కుంకుడు కాయతో ఇలా చేస్తే వతైన పొడువు జుట్టు మీ సొంతం!
జుట్టు ఆరోగ్యంగా, అందంగా, పొడవుగా ఉండాలని అందరూ కోరుకుంటారు. దీని కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. అయితే కుంకుడు కాయలు (Kunkudukaya) జుట్టు సంరక్షణకు (Hair care) చక్కగా పనిచేస్తాయి. కుంకుడు కాయలో విటమిన్లు ఎ, డి పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లకు తగిన బలాన్ని అందించి జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడతాయి. ఇప్పుడు ఈ ఆర్టికల్ లో కుంకుడు కాయలతో తలంటు స్నానం చేస్తే జుట్టుకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం..
జుట్టు సంరక్షణ కోసం ఖరీదైన షాంపూలను, కండిషనర్ లను వాడుతుంటారు. ఈ విధంగా మార్కెట్లో దొరికే వివిధ రకాల షాంపూలను (Shampoos) వాడడంతో జుట్టు సమస్యలు (Hair problems) ఎక్కువ అవుతాయి. జుట్టుసంరక్షణకు సహజ సిద్ధంగా దొరికే న్యాచురల్ పద్ధతులను ఉపయోగించడం మంచిది. అప్పుడే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. పూర్వకాలంలో మన పెద్దలు కుంకుడు కాయలతో తలంటు స్నానం చేసేవారు.
అందుకే వారి జుట్టు పొడుగ్గా అందంగా నల్లగా ఉండేది. ఇటువంటి జుట్టు సమస్యలు ఉండేవి కాదు. జుట్టు సంరక్షణకు కుంకుడు కాయలతో తలంటు స్నానం (Head bath) చేయడం మంచిది. కుంకుడు కాయలలో ఉండే విటమిన్స్ కొత్త ఫాలికల్స్ ను పెరిగేలా చేస్తుంది. ఇది నేచురల్ షాంపూగా పనిచేస్తుంది. జుట్టును నల్లగా, మెరిసేలా చేస్తుంది. కుంకుడు కాయలలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు కుదుళ్లలో ఉండే ఇన్ఫెక్షన్లను (Infections) తగ్గిస్తుంది.
ఫంగస్ కారణంగా ఏర్పడే చుండ్రు సమస్యను తగ్గించి జుట్టు రాలిపోవడాన్ని తగ్గిస్తుంది. కుంకుడుకాయ జుట్టుకు మంచి కండీషనర్ గా పనిచేస్తుంది. ఒక గిన్నెలో కొద్దిగా కుంకుడుకాయ పొడి (Kunkudukaya powder), శీకాయ పొడి (Shikaya powder) వేసి మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఇలా చేసుకున్న పేస్ట్ ను స్కాల్ప్, జుట్టు కుదుళ్లకు బాగా అప్లై చేసుకోవాలి. అరగంట తరవాత తలస్నానం చేయాలి.
ఇలా చేయడంతో జుట్టు సమస్యలను తగ్గించి జుట్టు కుదుళ్లు బలంగా ఆరోగ్యంగా (Healthy) ఉండేలా చేస్తుంది. ఇలా తరచూ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇందులో ఉండే విటమిన్లు (Vitamins) జుట్టుకు కావలసిన పోషకాలను అందించి జుట్టు సమస్యలను తగ్గిస్తుంది. కుంకుడు కాయలు జుట్టుకు మంచి కండిషనర్ గా పనిచేస్తాయి. ఇందుకోసం కుంకుడు కాయలు పెంకు తీసి రాత్రంతా నీటిలో నానబెట్టుకోవాలి. కుంకుడు కాయలను వడగట్టి షాంపూల జుట్టు మొత్తానికి అప్లై చేసుకోవాలి.
ఇలా చేయడంతో జుట్టుకు కండిషనర్ (Conditioner) గా పనిచేసి జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది. ఇలా కుంకుడు కాయలతో తరచు తలంటు స్నానం చేస్తే జుట్టు నల్లగా, నిగనిగలాడుతూ, ఒత్తుగా పెరుగుతుంది. కుంకుడు కాయలు సహజసిద్ధమైన షాంపూ (Natural shampoo) గా పనిచేస్తుంది. ఇవి జుట్టు సహజసిద్ధ సౌందర్యాన్ని పెంచుతాయి. బయట మార్కెట్లో దొరికే షాంపూల వాడకం తగ్గించి కుంకుడు కాయలతో తలస్నానం చేయడం మంచిది.