ఈ జ్యూస్ లు షుగర్ పేషెంట్లకు చాలా మంచివి.. తప్పకుండా తాగాలి
డయాబెటీస్ ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం షుగర్ లెవెల్స్ పెరిగినా ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. కొన్ని జ్యూస్ లు షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తాయి. అవేంటంటే?
ఆరోగ్యకరమైన ఆహారం తింటే రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశాలను తగ్గిస్తుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. కొన్ని జ్యూస్ లు డయాబెటీస్ ఉన్నవారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ జ్యూస్ లు టేస్టీగా ఉండటమే కాకుండా.. మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగకుండా కూడా చేస్తాయి.
ఈ జ్యూస్ లు డయాబెటిస్ ను కంట్రోల్ చేయడానికి బాగా సహాయపడతాయి. అంతేకాదు ఈ జ్యూస్ లల్లో ఎన్నో రకాల పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మీ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతాయి. అందుకే అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
కీరదోసకాయ జ్యూస్
కీరదోసకాయ జ్యూస్ మధుమేహులకు చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇది డయాబెటీస్ పేషెంట్లకు మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ జ్యూస్ లో పిండిపదార్థాలు, కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. తక్కువ పిండి పదార్థాల వల్ల ఇది తాగితే మీ రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉండదు.
అంతేకాకుండా దీనిలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని తాగితే మీ శరీరం కూడా హైడ్రేట్ గా ఉంటుంది. అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా నియంత్రణలో ఉంటాయి. ఇందుకోసం కీరదోసకాయను చిన్న చిన్న ముక్కలుగా కోసి మిక్సీలో వేసి జ్యూస్ చేయండి. కావాలనుకుంటే మీరు ఈ జ్యూస్ లో టేస్ట్ కోసం నిమ్మరసం, చిటికెడు ఉప్పును కూడా కలుపుకోవచ్చు.
బచ్చలికూర జ్యూస్
బచ్చలికూర డయాబెటీస్ పేషెంట్లకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అలాగే పిండి పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ బచ్చలికూరను మీరు సలాడ్ గా, వెజిటేబుల్ గా జ్యూస్ గా కూడా తీసుకోవచ్చు.
బచ్చలికూరలో ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరిచే సమ్మేళనాలు కూడా ఉంటాయి. ఈ జ్యూస్ ను తాగితే బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. బచ్చలికూర జ్యూస్ ను తయారు చేయడానికి బచ్చలికూర ఆకులను బాగా కడగండి.
వీటిని బ్లెండ్ చేసి జ్యూస్ తయారుచేయండి. కావాలనుకుంటే దీనిలో కొద్దిగా నిమ్మరసాన్ని కూడా కలుపుకుని తాగొచ్చు. నిమ్మరసంలో విటమిన్ సి ఉంటుంది. ఇది ఇనుము శోషణను మెరుగుపరుస్తుంది.
గ్రీన్ ఆపిల్ జ్యూస్
ఆపిల్స్ లో నేచురల్ షుగర్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ గ్రీన్ ఆపిల్స్ లో మాత్రం ఇతర పండ్ల కంటే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. గ్రీన్ ఆపిల్స్ లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది.
ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి బాగా సహాయపడుతుంది. వీటితో పాటుగా గ్రీన్ ఆపిల్ జ్యూస్ ను తాగడం వల్ల మీ శరీరానికి విటమిన్ ఎ, విటమిన్ సి, పొటాషియం మొదలైనవి కూడా అందుతాయి. ఈ జ్యూస్ ను తయారు చేయడానికి గ్రీన్ ఆపిల్ ను మిక్సీ పట్టి వడకట్టి తాగండి.
Beetroot Juice
బీట్ రూట్ జ్యూస్
బీట్రూట్ జ్యూస్ చాలా టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా ఇది మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారు దీన్ని ఖచ్చితంగా తాగాలి. ఎందుకంటే బీట్ రూట్లలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.
బీట్రూట్ ఇతర కూరగాయల కంటే కొంచెం ఎక్కువ షుగర్ కంటెంట్ ను కలిగి ఉంటుంది. అయినప్పటికీ.. దీనిలో ఎక్కువ మొత్తంలో ఉండే ఫైబర్ కంటెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది.