థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే ఈ చిట్కాలు పాటించండి!
థైరాయిడ్ గ్రంథి హార్మోన్ల ఉత్పత్తిలో అసమతుల్యత కారణంగా థైరాయిడ్ సమస్య ఏర్పడుతుంది. ప్రస్తుత కాలంలో ఈ సమస్య అందరిలోను సర్వసాధారణం అయ్యింది.

థైరాయిడ్ సమస్య రావడానికి ముఖ్య కారణం తీసుకునే ఆహారంలోని పోషకాల లోపం, సరైన శారీరక శ్రమ లేకపోవడం, అధిక బరువు. అయితే ఈ సమస్యను తగ్గించుకోవడానికి మందులను వాడిన సరైన ఫలితం లభించక నిరాశ చెందుతారు. అయితే ఇంటిలో ఉండే కొన్ని పదార్థాలతో ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. అదేలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
థైరాయిడ్ గ్రంథి శరీరంలోని ప్రతి కణానికి అవసరమైన హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ హార్మోన్ల ఉత్పత్తి అసమతుల్యత శరీరంలోని కణాలపై ప్రభావితం చూపి అనారోగ్యానికి దారితీస్తుంది. థైరాయిడ్ సమస్య మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. శరీరంలో వచ్చే మార్పులను గమనిస్తూ ఈ సమస్యను అంచనా వేయవచ్చు. ఇది గొంతు కింద సీతాకోకచిలుక ఆకారంలో ఉంటుంది. థైరాయిడ్ రెండు రకాలు. హైపో థైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం.
ఈ సమస్యలు ఉన్నప్పుడు మనకు కనిపించే లక్షణాలు బరువులో హెచ్చు తగ్గులు, తీవ్రమైన అలసట, జుట్టు రాలడం, అధిక చెమటలు, బలహీనంగా అనిపించడం, అధిక విరేచనాలు, కండరాల నొప్పులు, చర్మం పొడిబారి నల్లగా మారడం, మలబద్ధకం, జ్ఞాపకశక్తి లోపించడం, గుండె వేగంగా కొట్టుకోవడం, కాళ్లు వాపు రావటం, నెలసరులు క్రమంగ రాకపోవటం. ఈ లక్షణాలు మీలో ఉంటే థైరాయిడ్ సమస్యగా పరిగణించి ప్రారంభ దశలోనే కొన్ని చిట్కాలను ప్రయత్నిస్తే థైరాయిడ్ సమస్య నుంచి శాశ్వత పరిష్కారాన్ని పొందవచ్చు.
గుమ్మడి గింజలు: గుమ్మడి గింజలలో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఇది థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తికి, నియంత్రణకు సహాయపడుతుంది. కనుక థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు గుమ్మడి గింజలను తరచూ తీసుకోవాలి. ఇందుకోసం ఒక స్పూన్ గుమ్మడి గింజలను తీసుకొని ఒక స్పూన్ తేనెలో గంట పాటు నానబెట్టుకోవాలి. గంట తరువాత ఈ గింజలను తీసుకుంటే థైరాయిడ్ శాశ్వతంగా తగ్గుతుంది.
అల్లం, దాల్చిన చెక్క: ఒక గిన్నె తీసుకొని అందులో రెండు గ్లాసుల నీళ్లు, అల్లం తరుగు, సగం స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి ఐదు నుంచి పది నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించిన నీటిని గోరువెచ్చగా ఉన్నప్పుడు వడగట్టుకుని అందులో ఒక స్పూన్ నిమ్మరసం, ఒక స్పూన్ నారింజ రసం, రెండు స్పూన్ ల క్రాన్బెర్రీస్ జ్యూస్ వేసి కలుపుకుని తాగాలి. ఇలా క్రమం తప్పకుండా తీసుకుంటే థైరాయిడ్ నుంచి ఉపశమనం కలుగుతుంది.
వాము, జీలక,ర్ర ధనియాలు, సోంపు: ఒక గిన్నె తీసుకొని రెండు గ్లాసుల నీళ్లు పోసుకుని ఒక స్పూన్ వాము, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ సోంపు గింజలు వేసి రాత్రంతా నానబెట్టుకోవాలి. ఇలా రాత్రంతా నానబెట్టుకున్న నీళ్లను గింజలతో సహా అయిదు నిమిషాల పాటు మరిగించి వడగట్టుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకోవాలి. ఇలా రోజులో రెండు సార్లు తీసుకుంటే థైరాయిడ్ శాశ్వతంగా తగ్గుతుంది.