రోజూ ఒక చెంచా వెన్న తిన్నా చాలు.. ఈ సమస్యలన్నీ తగ్గిపోవడానికి..
వెన్నలో విటమిన్ ఎ, విటమిన్ బి12 పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు దీనిలో కాల్షియం కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. రోజూ ఒక చిన్నచించా వెన్నను తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి.
వెన్నను తినని వారు అస్సలు ఉండదు. ఇది టేస్టీగా ఉండటమే కాదు మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను కూడా అందిస్తుంది. విటమిన్లు, ప్రోటీన్లు సమృద్ధిగా ఉండే వెన్నను మన రోజువారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. వెన్నలో విటమిన్ ఎ, విటమిన్ బి12 పుష్కలంగా ఉంటాయి. అలాగే వెన్నలో కాల్షియం కూడా ఉంటుంది. ఈ కాల్షియం మన ఎముకలు, దంతాల ఎదుగుదలకు, బలంగా, ఆరోగ్ంయగా ఉండేందుకుసహాయపడుతుంది. వెన్నతో ఎన్ని లాభాలున్నా దీనిని లిమిట్ లోనే తినాలి. రెగ్యులర్ గా వెన్న ను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇమ్యూనిటీ పవర్
మన ఇమ్యూనిటీ పవర్ ఎంత ఎక్కువగా ఉంటే.. మనం అంత ఎక్కువ ఆరోగ్యంగా, ఎలాంటి రోగాలు లేకుండా ఉంటాం. అయితే వెన్నను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది అంటువ్యాధులు, ఇతర రోగాల నుంచి మనల్ని రక్షిస్తుంది.
butter
చర్మం, జుట్టు ఆరోగ్యం
వెన్నలో విటమిన్ ఎ, విటమిన్ ఇ, విటమిన్ డి, విటమిన్ కె లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఎ పుష్కలంగా ఉండే వెన్నను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. వెంట్రుకలు బలంగా అవుతాయి. చర్మం తేమగా ఉంటుంది.
మలబద్దకం
మలబద్దకాన్ని నివారించడానికి వెన్న ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ప్రతిరోజూ ఉదయం పరగడుపున వెన్న తీసుకోవడం వల్ల మలబద్దకం వంటి జీర్ణ సమస్యలను దూరం చేసుకోవచ్చు.
నెలసరి కడుపు నొప్పి
పీరియడ్స్ సమయంలో కొంతమందికి విపరీతమైన కడుపు నొప్పి, తిమ్మిరి వంటి సమస్యలు వస్తాయి. అయితే ఈ సమయంలో వెన్నను తీసుకోవడం వల్ల నెలసరి నొప్పి, ఉబ్బరం, తిమ్మిరి వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
తల్లిపాలు
పాలిచ్చే తల్లులు కూడా ప్రతిరోజూ కొద్దిగా వెన్న తినడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఇది మీ పాల ఉత్పత్తిని పెంచుతుంది. అలాగే మిమ్మల్ని రీఫ్రెష్ గా ఉంచడానికి సహాయపడుతుంది.
కంటి ఆరోగ్యం
వెన్నలో బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది కంటిచూపును మెరుగుపరుస్తుంది. అలాగే కంటి ఆరోగ్యాన్ని పెంచడానికి కూడా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.
చర్మ సంరక్షణ
చర్మ సంరక్షణకు కూడా వెన్న ఎంతో సహాయపడుతుంది. ప్రతిరోజూ కొద్దిగా వెన్నను ముఖానికి రాసుకుంటే ముఖంపై నల్లటి మచ్చలు తొలగిపోతాయి. పగిలిన పదాలకు రోజూ కొద్దిగా వెన్నను అప్లై చేయడం వల్ల పగుళ్లు తగ్గుతాయి. పొడిబారిన పెదాలకు కూడా వెన్నను అప్లై చేయొచ్చు.