మధ్యాహ్నం భోజనం చేసిన వెంటనే నిద్ర వస్తుందా.. నిద్ర రాకూడదంటే ఇలా చేయాల్సిందే!
సాధారణంగా కొంతమంది పగటిపూట భోజనం చేసిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా నిద్రపోతారు.ఇలా భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం ఆరోగ్యానికి హానికరం అనే విషయం తెలిసినప్పటికీ చాలామంది భోజనం ప్లేట్ పక్కనపెట్టి వెంటనే నిద్రపోతారు ఇక ఆఫీస్ లో ఉన్న వారు సైతం ఇదే అనుభూతిని పొందుతారు.అయితే ఇలా భోజనం చేసిన వెంటనే నిద్ర రావడానికి గల కారణం ఏమిటి నిద్ర రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే విషయానికి వస్తే..

మధ్యాహ్న సమయంలో మనం ఎక్కువగా బియ్యంతో తయారుచేసిన ఆహారాన్ని తీసుకుంటాము.అయితే మనం ఎక్కువ శాతం అన్నం తీసుకొని తక్కువ శాతం లో కూరగాయలు తీసుకోవడం అలవాటుగా ఉంటుంది ఈ క్రమంలోనే బియ్యంలో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్ల వల్ల మనకు పగటిపూట నిద్రపోవాలని భావన కలుగుతుంది ఈ కార్బోహైడ్రేట్ల కారణంగానే తిన్న వెంటనే నిద్ర వచ్చే అనుభూతి కలుగుతుంది.
మనం భోజనం చేసిన వెంటనే మన ఆహారంలో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్లో గ్లూకోజ్ గా మారుతాయి. గ్లూకోస్ కి ఇన్సులిన్ ఎంతో అవసరం ఇలా ఇన్సులిన్ స్థాయి పెరిగిన తర్వాత ట్రిప్టోఫాన్ యొక్క అవసరమైన కొవ్వు ఆమ్లాలు రావడానికి మెదడు ప్రేరణ కలిగిస్తుంది.ఈ ప్రక్రియ ద్వారా మన శరీరంలో మెలటోనిన్, సెరటోనిన్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇలా ఎప్పుడైతే మెలటోనిన్ పెరుగుతాయో ఆ సమయంలో కొన్ని హార్మోన్లు విడుదలవుతాయి.
ఈ విధంగా విడుదలైన హార్మోన్ల కారణంగా నాడీ వ్యవస్థ ప్రతిస్పందన మన శరీరాన్ని నెమ్మదిస్తుంది. తద్వారా మనకు నిద్ర రావడం జరుగుతుంది. అలాగే నిద్రపోవాలనే భావన కూడా కలుగుతుంది.అయితే ఇలా పగటి పూట భోజనం చేసిన వెంటనే నిద్ర రాకుండా ఉండాలంటే మనం తీసుకొని ఆహారంలో కార్బోహైడ్ల పరిమాణం తక్కువ స్థాయిలో ఉండాలి. మనం తీసుకునే ఆహారంలో 50% కూరగాయలు, 25% ప్రోటీన్లు 25% పిండి పదార్థాలు ఉండేలా చూసుకోవాలి.
ఇలా మనం తినే ఆహారంలో ఎప్పుడైతే కార్బోహైడ్రేడ్ల పరిమాణం తక్కువ స్థాయిలో ఉంటుందో ఆ సమయంలో మన శరీరంలో అవయవాల వ్యవస్థ పనితీరు సక్రమంగా ఉంటుంది. తద్వారా మనకు నిద్ర అనే భావన కూడా కలగదు. అదేవిధంగా మనం రోజులో ఆహారాన్ని ఒకేసారి ఎక్కువ మొత్తంలో తీసుకోకూడదు.ఎక్కువసార్లు తక్కువ పరిమాణంలో ఆహారం తీసుకోవడం వల్ల మన శరీరంలోని అవయవాల పనితీరు కూడా మెరుగ్గా ఉంటుంది. అలాగే నిద్రను ప్రేరేపించే హార్మోన్లను కూడా ఉత్పత్తి చేయదు.