.
breast
మెరుగైన వక్షోజాలు..
కొంతమంది మహిళలు తమ రొమ్ములు మెరుగ్గా కనిపించాలని బ్రెస్ట్ మసాజ్ చేస్తుంటారు. రొమ్ములు బిగుతుగా ఉండటానికి, స్థితిస్థాపకత, చర్మ దృఢత్వాన్ని మెరుగుపరచడానికి సహాయపడటానికి ఆలివ్ ఆయిల్ ను ఉపయోగిస్తారు.
పాలిచ్చే తల్లులకు రొమ్ము మసాజ్ ప్రయోజనకరంగా ఉంటుంది
పాలిచ్చే మహిళలకు రొమ్ము మసాజ్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది పాల ప్రవాహాన్ని మెరుగుపరచడానికి, రొమ్ము వాపు నుంచి ఉపశమనం పొందడానికి సహాయపడుతుంది. జర్నల్ ఆఫ్ పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంటరాలజీ అండ్ న్యూట్రిషన్ ప్రచురించిన 2004 అధ్యయనం ప్రకారం.. రొమ్ము మసాజ్ తల్లి పాల నాణ్యతను పెంచడానికి సహాయపడిందని పరిశోధకులు కనుగొన్నారు.
జర్నల్ ఆఫ్ కొరియన్ అకాడమీ ఆఫ్ నర్సింగ్ లో 2011 లో మరొక అధ్యయనంలో.. కొత్తగా తల్లి అయిన పాలిచ్చే తల్లులకు రొమ్ము మసాజ్ రొమ్ముల నొప్పిని తగ్గిస్తుందని కనుగొన్నారు. అయితే పాలిచ్చే తల్లులు వక్షోజాలపై ఎక్కువ ఒత్తిడి పెట్టకుండా ఉండాలి.
breast
బ్రెస్ట్ మసాజ్ ను ఎవరు నివారించాలి?
బ్రెస్ట్ మసాజ్ వల్ల ఎన్నో ప్రయోజనాలు కలిగినప్పటికీ.. కొంతమంది దీనికి దూరంగా ఉండాలి. ఎవరెవరంటే?
రొమ్ము క్యాన్సర్ నుంచి కోలుకున్న మహిళలు బ్రెస్ట్ మసాజ్ ను ప్రయత్నించే ముందు డాక్టర్ తో మాట్లాడాలి. ఎందుకంటే ఇది వారి ఆరోగ్యానికి మంచిది కాకపోవచ్చు. ఫైబ్రోసిస్టిక్ రొమ్ములు లేదా రొమ్ము ఇంప్లాంట్లు వంటి సమస్యలున్న వారు కొన్నిబ్రెస్ట్ మసాజ్ ను నివారించాలి. గర్భిణులు లేదా రొమ్ము క్యాన్సర్ చరిత్ర ఉన్న మహిళలు కూడా జాగ్రత్తగా ఉండాలి. బ్రెస్ట్ మసాజ్ ప్రయత్నించే ముందు డాక్టర్ తో ఖచ్చితంగా మాట్లాడాలి. మసాజ్ సమయంలో లేదా తర్వాత మీ రొమ్ములలో ఏదైనా నొప్పి, అసౌకర్యం లేదా మార్పులు కనిపిస్తే వెంటనే హాస్పటల్ కు వెళ్లండి.