ఊబకాయం తగ్గాలంటే ఇది పెరగాల్సిందే..!
పేలవమైన జీవక్రియ మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. జీవక్రియ నెమ్మదిగా ఉంటే బరువు బాగా పెరిగిపోతారు. మరెన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.

weight loss
ఆరోగ్యకరమైన శరీరానికి సరైన జీవక్రియ రేటు ఉండటం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. జీవక్రియ అనేది శరీర కణాలలో ఒక రకమైన రసాయన ప్రతిచర్య. ఇది ఆహారాన్ని శక్తిగా మారుస్తుంది. మన శరీరానికి ఏదైనా పని చేయడానికి జీవక్రియ ప్రక్రియ నుంచి శక్తి అవసరం. జీవక్రియ ప్రోటీన్లను అమైనో ఆమ్లాలుగా విచ్ఛిన్నం చేస్తుంది. కొవ్వును కొవ్వు ఆమ్లాలుగా మారుస్తుంది. కార్బోహైడ్రేట్లను సాధారణ చక్కెరలుగా మారుస్తుంది. దీంతో శరీరానికి కావాల్సినంత శక్తిని అందిస్తుంది. ఆరోగ్యకరమైన జీవక్రియ మనలను సమతుల్యంగా ఉంచుతుంది. ఆకలిని కలిగిస్తుంది. జీవక్రియ మందగిస్తే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఊబకాయం పెరుగుతుంది. మెటబాలిజం మెరుగ్గా ఉంటే ఊబకాయం, డయాబెటీస్ కంట్రోల్ లో ఉంటాయి.
నువ్వులు
నువ్వుల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది బరువు తగ్గడానికి ఎంతో సహాయపడుతుంది. ఇది మీ జీవక్రియను పెంచి బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది. నువ్వులు కార్బోహైడ్రేట్ కోరికలను నియంత్రిస్తుంది, దీని వల్ల మీరు అదనపు కొవ్వును తీసుకోరు. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. సహజ విత్తనాలు ఫైబర్ కు అద్భుతమైన మూలం. ఇది జీర్ణవ్యవస్థను సమతుల్యంగా ఉంచుతుంది
Image: Getty Images
కాఫీ
నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. కాఫీలోని కెఫిన్ జీవక్రియను బాగా పెంచుతుంది. అలాగే కొవ్వు నియంత్రణకు కూడా సహాయపడుతుంది. ఇది వ్యాయామం చేసేటప్పుడు, విశ్రాంతి తీసుకునేటప్పుడు శరీరం కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. మీరు వ్యాయామం మరింత చేసేలా చేస్తుంది. శరీర జీవక్రియను పెంచడానికి తేనె, దాల్చినచెక్క లేదా కొబ్బరి నూనెను మీ కాఫీకి జోడించొచ్చు.
గుడ్డు
గుడ్లు ఎన్నో ముఖ్యమైన పోషకాలకు గొప్ప వనరు. ఇది మన శరీరానికి అవసరమైన అన్ని అమైనో ఆమ్లాలను అందిస్తుంది. ఇందులో ఉండే ప్రోటీన్ మెటబాలిజంను పెంచుతుంది. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం జీవక్రియను పెంచతుంది. జీవక్రియను పెంచేటప్పుడు కేలరీలు బర్న్ అవుతాయి. ఇవి సులభంగా జీవక్రియ చేయబడతాయి. శరీరానికి తగినంత శక్తిని అందిస్తాయి. రోజూ గుడ్డును తింటే మీ శరీరం నుంచి అదనపు కేలరీలు బర్న్ అవుతాయి. దీంతో మీరు సులువుగా బరువు తగ్గుతారు.
GREEN APPLE
గ్రీన్ ఆపిల్
పబ్ మెడ్ సెంట్రల్ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. గ్రీన్ ఆపిల్ లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు దీనిలో ఎన్నో ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. ఫైబర్ జీర్ణవ్యవస్థను సరిగ్గా నియంత్రించడానికి సహాయపడుతుంది. అలాగే నిర్విషీకరణ ప్రక్రియను ప్రోత్సహిస్తుంది. ఇది జీవక్రియను పెంచేటప్పుడు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. గ్రీన్ ఆపిల్ ఇనుము కు గొప్ప మూలం. ఇది శరీరంలో ఆక్సిజన్ శోషణకు సహాయపడుతుంది. శరీర జీవక్రియను ప్రోత్సహిస్తుంది.
flax seeds
అవిసె గింజలు
అవిసె గింజలలో ప్రోటీన్, విటమిన్లు, ఎన్నో ఇతర ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇది మొత్తం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. అవిసె గింజలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీవక్రియ బాగా పెరుగుతుంది. అలాగే ఇవి జీవక్రియ సిండ్రోమ్ ను మెరుగుపరుస్తాయి. మెటబాలిక్ సిండ్రోమ్ డయాబెటిస్, ఊబకాయం, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.
నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ 2019 లో ప్రచురించిన ఒక అధ్యయనం.. అవిసె గింజలలోని ప్రోటీన్, ఫైబర్, అలాగే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు వంటి ముఖ్యమైన పోషకాలు జీవక్రియను పెంచుతాయి. బరువు తగ్గడాన్ని సులభతరం చేస్తాయని నివేదించింది.