జుట్టు రాలకుండా ఉండాలంటే బయోటిన్ తప్పనిసరి..?
కాలుష్యం, తీసుకునే ఆహారంలో పోషకాల లోపాలు, హెయిర్ ప్రొడక్ట్స్ లలోని రసాయనాలు (Chemicals in hair products) ఇలా ఇతర కారణాలతో జుట్టు అధికంగా రాలిపోతుంది. దీంతో చాలామంది బయోటిన్ ను తీసుకుంటున్నారు.

విటమిన్ బి7 గా పిలిచే దీన్ని వైద్యులు జుట్టు రాలకుండా (Hair Loss) ఉండడానికి సూచిస్తున్నారు. దీనికోసం డబ్బు వృధా చేయకుండా రోజు వారి ఆహారంలో కొన్నింటిని చేసుకుంటే జుట్టుకు కావలసిన బయోటిన్ సమృద్ధిగా లభిస్తుంది. మరి తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
గుడ్డు: గుడ్డు పచ్చసొనలో (Egg yolk) బయోటిన్ (Biotin) ఎక్కువ మోతాదులో ఉంటుంది. కనుక రోజుకో గుడ్డును ఆహారంలో తీసుకుంటే ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు జుట్టుకు కావలసిన బయోటిన్ సమృద్ధిగా లభిస్తుంది. దీంతో జుట్టు రాలకుండా ఒత్తుగా, బలంగా పెరుగుతుంది.
తృణధాన్యాలు: తృణధాన్యాలను (Cereals) తీసుకుంటే బరువు తగ్గడంతో పాటు శరీరానికి కావాల్సిన విటమిన్ బి7 (Vitamin B7) సమృద్ధిగా లభిస్తుంది. వీటితో అదనంగా శరీరానికి కావలసిన అమైనో ఆమ్లాలు కూడా లభిస్తాయి. దీంతో జుట్టు ఆరోగ్యం మెరుగుపడి జుట్టు రాలకుండా ఉంటుంది.
చిలగడదుంప: చిలగడదుంప (Sweet potato) జుట్టు రాలకుండా ఉండడానికి సహాయపడుతుంది. అరకప్పు ఉడికించిన చిలగడ దుంపలో 2.4 మైక్రో గ్రాముల బయోటిన్ ఉంటుంది. ఇది జుట్టు కుదుళ్లను (Hair follicles) బలపరిచి జుట్టు రాలిపోకుండా సహాయపడుతుంది.
డ్రై ఫ్రూట్స్: డ్రై ఫ్రూట్స్ (Dry Fruits) లను తీసుకుంటే జుట్టు పెరుగుదలకు కావలసిన బయోటిన్ పుష్కలంగా లభిస్తుంది. కనుక వాల్ నట్స్, పల్లీలు, బాదంలను కలిపి రోజుకు తీసుకుంటే చాలు. ఇవి జుట్టు సమస్యలను (Hair problems) దూరం చేసి జుట్టు రాలకుండా సహాయపడుతాయి.
పుట్టగొడుగులు: పుట్టగొడుగులలో (Mushrooms) పోషకాలు అధిక మోతాదులో ఉంటాయి. ఇవి జుట్టుకు కావలసిన ప్రోటీన్ లను అందించి జుట్టు ఆరోగ్యాన్ని (Hair health) మెరుగుపరుస్తాయి. దీంతో జుట్టు కుదుళ్లు బలపడి జుట్టు రాలకుండా ఉంటుంది.
అరటిపండు: అరటిపండులో (Banana) బయోటిన్ శాతం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇందులో అదనంగా పీచు, సూక్ష్మ పోషకాలు, విటమిన్లు (Vitamins), కాపర, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. దీంతో జుట్టు రాలకుండా ఉంటుంది.
ఆకుకూరలు: ఆకుకూరలను తీసుకుంటే కురులు బాగా పెరుగుతాయి. ముఖ్యంగా పాలకూరను (Lettuce) ఎక్కువగా తీసుకుంటే శరీరానికి అవసరమైన శక్తి (Energy) అందుతుంది. ఇది జుట్టు పెరగడానికి సహాయపడి జుట్టు రాలిపోకుండా చేస్తుంది. కనుక ప్రతిరోజూ తీసుకొనే ఆహారంలో ఆకుకూరలను భాగంగా చేసుకోవాలి.
పాలు: పాలలో (Milk) కూడా ప్రోటీన్లు అధికంగా వుంటాయి. ఇందులో ఉండే పోషకాలు (Nutrients) శరీరానికి కావలసిన శక్తిని అందించి జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. జుట్టుకు సంబంధించిన అన్ని సమస్యలు తగ్గి జుట్టు రాలకుండా ఉంటుంది. కనుక ప్రతిరోజూ ఒక గ్లాసు పాలు తీసుకోవడం జుట్టు ఆరోగ్యానికి మంచిది.