MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • బరువు తగ్గడానికి వ్యాయామం.. శ్వాస కూడా చాలా ముఖ్యం..!

బరువు తగ్గడానికి వ్యాయామం.. శ్వాస కూడా చాలా ముఖ్యం..!

సరిగ్గా శ్వాస తీసుకోవడం మీ వ్యాయామాన్ని మరింత ప్రభావవంతంగా చేస్తుంది, మీ హృదయనాళ వ్యవస్థను బలపరుస్తుంది. కండరాల దృఢత్వాన్ని తగ్గిస్తుంది. 

2 Min read
Author : ramya Sridhar
Published : Feb 01 2022, 09:46 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

కరోనా మహమ్మారి సమయంలో  చాలా మంది వ్యాయామాలకు దూరమయ్యారు. అంతకముందు రోజూ వెళ్లే  జిమ్‌లు మూతపడిపోయాయి. దీంతో, చాలా మంది ఫిట్‌గా ,యాక్టివ్‌గా ఉండటానికి రన్నింగ్ మీద దృష్టి పెట్టారు. 

28
exercise

exercise

రన్నింగ్ చేయడానికి మనకు ప్రత్యేకంగా ఎలాంటి పరికరాలు అవసరం లేదు. సామాజిక దూరం పాటిస్తూ.. మనకు మనంగా రన్నింగ్ చేసుకొని.. ఫిట్ గా ఉండేందుకు ప్రయత్నించవచ్చు. రన్నింగ్ మంచి కార్డియో వ్యాయామం గా పనిచేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడుతుంది.

38

రోజూ ఒక మోస్తరు వేగంతో 30 నిమిషాల రన్నింగ్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరతాయి.  అయితే.. ఈ రన్నింగ్ చేసేటప్పుడు మనం శ్వాస మీద కచ్చితంగా దృష్టి పెట్టాలి. మనం శ్వాస ఎలా తీసుకుంటున్నామనే విషయం పైనే.. మనం ఎంత పరిగెడుతున్నామనేది ఆధారపడుతుంది.  అదే.. చివరకు మనం శీరరంలో క్యాలరీలు కరిగేలా  చేస్తుంది. 

48

ఏదైనా వ్యాయామాలు చేసేటప్పుడు మనలో చాలా మందికి శ్వాసను బిగపడతారు. ఇలా చేయడం వల్ల మీ రక్తపోటు పెరుగుతుంది, మైకము, వికారం లేదా గుండెపోటు కూడా సంభవించవచ్చు. సరిగ్గా శ్వాస తీసుకోవడం మీ వ్యాయామాన్ని మరింత ప్రభావవంతంగా చేస్తుంది,

58
breathing exercise

breathing exercise

 మీ హృదయనాళ వ్యవస్థను బలపరుస్తుంది. కండరాల దృఢత్వాన్ని తగ్గిస్తుంది. నడుస్తున్న సందర్భంలో కూడా, సరిగ్గా శ్వాస తీసుకోవడం వేగంగా పరిగెత్తడానికి సహాయపడుతుంది, కిలోల బరువు తగ్గించుకోవడానికి లేదా మారథాన్‌కు సిద్ధం కావడానికి కేలరీలను బర్న్ చేయాలనుకునే వారికి ఇది చాలా అవసరం.

68
breathing exercise

breathing exercise

మనం రన్నింగ్ చేసేటప్పుడు.. నడిచేటప్పుడు.. మన కాళ్ల అడుగులు ముందుకు కదిలేదానిని మనం శ్వాస తీసుకోవడాన్ని రెండు సింక్ చేయాలి. కచ్చితంగా శ్వాస మీద దృష్టి పెట్టాలి. ఊపిరి పీలుస్తూ.. వదులుతూ రన్నింగ్ చేయాలి. ఎలా అంటే.. మన పాదాల కదలికలు.. ఊపిరి పీల్చడం, వదలడం రెండూ లయ బద్దంగా జరగాలి. ఆ సమయంలో మన వెన్ను నిటారుగా ఉంచాలి. ఇలా చేయడం వల్ల.. సులభంగా బరువు తగ్గే  అవకాశం ఎక్కువగా ఉంటుంది

78

సాధారణంగా, మనమందరం మన ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటాము. ముక్కుతో ఊపిరి తీసుకోవడం వల్ల ఆ గాలి ఊపిరితిత్తులకు చేరేలోపు గాలిని శుద్ధి చేస్తాయి. ఏదైనా వ్యాయామం చేసేటప్పుడు మనం ముక్కు ద్వారా శ్వాస పీల్చుకోవచ్చు. అదేవిధంగా  నోటి ద్వారా ఊపిరి పీల్చుకోవచ్చు.

88

 రన్నింగ్ చేసే సమయంలోనూ  మీరు అనుసరించగల రెండు పద్ధతులు ఉన్నాయి. మొదట, మీ ముక్కు ద్వారా శ్వాస తీసుకోండి . లేదంటే.. మీ నోటి ద్వారా శ్వాస తీసుకోండి. ఎక్కువగా అలసిపోయినప్పుడు.. నోటితో శ్వాస తీసుకోవాలి. మామూలుగా అయితే.. ముక్కుతో శ్వాస తీసుకోవచ్చు. ఇది అలవాటు కావడానికి... ప్రాణయామం, కపాలాబాతి వంటివి ప్రాక్టీస్ చేయడం వల్ల.. శ్వాసను మెరుగుపరుచుకోవచ్చు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Dry Fish vs Fresh Fish: ఎండుచేపలు, పచ్చిచేపల్లో ఆరోగ్యానికి ఏది మంచిది?
Recommended image2
Heart Attack: గ్యాస్ సమస్య అని వదిలేయకండి, ఉదయం ఈ 6 లక్షణాలు గుండెపోటుకు సంకేతం
Recommended image3
Broccoli Benefits: బ్రకోలీ తింటే ఈ జబ్బులు మీ దరిచేరవు, అవేంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved