ఫుడ్ ను బాగా నమిలి తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా?
చాలా మంది ఎవరో తరుముతున్నట్టుగానే తింటుంటారు. కొందరైతే కేవలం ఐదు నిమిషాల్లోనే భోజనాన్ని కంప్లీట్ చేస్తారు. ఇలా తినడం వల్ల ఫుడ్ ను సరిగ్గా నమలరు. కానీ ఇది ఎన్నో సమస్యలకు దారితీస్తుంది తెలుసా..?

eating food
ఆహారాన్ని బాగా నమిలి తినాలని చాలా మంది చెప్తుంటారు. కానీ తీరికలేని పనులు, హడావుడిగా తినే అలవాటున్నవారు మాత్రం ఫుడ్ ను అస్సలు నమలరు. కానీ ఇది అస్సలు మంచి పద్దతి కాదు. ఇది అజీర్థి వంటి ఎన్నో సమస్యలకు దారితీస్తుంది. అసలు ఆహారాన్ని బాగా నమిలి తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
జీర్ణక్రియకు మేలు
మన జీర్ణక్రియ విధులకు అంతరాయం కలిగితే అది మన మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా జీర్ణసమస్యలు వస్తాయి. అయితే జీర్ణ సమస్యలను నివారించడానికి మనం తినే సమయం నుంచి చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆహారాన్ని ఎంత సేపు నమలాలన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఆహారాన్ని సరిగ్గా నమిలినప్పుడు ..అది నోటిలోనే విచ్ఛిన్నమవుతుంది. దీనివల్ల లోపలికి వెళ్లిన ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది.
జీర్ణక్రియకు మాత్రమే కాదు
ఆహారం నోటిలో విచ్ఛిన్నమైన తర్వాత శరీరం దాని నుంచి పోషకాలను త్వరగా గ్రహించగలుగుతుంది. కాబట్టి మనం తినే ఆహారం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
eating
బరువు పెరగకుండా ఉంటారు
టీవీ, ఫోన్ లను చూస్తూ తినేవారు చాలా మందే ఉన్నారు. కానీ వీటిని చూస్తూ తింటే భోజనం త్వరగా అయిపోతుంది. కానీ వీళ్లు అతిగా తినే అవకాశం ఉంది. అయితే మీరు ఆహారాన్ని బాగా నమిలి తింటే మీరు అతిగా తినరు. ఇది బరువు పెరగకుండా ఉండటానికి, మొత్తం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
కేలరీలు
ఆహారాన్ని చాలా నెమ్మదిగా తినడం, నమలడం వల్ల ఎక్కువ కేలరీలు శరీరానికి చేరవని నిపుణులు చెబుతున్నారు. ఇది ఆరోగ్యానికి కూడా మంచిది. బరువు పెరగకుండా ఉంటారు.
eating pasta
జీర్ణ సమస్యలు
సహజంగా జీర్ణ సమస్యలు ఉన్నవారు చాలా మందే ఉన్నారు. వీరికి తిన్న తర్వాత కొంత అసౌకర్యంగా ఉంటుంది. ఆహారాన్ని నమలడం, నెమ్మదిగా తినడం వల్ల ఇలాంటి ఇబ్బందులేమీ ఉండవు.
ఆహారాన్ని తింటే శరీరానికే కాదు మనసుకు కూడా ఆనందం కలుగుతుంది. మనస్సు ప్రతిస్పందన జీర్ణ విధులపై కూడా ఎంతో ప్రభావాన్ని చూపుతుంది. అందుకే ఆహారాన్ని ఆస్వాదించడం మంచిది. ఇది భోజనం తర్వాత నిద్రమత్తుగా అనిపించడానికి బదులుగా రిఫ్రెష్ గా ఉండటానికి సహాయపడుతుంది.