పిల్లల్ని కనాలనుకుంటున్నారా? అయితే ఇలా చేయండి..
ప్రస్తుతం చాలా మంది సంతానలేమి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే కొన్ని చిట్కాలతో సంతానోత్పత్తిని పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

fertility
సంతానలేమి కుటుంబాన్నంతా మానసిక ఒత్తిడికి గురిచేస్తుంది. ఈ సమస్యను హోం రెమెడీస్ తో పరిష్కరించుకోవచ్చు. శరీరంలో పోషకాలు లేకపోవడం వల్ల ఇలా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనితో పాటుగా కొన్ని హార్మోన్ల మార్పుల వల్ల కూడా సంతానలేమి సమస్య వస్తుంది.
సమతుల్య ఆహారం తీసుకోకపోవడం, తప్పుడు జీవనశైలి కారణంగా చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఇవి వీర్యకణాల నాణ్యతను, సాంద్రతను తగ్గిస్తాయి. 25 నుంచి 30 శాతం మందిలో ఈ సమస్య కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. మెరుగైన సెక్స్, పునరుత్పత్తి ఆరోగ్యం కోసం కొన్ని చిట్కాలు మీకోసం..
Image: Getty Images
దాల్చిన చెక్క
దాల్చిన చెక్కను సంతానలేమి సమస్యను పరిష్కరించడానికి ఉపయోగిస్తారు. హార్మోన్ల సమస్యలను అధిగమించడానికి దాల్చిన చెక్క ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీనిని వినియోగించడం వల్ల మహిళలు గర్భందాల్చే అవకాశం ఉంది. ఇందుకోసం దాల్చిన చెక్క పొడిని వేడినీటిలో కలిపి తాగాలి. కావాలనుకుంటే ఈ నీటిలో తేనెను మిక్స్ చేసి కలిపి తాగొచ్చు. ఇది సంతానలేమి సమస్య తగ్గిస్తుంది.
నువ్వుల నూనె
నువ్వుల నూనె శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది మీ శరీరానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. ఇది సంతానలేమి సమస్యను కూడా తగ్గిస్తుంది. ఇందుకోసం నువ్వుల నూనెతో కడుపునకు మసాజ్ చేయడం వల్ల ఆక్సిజన్ ప్రవాహం మెరుగుపడుతుంది. అలాగే గర్భాశయంలో రక్త ప్రసరణ సమానంగా ఉంటుంది. ఇది సంతానోత్పత్తిని పెంచుతుంది. వీటితో పాటుగా నువ్వుల నూనెను ఆహారంలో తీసుకోవచ్చు. నువ్వుల నూనె శరీరానికి ఈ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
Image: Getty Images
గుమ్మడికాయ గింజలు
గుమ్మడికాయను కూరగా చేసుకుని తినేవారు చాలా మందే ఉన్నారు. కానీ గుమ్మడికాయ కూరతో పాటుగా దాని విత్తనాలు కూడా ప్రయోజనకరంగా ఉంటాయని మీకు తెలుసా? గుమ్మడి గింజలు శృంగారానికి సంబంధించిన సమస్యలకు ప్రయోజనకరంగా ఉంటాయి. గుమ్మడి గింజలు సంతానోత్పత్తిని పెంచుతాయి. ఈ గింజల్లో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజూ ఒక స్పూన్ గుమ్మడి గింజలను తీసుకోవడం వల్ల సంతానోత్పత్తి పెరుగుతుంది. గుమ్మడి గింజలు శరీరంలోని గర్భాశయ సమస్యను తొలగిస్తాయి.