వీరికి టీ, కాఫీలు అమృతంతో సమానం.. రోజూ ఓ కప్పు తాగితే సమస్యలు హాంఫట్
Asthma: ఆస్తమా రోగులు చల్లని వాతావరణంలో శ్వాసకోశ సమస్యలతో బాధపడుతుంటారు. పసుపు పాలు, చక్కెర లేని బ్లాక్ టీ లేదా కాఫీ, అల్లం, యూకలిప్టస్ ఆయిల్ వంటింటి చిట్కాలు ఆస్తమా లక్షణాల నుండి ఉపశమనాన్ని అందిస్తాయి.

శ్వాసకోశ సమస్యలు
చలికాలం లేదా వాతావరణం చల్లగా మారినప్పుడు ఆస్తమా ఉన్నవారికి శ్వాసకోశ సమస్యలు తీవ్రమవుతాయి. దగ్గు, జలుబు వంటివి సహజంగా వచ్చేవి అయినా, ఆస్తమా రోగులకు మాత్రం శ్వాస తీసుకోవడం చాలా కష్టంగా మారుతుంది. ఈ సమయంలో వైద్యుల సూచన మేరకు మందులు వాడటంతో పాటు, సరైన ఆహార నియమాలు పాటించడం, కొన్ని ఇంటి చిట్కాలు అనుసరించడం ద్వారా ఆస్తమా లక్షణాల నుండి ఉపశమనం పొందవచ్చు.
పసుపు
ఆస్తమా నియంత్రణకు ఎంతగానో ఉపయోగపడుతుంది. పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది ఆస్తమా వల్ల కలిగే మంటను తగ్గించి, ఉపశమనాన్ని అందిస్తుంది. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు కలుపుకొని తాగాలి. దీనిని క్రమం తప్పకుండా చేయడం వల్ల ఆస్తమా లక్షణాల తీవ్రత తగ్గుతుంది.
టీ, కాఫీ
ఆస్తమా రోగులకు టీ, కాఫీ కూడా మేలు చేస్తాయి. తరచూ చక్కెర లేని బ్లాక్ టీ లేదా బ్లాక్ కాఫీ తాగడం వల్ల ఉపశమనం లభిస్తుంది. వీటిలో ఉండే కెఫీన్ శ్వాసనాళాలపై పడే ఒత్తిడిని తగ్గిస్తుంది. దీనివల్ల శ్వాసనాళాల వాపులు తగ్గి, శ్వాస తీసుకోవడం సులభతరం అవుతుంది. అయితే, కెఫీన్‌ను మరీ ఎక్కువగా తీసుకోకూడదు. రోజుకు మూడు కప్పుల టీ లేదా కాఫీ మాత్రమే తాగడం శ్రేయస్కరం. అంతకుమించి తాగడం వల్ల ప్రతికూల ప్రభావాలు ఉండవచ్చు.
అల్లం
అల్లం కూడా ఆస్తమాను తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. అల్లం సహజంగానే కఫహర గుణాలను కలిగి ఉంటుంది. ఇది గొంతులో, ఊపిరితిత్తులలో పేరుకుపోయిన కఫాన్ని తొలగించి, శ్వాసనాళాలను శుభ్రపరచడంలో సహాయపడుతుంది. అల్లం టీ గానూ లేదా ఆహారంలోనూ తీసుకోవచ్చు.
యూకలిప్టస్ ఆయిల్
యూకలిప్టస్ ఆయిల్ ఉపయోగించడం ద్వారా కూడా ఆస్తమా లక్షణాల నుండి ఉపశమనం పొందవచ్చు. ఇది శ్వాసనాళాలలో ఉండే దీర్ఘకాలిక మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే, శ్వాసనాళాల వాపులను తగ్గించి, కఫాన్ని కరిగించి, శ్వాస ప్రక్రియను సులభతరం చేస్తుంది. నిద్రపోయేటప్పుడు ఒక కర్చీఫ్ మీద కొన్ని చుక్కల యూకలిప్టస్ ఆయిల్ వేసి, దానిని ముక్కుకు దగ్గరగా పెట్టుకుని పీల్చడం. లేదా.. మరుగుతున్న నీటిలో కొద్దిగా యూకలిప్టస్ ఆయిల్ వేసి, ఆ వచ్చే ఆవిరిని బాగా పీల్చడం. ఈ పద్ధతులు శ్వాసనాళాలను క్లియర్ చేసి, ఊపిరి సజావుగా పీల్చుకోవడానికి దోహదపడతాయి.